Chandrababu Naidu: టీడీపీని ఎన్డీఏలోకి రావాల‌ని వాళ్లే ఆహ్వానించారట.. చంద్రబాబు నాయుడు రేంజ్ ఇదేనంటూ?

Chandrababu Naidu: ఏపీలో రాజకీయంగా ఏ చిన్న కార్యం జరిగినా పెద్ద చర్చకు దారి తీస్తుంది. ఎందుకంటే.. ఏపీ పాలిటిక్స్‌కు ఉన్న క్రేజ్ అలాంటింది. ప్రజలు కూడా వారి సొంత విషయాల కంటే రాజకీయాలపై ఎక్కువ ఆసక్తి చూపిస్తారు. అయితే, ఇప్పుడు ఏపీ టీడీపీ, బీజేపీ పొత్తుపై పెద్ద ఎత్తున చర్చకు దారి తీస్తోంది. ఇప్పటికే చంద్రబాబు ఢిల్లీ వెళ్లి అమిత్ షా తో భేటీ అయ్యారు. బీజేపీ పెద్దల నుంచి పిలుపు వచ్చిందని చంద్రబాబు వెళ్లారని టీడీపీ నేతలు చెబుతున్నారు. అయితే, పొత్తుకు సంబంధించిన ప్రకటన రాలేదు. దాదాపు పొత్తు ఖాయమైనట్టు తెలుస్తోంది కానీ.. అధికారిక ప్రకటన రాలేదు. చంద్రబాబు ఢిల్లీ వెళ్లిరావడమే తప్ప అక్కడ ఏం జరిగిందో ఎవరికీ చెప్పలేదు.

ఇక రాష్ట్ర బీజేపీ నేతలు కూడా పొత్తుల అంశం కేంద్ర నాయకత్వమే చూసుకుంటుందని చెబుతున్నారు. అయితే, ఈ మధ్యలో వైసీపీ నాయకులు అడపా దడపా టీడీపీ, బీజేపీ పొత్తుల గురించి మాట్లాడుతున్నారు. చంద్రబాబే పొత్తుల కోసం పాకులాడుతున్నారని సెటైర్లు వేస్తున్నారు. బీజేపీ పెద్దలు టీడీపీతో పొత్తుకు ఆసక్తిగా లేరని వైసీపీ నేతలు అంటున్నారు. దీనికి ఏపీ టీడీపీ అధ్యక్షుడు క్లారిటీ ఇచ్చారు. బీజేపీ పెద్దల నుంచి పిలుపు వస్తేనే చంద్రబాబు ఢిల్లీ వెళ్లారని అన్నారు. ఎన్డీఏ చేరాలని బీజేపీ పెద్దలు కోరుతున్నారని తెలిపారు. మధ్యలో ఎవరికి నచ్చిన విశ్లేషణలు వారు చేస్తే సమాధానం చెప్పాల్సిన అవసరం తమకు లేదని అచ్చెన్న తేల్చి చెప్పారు.

అయితే, ఇందులో నిజమెంత? అనేది ఓసారి పరిశీలిస్తే.. పొత్తు కావాలని చంద్రబాబు కోరుకోవడంలో వందకు వందశాతం నిజముంది. కానీ, మొన్న చంద్రబాబును ఢిల్లీకి రావాలని కబురు పంపింది మాత్రం బీజేపీ పెద్దలే. ఢిల్లీ నుంచి పిలుపు వస్తేనే చంద్రబాబు వెళ్లారు. ఏడాది క్రితం వరకూ చంద్రబాబు బీజేపీతో పొత్తు కోసం ప్రయత్నించారు. అలా అని బీజేపీతో కలిసి వెళ్తే అదనంగా ఓట్లు వస్తాయనని కాదు. జగన్ దూకుడుకు కల్లెం వేయాలంటే కేంద్రం సాయం కావాలని చంద్రబాబు ప్రయత్నించారు.

కానీ, అప్పుడు బీజేపీ నుంచి పెద్దగా స్పందన రాలేదు. అప్పట్లో చంద్రబాబు నేరుగా బీజేపీ పెద్దలతో మాట్లాడకపోయినా.. పొత్తుకు సిద్దమనే సంకేతాలు వారికి పంపించేవారు. కానీ.. అప్పుడు బీజేపీ నుంచి ఎలాంటి స్పందన లేదు. అయితే, రీసెంట్ గా కేంద్ర బీజేపీ నుంచి చంద్రబాబుకి పిలుపు వచ్చింది. అందుకే వెళ్లారు. అయితే, గతంలో ఆసక్తి చూపని బీజేపీ నాయకత్వం ఇప్పుడు ఎందుకు చంద్రబాబును పిలుస్తారనే అనుమానం కూడా రావొచ్చు దానికి కూడా ఓ కారణం ఉంది.

ఇటీవల సర్వేలో టీడీపీ, జనసేన కూటమికి గెలుస్తుందని చెబుతున్నాయి. ఇండియా టుడే సర్వేతో కూటమి విజయం ఖాయమనే ఆలోచనకు బీజేపీ వచ్చింది. అందుకే చంద్రబాబుకు పిలుపు వచ్చింది. అంతేకాదు.. మరో కారణం కూడా ఉంది. మోడీ, అమిత్ షా పదేపది ఎన్డీఏ 400 స్థానాలకు పైగా గెలుస్తుందని చెబుతున్నారు. అది ఏదో మామూలుగా చెబుతున్న మాటలు కాదు. 404 కంటే ఎక్కువ స్థానాలు గెలవాలని బీజేపీ పెట్టుకున్న టార్గెట్. ఎందుకంటే 1984లో రాజీవ్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ ఎన్నికలకు వెళ్లినపుడు 404 స్థానాలు ఆ పార్టీ గెలుచుకుంది.

దాన్ని బ్రేక్ చేయాలని బీజేపీ టార్గెట్ పెట్టుకుంది. ఒక్క బీజేపీ అన్ని స్థానాలను బ్రేక్ చేయకపోయినా.. మోడీ, అమిత్ షా నాయకత్వంలోని ఎన్డీఏ బ్రేక్ చేయాలని అనుకుంటుంది. అందుకే.. వీలైనన్ని పార్టీలను ఎన్డీఏలో కలుపుకొని పోతున్నారు. నితీష్ కుమార్, దేవెగౌడ లాంటి వారిని కలపుకోవడంలో వ్యూహం అదే. ఇప్పుడు టీడీపీని ఆహ్వానించడానికి కారణం కూడా అదే. టీడీపీ, జనసేన కూటమికి 18 స్థానాలు వస్తాయని సర్వేలు చెబుతున్నాయి. ఆ 18 స్థానాలు కూడా ఎన్డీఏలోకి వెళ్లాలి అనేది మోడీ అండ్ అమిత్ షా వ్యూహం. దాని కోసమే చంద్రబాబును అమిత్ షా ఢిల్లీకి పిలిచారు.

Related Articles

ట్రేండింగ్

Assembly Election: ఏపీలో అక్కడ గెలిస్తే మంత్రి పదవి పక్కా.. ఈ నియోజకవర్గం ప్రత్యేకతలు ఇవే!

Assembly Elections: రాష్ట్రంలోని అతిపెద్ద నియోజకవర్గాలలో మైలవరం నియోజకవర్గం ఒకటి. ముందు ఈ నియోజకవర్గం కమ్యూనిస్టు పాలనలో ఉండేది, తర్వాత తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా మారింది. తెదేపా ఆవిర్భావం తర్వాత తొమ్మిది సార్లు...
- Advertisement -
- Advertisement -