Tarak: కళ్యాణ్ రామ్ పై తారక్ చూపిస్తున్న ప్రేమకు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే!

Tarak: తెలుగు సినిమా ఇండస్ట్రీలో నందమూరి ఫ్యామిలీకి ఎంతో మంచి పేరు ఉందని చెప్పాలి.సీనియర్ నటుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు ఇండస్ట్రీలో హీరోగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. ఇక ఈయన వారసులుగా పలువురు ఇండస్ట్రీకి పరిచయమైనప్పటికీ బాలకృష్ణ మాత్రమే ఇండస్ట్రీలో సక్సెస్ సాధించారు.

ఇలా బాలకృష్ణ తరువాత మూడో తరం వారసులుగా ఇండస్ట్రీలో ప్రస్తుతం ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ హీరోలుగా కొనసాగుతున్న విషయం మనకు తెలిసిందే. ఇక కళ్యాణ్ రామ్ హీరో గాను నిర్మాతగాను ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. ఎన్టీఆర్ మాత్రం గ్లోబల్ స్టార్ గా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకొని స్టార్ హీరోగా సక్సెస్ సాధించారు. ఇక ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ ఇద్దరు కూడా హరికృష్ణ కుమారులన్న విషయం మనకు తెలిసిందే. వీరిద్దరికి తండ్రి ఒకటే అయినప్పటికీ తల్లులు మాత్రం వేరు.

 

ఇలా తల్లులు వేరైనా ఈ ఇద్దరు సొంత అన్నదమ్ములుగా ఉంటూ ఎంతో మందికి ఆదర్శంగా ఉంటారు. ఇక కళ్యాణ్ రామ్ సినిమాలు కనుక విడుదలకు సిద్ధమైతే తప్పకుండా ఎన్టీఆర్ తన అన్నయ్య సినిమాలకు సపోర్ట్ గా ఉంటూ సినిమాలను సక్సెస్ చేస్తూ ఉంటారు. అంతేకాకుండా కళ్యాణ్ రామ్ సినిమాలు కనుక చేయాలి అనుకుంటే తప్పకుండా ఆ సినిమా కథను ఎన్టీఆర్ తో పంచుకొని ఆయన సలహాలు సూచనలు కూడా తీసుకుంటారట.

 

ఇలా ఎంతో ఆప్యాయంగా ఉన్నటువంటి ఈ అన్నదమ్ముల గురించి తాజాగా ఒక వార్త వైరల్ గా మారింది. కళ్యాణ్ రామ్ ను ఎన్టీఆర్ ఎంతో ఆప్యాయంగా అన్నయ్య అని పిలుస్తారట కానీ కళ్యాణ్ రామ్ మాత్రం ఎన్టీఆర్ ను ఎప్పుడు కూడా తమ్ముడు అని పిలిచిన దాఖలాలు లేవు. కళ్యాణ్ రామ్ ఎన్టీఆర్ ను ఎప్పుడు కూడా తమ్ముడని పిలవరట. ఎన్టీఆర్ లో తన తండ్రిని చూసుకుంటూ తనని ఎంతో ఆప్యాయంగా నాన్న అని పిలుస్తారని ఓ సందర్భంలో కళ్యాణ్ రామ్ చెప్పడంతో వీరిద్దరి మధ్య ఉన్నటువంటి రిలేషన్ పై అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: జనసేన పార్టీ నేతలకు కీలక ఆదేశాలు ఇచ్చిన పవన్ కళ్యాణ్.. ఆ నేతలు పాటిస్తారా?

Pawan Kalyan:  పవన్ కళ్యాణ్ లో ఇప్పుడు పరిపూర్ణ రాజకీయ నాయకుడు కనిపిస్తున్నాడు. పార్టీకి సంబంధించి అనేకమైన కీలక నిర్ణయాలను చాలా పరిణితితో తీసుకుంటున్నారు. పోలింగ్ రెండు వారాల్లో ఉంది కాబట్టి ఈ...
- Advertisement -
- Advertisement -