MP Laxman: ఎన్టీయేలో టీడీపీ చేరనట్లేనా? టీడీపీతో పొత్తుపై తేల్చేసిన బీజేపీ ఎంపీ

MP Laxman: ఎన్డీయేలో మళ్లీ టీడీపీలో చేరబోతుందనే వార్తలు గతంలో నేషనల్ మీడియాలో బాగా వినిపించాయి. త్వరలోనే ఎన్టీయేలో టీడీపీ చేరుతుందని ప్రచారం జరిగింది. చంద్రబాబును మళ్లీ దగ్గర చేసేందుకు మోదీ, అమిత్ షా చూస్తున్నారని, టీడీపీతో పొత్తు వల్ల తెలంగాణలో అధికారంలోకి రావాలని ప్రయత్నాలు చేస్తున్న బీజేపీకి ఉపయోగపడుతుందనే ఊహాగానాలు వినిపించాయి. తెలంగాణలోని టీడీపీ ఓటర్లు, సెటిలర్ల ఓటర్లు బీజేపీ వైపు మళ్లుతారని, దాని వల్ల తెలంగాణలో బీజపీలోకి ఉపయోగపడుతుందనే అంచనాలు వినిపించాయి.

ఢిల్లీలో జరిగిన ఆజాదీకా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో మోదీ, చంద్రబాబు 5 నిమిషాల పాటు మాట్లాడుకోవడం, భీమవరంలో జరిగిన అల్లూరి జీతారామరాజ విగ్రహవిష్కరణకు మోదీ హాజరు కాగా.. ఆ కార్యక్రమానికి చంద్రబాబుకు కూడా ఆహ్వానం అందింది. దీంతో చంద్రబాబును దగ్గర చేసేందుకు బీజేపీ చూస్తోందనే టాక్ వినిపించింది. జాతీయ మీడియాలో కూడా కథనంలో రావడంతో ఎన్టీయేలో టీడీపీ చేరడం ఖాయమంటూ రాష్ట్ర రాజకీయ వర్గాల్లో టాక్ వనిపించింది. వచ్చే ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జగన్ ను ఎదుర్కొనేందకు జనసేన, టీడీపీ, బీజేపీ కలిసి పోటీ చేస్తాయనే చర్చ జరిగింది.

ఈ క్రమంలో టీడీపీతో పొత్తుపై తెలంగాణకు చెందిన బీజేపీ సీనియర్ నేత, రాజ్యసభ ఎంపీ, బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు లక్ష్మణ్ క్లారిటీ ఇచ్చారు. టీడీపీతో పొత్తుపై ఆలోచన లేదని, జనసేనతో కలిసి పనిచేస్తామన్నారు. కేసీఆర్ జాతీయ పార్టీని స్వాగతిస్తున్నట్లు లక్ష్మణ్ స్పష్టం చేశారు. తెలంగాణలో బీజేపీ క్లీన్ స్వీప్ చేయడమే లక్ష్యమన్నారు. ఏపీలో జగన్ వచ్చిన తర్వాత అసలు అభివృద్ది ఏమీ జరగలేదని, అభివృద్ధి మొత్తం ఆగిపోయిందని విమర్శించారు. ఏపీలో బీజేపీ రావాలని అక్కడి ప్రజలు కోరుకుంటున్నారిన లక్ష్మణ్ తెలిపారు. బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడిగా నియమించడమే కేంద్రమంత్రి పదవిగా భావిస్తున్నట్లు లక్ష్మన్ తెలిపారు.

హైదరాబాద్ లోని ఆయన మీడియా ప్రతినిధులతో చిట్ చాట్ నిర్వహించారు. ఈ సంరద్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వెంకయ్య నాయుడు తర్వాత తెలుగు రాష్ట్రాల నుంచి పార్లమెంటరీ బోర్డు సభ్యుడిగా ఎన్నికైన రెండో వ్యక్తి తానేననంటూ లక్ష్మణ్ చెప్పుకొచ్చారు. లక్ష్మణ్ కేంద్ర బీజేపీలో కీలక పదవిలో ఉన్నారు. దీంతో జాతీయ రాజకీయాల్లో ఏం జరుగుతందనేది ఆయనకు ఖచ్చితంగా తెలిసే అవకాశాలు ఉంటాయి. అందుకే లక్ష్మన్ నోటి నుంచి వచ్చే మాాటలకు విలువ ఉంటుంది. దీంతో లక్ష్మన్ చేసిన వ్యాఖ్యలతో ఎన్డీయేలో టీడీపీ చేరడంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదిన తెలుస్తోంది.

Related Articles

ట్రేండింగ్

Chittoor: పెద్దిరెడ్డి ఇలాకాలో వైసీపీ అరాచకం.. ప్రచారానికి వస్తే చంపే సంస్కృతి ఉందా?

Chittoor: మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇలాక పుంగనూరులో వైసీపీ అరాచకం తారాస్థాయికి చేరింది. భారత చైతన్య యువజన (బీసీవై )పార్టీ ప్రచార కార్యక్రమాన్ని వైసీపీ శ్రేణులు . అడ్డుకున్నారు. పుంగనూరు మండలం మాగాండ్ల...
- Advertisement -
- Advertisement -