Bigg Boss 7 Telugu: రోజురోజుకు ప్రేక్షకులకు నచ్చేస్తున్న శివాజీ.. బిగ్ బాస్ షోలో అసలైన హీరో ఇతనేనా?

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ సెవెన్ కార్యక్రమం ఉల్టా పుల్టా అంటూ ఈ సీజన్ కాస్త ఆసక్తికరంగానే ఉండబోతుందని మొదటి నుంచి నాగార్జున చెబుతూనే వచ్చారు. మీ ఊహలకు అంచనాలకు అందని విధంగా ఈ కార్యక్రమం ఉండబోతుందని చెబుతూ వచ్చారా అయితే అందుకు అనుగుణంగానే ఈ కార్యక్రమం కూడా కొనసాగుతుందని చెప్పాలి. ఇక ఐదవ వారంలో కొనసాగుతున్నటువంటి ఈ కార్యక్రమంలోని కంటెస్టెంట్లు రెండు గ్రూపులుగా విడిపోయారు.

సీరియల్ బ్యాచ్ అంతా ఒకవైపు ఉండగా శివాజీ కూడా గ్రూప్ గా విభజించారు . ఇక శివాజీ గ్రూప్లో ఉన్నటువంటి పల్లవి ప్రశాంత్, యావర్ వంటి వారందరిని ఈయన ఎంతో ఎంకరేజ్ చేస్తూ వారిని ప్రోత్సహిస్తూ ఎక్కడ మరొక బ్యాచ్ కి అవకాశం ఇవ్వకుండా అందరి చేత ఎంతో గొప్పగా ఈ ఆట ఆడిస్తున్నారు. మొదట్లో బిగ్ బాస్ దత్తపుత్రుడు అని ఎన్నో విమర్శలను ఎదుర్కొన్నారు.

ఇక ఇప్పుడు చూస్తే మాత్రం ఈయన ఆటతీరులో ఎంతో మార్పు వచ్చింది. పెద్దమనిషిగా వ్యవహరిస్తూనే తన ఆటను కూడా ఆడుకుంటూ అందరి చేత మన్ననలను పొందుతున్నాడు శివాజీ.ఇక మొట్టమొదటిగా ఈ షోలో బాగా నెగటివ్ పెంచుకుంటున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంతే అది అమర్ దీప్ మాత్రమే. మొదటి నుంచి కూడా పల్లవి ప్రశాంత్ ను టార్గెట్ చేస్తూ వచ్చారు.

ఇక శివాజి బహిరంగంగా ప్రశాంత్ యాదవ్ వంటి వారిని సపోర్ట్ చేస్తూ వారిని ఎంకరేజ్ చేస్తూ వారిని బాగా ఆడిస్తూ సీరియల్ బ్యాచ్ కి దొరకకుండా ఎక్కడా చిక్కకుండా తన తెలివినంత వాడి ఆటను కొనసాగేలా చేస్తున్నాడు. ఇలా ఈయన ఆట తీరులో రోజు రోజుకు ఎంతో మెచ్యూరిటీ వస్తుందని, ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తున్నారని శివాజీ అసలు సిసలైన హీరో అంటూ ఈయనపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -