Oil: నూనెను ఎక్కువగా మరిగిస్తే ప్రాణాలకు ఇంత ప్రమాదమా.. ఏం జరిగిందంటే?

Oil: చాలామంది వంటెల్లో వాడిన నూనెను దాచిపెట్టి పదే పదే అదే నూనెను వాడతారు. ఒక నూనెను ఎక్కువసార్లు ఉపయోగిస్తూ ఉంటారు. ఇంట్లో అయితే ఒకటి లేదా రెండుసార్లు ఉపయోగించి పారబోస్తారు. కానీ బయట చిన్న చిన్న హోటళ్లు, టిఫిన్ బండ్లపై అయితే వాడిన నూనెను ఎక్కవసార్లు ఉపయోగిస్తారు. దీని వల్ల ఆరోగ్యానికి ఎంతో ప్రమాదం పొంచి ఉంటుంది. వాడిన నూనెను ఎక్కువసార్లు వాడకూడదని వైద్య నిపుణులు చెబుతున్నారు.

నూనెను మళ్లీ మళ్లీ మరిగించడం, అందులో తయారుచేసిన పదార్థాలు తినడం ఆరోగ్యానికి చాలా ప్రమాదకరమని డాక్టర్లు చెబుతున్నారు. దీని వల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరుగుతుందని, ఇది గుండెకు ఎంతో ముప్పు అని హెచ్చరిస్తున్నారు. అన్నవాహిక క్యాన్సర్లు కూడా వచ్చే ప్రమాదం ఉందని అంటున్నారు. ఎక్కవసార్లు మరిగించిన నూనెలో వండిన పదార్థాలు తింటే శరీరంలో ఫ్రీ రాడికల్స్ పెరిగి వివిధ సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుందని అంటున్నారు.

 

కంపెనీల నుంచి తయారై వచ్చిన నూనెలో టోటల్ పోలార్ కౌంట్ ఎక్కువగా ఉంటుంది. 5 నుంచి 7 శాతం ఉంటుంది. ఆయిల్ ను మరిగించే కొద్ది టీపీసీ అనేది పెరుగుతూ ఉంటుంది. టీపీసీ మోతాడు 25 శాతానికి మించితే ఆరోగ్యానికి ఎంతో హానికరమని అంటున్నారు. టీపీసీ మోతాదు పెరిగేకొద్ది ఫ్రీ రాడికల్స్ పెరుగుతాయని, దీని వల్ల రక్తనాళాలు గట్టిపడటం, అల్జీమర్స్, హైపర్ టెన్షన్, కాలేయ సంబంధ వ్యాధులు వస్తాయని అంటున్నారు. గుండెజబ్బులు, స్థూలకాయం వ్యాధులు వచ్చే అవకాశముందని అంటున్నారు.దీంతో వాడిన నూనెను పదే పదే వాడకూడదని, బయట నూనెలు వేసిన ఫుడ్ తినేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. లేకపోతే అనారోగ్యాల బారిన పడే అవకాశం ఉంటుందని అంటున్నారు.

 

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -