Sivaji: శివాజీ సొంత చెల్లెలిని లేపుకెళ్లి పెళ్లి చేసుకున్నాడా.. ఆ ఆరోపణల విషయంలో వాస్తవాలివే!

Sivaji: సినీ హీరో శివాజీ గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. దాదాపు 90 సినిమాల వరకు చేసిన శివాజీ ఆపై సినిమాలు పై దృష్టి తగ్గించి రాజకీయాల వైపు దృష్టి మళ్లించారు. ప్రస్తుతం బిగ్ బాస్ లో కంటెస్టెంట్ గా ఉంటూ తనదైన స్టైల్ లో ఎంటర్టైన్ చేస్తున్నారు శివాజీ. అయితే రాజకీయాలలో ఉన్నప్పుడు శివాజీ వేరు, ఇప్పుడు శివాజీ వేరు అన్నట్లుగా ఉంది అతని ప్రవర్తన. బిగ్ బాస్ కి రాకముందు వరకు బీభత్సమైన నెగెటివిటీ ఉండేది శివాజీ పైన.

ఎందుకంటే రాజకీయాల్లోకి వచ్చిన తరువాత ముందు బీజేపీ లో చేరి తర్వాత తెదేపా పార్టీకి వీర విధేయుడు గా మారి గత ఎన్నికల టైం లో ఆపరేషన్ గరుడ అంటూ వైసీపీ పార్టీపై వీడియోలను షేర్ చేసి ఆ పార్టీకి బద్ధ శత్రువుగా మారాడు. ఇప్పుడు రాజకీయాలు అంటే వ్యక్తిగత విషయాలను కూడా బజారున పెట్టే దుస్థితికి తీసుకువచ్చేసారు రాజకీయ నాయకులు. అందులో భాగంగా శివాజీ పెళ్లిపై అప్పట్లో దారుణమైన కామెంట్స్ వచ్చాయి.

శివాజీ చెల్లెలు వరస అయిన అమ్మాయిని లేపుకొని వెళ్లిపోయాడు అంటూ ఆయన పై పర్సనల్ అటాక్ చేశారు తెదేపా వర్గం వారు. అయితే తన పెళ్లి గురించి శివాజీ క్లారిటీ ఇస్తూ నేను పెళ్లి చేసుకున్న అమ్మాయిది అసలు మా కులమే కాదు. మాది చౌదరీల కుటుంబం అయితే ఆమె గౌడ సామాజిక వర్గానికి చెందిన అమ్మాయి. నిజామాబాద్ మాజీ ఎమ్మెల్సీ విజి గౌడ్ తోడల్లుడు కూతురు శ్వేత శివాజీ భార్య.

మాది లవ్ మ్యారేజ్. అలా అని బయట సినిమాలు షికార్లు తిరగలేదు. ఒక ఫంక్షన్ లో ఇద్దరం కలుసుకున్నాం, మాట్లాడుకున్నాం, ఇష్టపడ్డాం తర్వాత మా ఫ్యామిలీ వాళ్ళ ఫ్యామిలీ మాట్లాడుకున్నారు. తర్వాత మా పెళ్లి అయిపోయింది. మధ్యలో ఎక్కువ టైం ఏమీ లేదు. పెళ్లిలో తను కట్నం కూడా ఏమి తీసుకోలేదని తన డబ్బులతోనే పెళ్లి చేసుకున్నానని అయితే తన అత్తింటి వారు స్థితిమంతులే కానీ నేను కట్నం తీసుకోలేదని చెప్పుకొచ్చాడు శివాజీ.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -