KCR-Nitish Kumar: విపక్షాల కూటమిలో చీలికలు.. ప్రధాని అభ్యర్థి ఎవరో?

KCR-Nitish Kumar: ప్రస్తుతం దేశ రాజకీయాల్లో మలుపులు చోటుచేసుకుంటున్నాయి. కీలక పరిణామాలు జరుగుతున్నాయి. ఎన్నికలకు ఇంకా ఏడాదిన్నర ఉండటంతో ప్రతపక్షాలు అలర్ట్ అయ్యాయి. మోదీని ఎదుర్కొనేందుకు ఇప్పటినుంచే సన్నద్దమవుతున్నాయి. ఎన్డీయేకి వ్యతిరేకంగా జట్టు కట్టేందుకు ఇప్పటినుంచే పావులు కదుపుతున్నాయి. బీజేపీని ఓడిచేందుకు ఏకతాటిపైకి వచ్చేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. కానీ ముందు ఉండి నడిపించే నాయకుడు ఎవరనే దానిపై క్లారిటీ రావడం లేదు. తానంటే తాను ప్రతిపక్షాలను నడిపిస్తానంటూ నేతలు ముందుకొస్తున్నారు. దీంతో ప్రతిపక్షాల మధ్య సమన్వయం కుదరడానికే మరింత సమయం పట్టే అవకాశముంది. గత ఎన్నికలకు ముందే చంద్రబాబు కేంద్రం రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారు. కాంగ్రెస్ తో కలిసి దేశంలో ఎన్టీయేకు వ్యతిరేకంగా ప్రతపక్షాలన్నింటినీ ఏకతాటిపైకి తీసుకొచ్చారు. చంద్రబాబు ముందు ఉండి నడిపించారు. చంద్రబాబు సీనియర్ నేత కావడం, దేశ రాజకీయాల్లో అనుభం ఉండటం, ఎన్డీయే కన్వీనర్ గా పనిచేయడంతో ఆయన నాయకత్వంలో అందరూ ముందుకొచ్చారు. కానీ ప్రస్తుతం ఏపీలో గెలవడంపైనే చంద్రబాబు దృష్టి పెట్టారు.

ఏపీలో మళ్లీ గెలవాలంటే బీజేపీ అండ తప్పనిసరిగా ఉండాలని గుర్తించారు. అందుకే మోదీకి దగ్గరయ్యేందుకు మళ్లీ ప్రయత్నించారు. వచ్చే ఎన్నికల నాటికి ఎన్డీయేలో టీడీపీ చేరడం ఖాయమని నేషలన్ మీడియా కోడై కూస్తోంది. చంద్రబాబు కూడా సుముఖంగా ఉండటంతో ఎన్నికల నాటికి బీజేపీతో టీడీపీ పొత్తు పెట్టుకోవడం దాదాపు ఖాయమనే టాక్ ఏపీ రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది. శివసేన, నితిష్ కుమార్ తో పాటు పలు పార్టీలు ఎన్టీయేకు దూరం కానున్నాయి. ప్రస్తుతం చిన్నాచితక పార్టీలు తప్పితే ఎన్టీయేలో చెప్పుకోదగ్గ బలమైన పార్టీలే ఏమీ లేవు. దీంతో చంద్రబాబును దగ్గర చేసుకోవాలని బీజేపీ చూస్తోంది. దీంతో జాతీయ రాజకీయాల్లో ప్రతిపక్షాలను ముందు ఉండి నడిపించే నాయకుడు కరువయ్యారు.

ప్రస్తుతం ఇటీవల ఎన్టీయే నుంచి బయటకు వచ్చిన నితీష్ కుమార్, తెలంగాణ సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో ఎన్టీయేకు వ్యతిరేకంగా చక్రం తిప్పాలని ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రతిపక్షాలను ఏకం చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. ఇక పశ్చిమబెంగాల్ మమతా మనర్జీ ఎలాగూ ఎప్పటిలాగే కలిసి వస్తుంది. కానీ ప్రతిపక్షాలన్నింటినీ ముందుండి నడిపించే నాయకుడు ఎవరనేది అర్దం కావడం లేదు. నితీష్ కుమార్, కేసీఆర్ ఇద్దరూ పోటీ పడుతుండటంతో ఎవరి నాయకత్వంలో ముందుకు వెళ్లారనేది ప్రతిపక్ష పార్టీలు తేల్చుకోలేకపోతున్నాయి.

