Shivaji: మరోసారి శివాజీ సంచలన వ్యాఖ్యలు.. ఆ వార్తల్లో నిజం లేదంటూ?

Shivaji: తెలుగు సినీ నటుడు శివాజీ గురించి మనందరికీ తెలిసిందే. ఒకప్పుడు ఎన్నో సినిమాలలో నటించి నటుడిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకున్న శివాజీ ఆ తర్వాత సినిమాలకు దూరమైన విషయం తెలిసిందే. సినిమాలకు దూరమైనప్పటికీ రాజకీయాలలో యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తూ వచ్చాడు. ఇది ఇలా ఉంటే ఇటీవల తెలుగులో ముగిసిన బిగ్ బాస్ సీజన్ సెవెన్ లోకి కాంటెస్ట్ గా ఎంట్రీ ఇచ్చి తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువ అయిన విషయం తెలిసిందే. బిగ్ బాస్ సీజన్ 7 లో శివాజీ ఒక సంచలనం.

 

ఆయన టైటిల్ ఫేవరేట్ గా ప్రచారం అయ్యాడు. అయితే చివరి వారాల్లో అంచనాలు తారుమారు అయ్యాయి. పల్లవి ప్రశాంత్ తన ఆట తీరుతో రేసులోకి దూసుకు వచ్చాడు. అయితే మొదటి నుంచి శివాజీని గెలుస్తాడని అందరూ భావించారు. కానీ ఊహించని విధంగా చివరి వారాల్లో ఆ ఫలితాలు మొత్తం తారు మారువయ్యాయి. ఇది ఇలా ఉంటే బిగ్బాస్ హౌస్కి వెళ్లి వచ్చిన తర్వాత వరుసగా ఇంటర్వ్యూలకు హాజరవుతూ ఫుల్ బిజీబిజీగా గడుపుతున్నాడు శివాజీ. అంతేకాకుండా ఇటీవల సెకండ్ ఇన్నింగ్స్ ని కూడా మొదలుపెట్టిన విషయం తెలిసిందే. నైంటీస్ టైటిల్ తో ఒక వెబ్ సిరీస్ చేశాడు. కాగా శివాజీ పాలిటిక్స్ లోకి వెళ్లి ప్రత్యర్థి పార్టీల మీద ఆరోపణలు చేశాడు. ఈ క్రమంలో అతని మీద కూడా కొన్ని ఆరోపణలు ఉన్నాయి.

తాజాగా ఆ ఆరోపణల పై స్పందించిన శివాజీ కాస్త ఘాటుగా రియాక్ట్ అయ్యారు. తాజా ఇంటర్వ్యూలో తనపై వచ్చిన అలిగేషన్స్ కి శివాజీ సమాధానం చెప్పాడు. శివాజీ ఎప్పటికీ శివన్నే. ఈ ఆస్తులు, సంపాదన ఎవడికి కావాలి. నేను పరిశ్రమకు చొక్కా ప్యాంటు తో వచ్చాను. నాకు ఎలాంటి రిగ్రీట్స్ లేవు అని తెలిపారు శివాజీ. ఇంతలోనే యాంకర్ పాలిటిక్స్ కి వెళ్లి బాగా డబ్బులు సంపాదించాలని టాక్ ఉంది ఆ విషయంపై మీరేమంటారు అని అడగగా.. శివాజీ మాట్లాడుతూ నేను ఏ పార్టీ దగ్గరికి వెళ్లి చేయి చాచి అడ్డుకోలేదు. ఒకవేళ నేను అలా డబ్బులు తీసుకున్నానని నిరూపిస్తే నేను చచ్చిపోతాను అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. నాకు మరో పెళ్లి అయ్యింది. పాప కూడా ఉందని ఆరోపణలు చేశారు. ఇవన్నీ వ్యూస్ కోసం చేసే పనులు మాత్రమే. నా జీవితం అందరికీ తెలిసిందే అన్నాడు. ఇక టైటిల్ కోల్పోవడం మీద కూడా శివాజీ స్పందించాడు. 12 వారం తర్వాత తనను విలన్ గా చూపించారు. అది మైనస్ అయ్యిందని శివాజీ చెప్పుకొచ్చాడు.

 

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -