Bimbisara Review: ‘బింబిసార’ సినిమా రివ్యూ

విడుదల తేదీ: 05 ఆగస్ట్, 2022
నటీనటులు: కళ్యాణ్ రామ్, క్యాథెరిన్ ట్రెసా, సంయుక్తా మీనన్, ప్రకాశ్ రాజ్, తనికెళ్ళ భరణి, తదితరులు.
సినిమాటోగ్రఫీ: చోటా కె నాయుడు
సంగీతం: చిరంతన్ భట్, వరికుప్పల యాదగిరి, ఎం ఎం కీరవాణి
ఎడిటింగ్: తమ్మిరాజు
నిర్మాత: హరికృష్ణ. కె
రచన-దర్శకత్వం: వశిష్ట

Bimbisara Review and Rating

నందమూరి కళ్యాణ్ రామ్ తన కెరీర్ ప్రారంభం నుంచీ కొత్తగా ట్రై చేసేందుకు ప్రయత్నిస్తుంటాడు. కొత్త దర్శకులను, కొత్త టెక్నీషియన్స్, కొత్త టెక్నిక్స్‌ను పరిచయం చేసేందుకు పరితపిస్తుంటాడు. అలానే ఇప్పుడు వశిష్ట అనే దర్శకుడుని బింబిసార అనే సినిమాతో పరిచయం చేస్తున్నాడు. మరి ఈ చిత్రం కళ్యాణ్ రామ్‌కు ఏ మేరకు ఉపయోగపడింది? ప్రేక్షకులు ఏ మేరకు రిసీవ్ చేసుకున్నారు? అనేది చూద్దాం.

కథ…
క్రీస్తుపూర్వం 5వ శతాబ్దంలో అత్యంత కౄరుడైన త్రిగర్తల సామ్రాజ్యాధినేత బింబిసారుడు. ఓ మాయాదర్పణంతో ప్రస్తుత కాలానికి వస్తాడు. క్రూరుడైన రాజు.. చివరకు గొప్ప మనసున్న రాజుగా ఎలా మారాడు? ఆ కాలం నుంచి వచ్చిన రాజుకు ఈ కాలంలో ఎదురైన పరిస్థితులు ఏంటి? బింబిసారుడు మారడానికి గల కారణాలు ఏంటి? మళ్లీ తన సామ్రాజ్యానికి వెళ్లాడా? వెళ్లాక ఏం చేశాడు? అనేదే బింబిసార కథ.

నటీనటుల పనితీరు: బింబిసార చిత్రంలో కళ్యాణ్ రామ్ తప్పా ఇంకెవ్వరూ కనిపించరు. ఎన్నో పాత్రలున్నా కూడా బింబిసార మాత్రమే మన మీద ప్రభావాన్ని చూపుతుంది. విలనిజం, హీరోయిజం రెంటిని కళ్యాణ్ రామ్ అద్భుతంగా చూపించాడు. ఆ రెండు కారెక్టర్స్‌లో వేరియేషన్స్ చూపిస్తాడు. రెండు పాత్రల్లోనూ కళ్యాణ్ రామ్ అదరగొట్టేస్తాడు. హీరోయిన్లకు అంత ప్రాధాన్యం ఇచ్చారని అనిపించదు. పాటల కోసం వాడుకున్నట్టుగా ఉంటుంది. ఇక మిగిలిన పాత్రల్లో అయ్యప్ప శర్మ, కమెడియన్ శ్రీనివాస్, చమ్మక్ చంద్ర ఇలాంటి వారంతా కూడా బాగానే నటించారు.

విశ్లేషణ…
కొత్త దర్శకుడు, కొత్త కాన్సెప్ట్.. జనాలు ఆదరిస్తారా? లేరా? అనే ఆలోచన లేకుండా.. నిర్మించడానికి ముందుకు వచ్చిన కళ్యాణ్ రామ్‌కు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. ఉన్నపళంగా ఒకానొక కాలానికి చెందిన వ్యక్తి వేరే కాలంలోకి వెళ్లడమనే కాన్సెప్ట్ ఈ మాధ్య జెర్మన్ వెబ్ సిరీస్ డార్క్‌లో పాపులరయింది. మనుసులు ఒక సొరంగం ద్వారా వేరు వేరు కాలాల్లోకి వెళ్లిపోతుంతారు. అలాగే ఇందులో మాయాదర్పణం ద్వారా కాలాల మధ్య ప్రయాణం చేస్తుంటుంది ప్రధానపాత్ర.

రాజులు అన్నాక.. రాజ్యాన్ని విస్తరించుకోవడం, ఎదురు తిరిగిన వాళ్లని హింసించడం, నచ్చకపోతే చిన్నకారణాలకే అమాయకుల్ని చంపేయడం చేస్తుంటారు. అతని నైజం. మద్యం మరియు మగువలతో కాలం గడపడం అతని దినచర్య. ఇలా నెగెటివ్ పాత్రను మళ్లీ తరువాత అంతే పాజిటివ్‌గా మలచడం, ప్రేక్షకులను ఒప్పించేలా చేయడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. ఇక ఈ కథకు తగ్గట్టుగా భారీ వీఎఫెక్స్, సెట్ వర్క్ ఇలా అన్నీ కూడా అద్భుతంగా కుదిరాయి.

పాటలు మాత్రం అంతగా గుర్తుండవు. కానీ కీరవాణి నేపథ్య సంగీతం ఈ సినిమాను ఇంకో స్థాయిలో నిలబెట్టేశాయి. రాజమౌళికి తప్పా మిగతా ఎవ్వరికీ సరిగ్గా కొట్టడు అనే అపవాదుని ఈ చిత్రంతో కీరవాణి పోగొట్టుకున్నాడు. ఇక ఈ చిత్రంలో ఆర్ట్ వర్క్, కెమెరాపనితనం మాత్రం అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. నిర్మాణంలోనూ కళ్యాణ్ రామ్ ఏ మాత్రం వెనక్కి తగ్గలేదు.

ప్లస్ పాయింట్స్…
కళ్యాణ్ రామ్
కథ, కథనం
దర్శకత్వం
నేపథ్య సంగీతం, కెమెరాపనితనం

మైనస్ పాయింట్స్…
ఆకట్టుకోని పాటలు
ప్రథమార్థంలోని కొన్ని సీన్లు

రేటింగ్: 3/5

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -
విడుదల తేదీ: 05 ఆగస్ట్, 2022 నటీనటులు: కళ్యాణ్ రామ్, క్యాథెరిన్ ట్రెసా, సంయుక్తా మీనన్, ప్రకాశ్ రాజ్, తనికెళ్ళ భరణి, తదితరులు. సినిమాటోగ్రఫీ: చోటా కె నాయుడు సంగీతం: చిరంతన్ భట్, వరికుప్పల యాదగిరి, ఎం ఎం కీరవాణి ఎడిటింగ్: తమ్మిరాజు నిర్మాత: హరికృష్ణ. కె రచన-దర్శకత్వం: వశిష్ట Bimbisara Review and Rating నందమూరి కళ్యాణ్ రామ్ తన కెరీర్ ప్రారంభం నుంచీ కొత్తగా ట్రై చేసేందుకు ప్రయత్నిస్తుంటాడు. కొత్త...Bimbisara Review: ‘బింబిసార’ సినిమా రివ్యూ