దేశ రాజకీయాల్లో సీఎం కేసీఆర్ కంటే నితీష్ కుమార్ చాలా సీనియర్ నాయకుడు. కేంద్రమంత్రిగా పనిచేయడంతో పాటు బీహార్ సీఎంగా పనిచేస్తున్నారు. జాతీయ రాజకీయాల్లో చాలాలమంది నేతలతో ఆయనకు పరిచయాలు. ఇటీవల కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీతో పాటు రాహుల్ గాంధీలతో ఆయన భేటీ అయ్యారు. బీహార్ లో కాంగ్రెస్ తో కలిసి ఆయన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. దీంతో ప్రస్తుతం ఆయన యూపీఏకి అనుకూలంగా ఉన్నారు. కాంగ్రెస్ తో కూడా పనిచయాలు ఉండటంతో ఆయనకు ఎక్కవ అవకాశాలు ఉన్నాయి. ఇక బీహార్ తో పాటు నితీష్ కుమార్ పార్టీ బలంగా ఉన్న రాష్ట్రాల్లో ఎక్కువ లోక్ సభ స్థానాలు ఉన్నాయి.

తెలంగాణలో 17 లోక్ సభ స్థానాలు మాత్రమే ఉన్నాయి. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్ఎస్ 8 నుంచి 9 ఎంపీ సీట్లు మాత్రమే గెలుచుకుంటుందని పలు సర్వేలలో తేలింది. అందుకే కేసీఆర్ కు తక్కువ ప్రాధాన్యత ఉంటుందని, నితీస్ కు ఎక్కువ అవకాశాలు ఉంటాయనే చర్చ రాజకీయ విశ్లేషకుల్లో జరుగుతోంది. ఇక పశ్చిమబెంగాల్ లో కూడా ఎక్కువ లోక్ సభ స్థానాలు ఉండటంతో సీఎం మమతా బెనర్జీకి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఇటీవల కేసీఆర్ బీహార్ పర్యనటకు వెళ్లిన సమయంలో కూడా నితీష్ కుమార్ సాదరంగా ఆహ్వానించారు. కానీ ప్రెస్ మీట్ సమయంలో ఇద్దరి మధ్య మనస్పర్దలు బయటపడ్డాయి. విపక్షాల ప్రధాని అభ్యర్థి ఎవరని మీడియా ప్రశ్నించగా.. అది ప్రతిపక్షాలన్ని కలిసి నిర్ణయిస్తాయని, తాను ఒకరి పేరు చెబితే మిగతా వారు అసంతృప్తి చెందే అకకాశముందని చెప్పారు. నితీష్ పేరును కేసీఆర్ చెప్పకపోవడంతో ఆయన ప్రెస్ మీట్ లోనుంచి పైకి లేచి వెళ్లడానికి ప్రయత్నించారు. కానీ కేసీఆర్ పలుమార్లు కూర్చోవాలని కోరడంతో అప్పుడు నితీష్ కూర్చున్నారు.

ఇది చూస్తే విపక్షాల ప్రధాని అభ్యర్ధిగా నితీష్ ఉండాలని చూస్తున్నారు. కేసీఆర్ కూడా ప్రతిపక్ష పార్టీల సీఎంలను, అధినేతలను కలుస్తూ ప్రయత్నాలు చేస్తున్నారు. అక్కడ బీహార్ లో నితీష్ ప్రధాని అభ్యర్థి అని ఆ పార్టీ నేతుల చెబుతున్నారు. ఇక టీఆర్ఎస్ నేతలు కూడా సీఎం కేసీఆర్ నే ప్రధాని అభ్యర్ధి అని చెబుతున్నారు. దీంతో విపక్షాల ప్రధాని అభ్యర్ధి ఎవరనేది తేలడం లేదు. ఎవరికి వారు తానేనని ప్రకటించుకుంటున్నారు. ఎన్నికల నాటికైనా దీనిపై క్లారిటీ వస్తుందా.. లేదా అనేది కూడా తెలియడం లేదు. ప్రతిపక్షాలు ఇలాగే ప్రధాని అభ్యర్థి విషయంలో తేల్చుకోకపోతే ఎన్డీయేకు మళ్లీ కలిసొచ్చే సూచనలు కనిపిస్తున్నాయి.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: చిరు జీవులకు సైతం అన్యాయం చేసిన జగన్ సర్కార్.. మరీ ఇంతలా మోసమా?

CM Jagan: జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున రాష్ట్రంలో అవినీతి అక్రమాలు జరుగుతున్నాయి. పెద్ద ఎత్తున దోపిడీలు చేస్తున్నారు వైకాపా నేతలు కొండలను గుట్టలను చెరువులను వదలలేదు పెద్ద...
- Advertisement -
- Advertisement -