Botsa Satyanarayana: కూటమికి ఓటేస్తే స్టీల్‌ప్లాంట్‌ని రక్షించలేమట.. అధికారంలో ఉండి ఏం చేశారు బొత్స గారు?

Botsa Satyanarayana: అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో వైసిపి నేతలందరూ కూడా పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలను మొదలు పెడుతున్నారు. అయితే చాలా చోట్ల వీరికి పూర్తి స్థాయిలో వ్యతిరేకత ఏర్పడుతుందని తెలుస్తుంది. ఈ విధంగా మంత్రి బొత్స సత్యనారాయణ కూడా ఇటీవల విశాఖలో పర్యటించారు అయితే ఈ పర్యటనలో భాగంగా ఈయన విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

విశాఖ స్టీల్ ప్లాంట్ ద్వారా రాష్ట్రానికి ఆదాయం రావడమే కాకుండా ఎంతో మంది ఈ స్టీల్ ప్లాంట్ ద్వారా ఉపాధి పొందుతున్నారు. అయితే కేంద్రంలో ఉన్నటువంటి బిజెపి ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంటును ప్రైవేటీకరణ చేయాలి అంటూ పెద్ద ఎత్తున విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు ఆరాటపడ్డారు కానీ అది కుదరడం లేదు. అయితే వచ్చే ఎన్నికలలో కనుక కూటమికి ఓట్లు వేసి గెలిపిస్తే మాత్రం విశాఖ స్టీల్ ప్లాంట్ కు రక్షణ కరువవుతుందని తప్పకుండా ఇది ప్రైవేటీకరణ అవుతుందంటూ బొత్స సత్యనారాయణ వెల్లడించారు.

ప్రజలందరూ కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని తమ ఓటు వినియోగించుకోవాలని ఈయన పిలుపునిచ్చారు. అయితే ఈ విధంగా విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి బొత్స సత్యనారాయణ కామెంట్లు చేయడంతో ప్రజలు ఈయన వ్యాఖ్యలను పూర్తిగా విమర్శిస్తూ ఉన్నారు. కూటమికి ఓటు వేస్తే స్టీల్ ప్లాంట్ పరిరక్షించలేమని చెబుతున్నటువంటి ఈయన ఇప్పుడు అధికారంలో ఉండి కూడా స్టీల్ ప్లాంట్ ను రక్షించలేకపోతున్నారంటూ ప్రశ్నిస్తున్నారు. ఏది ఏమైనా వైయస్సార్సీపీ నేతలు ఎక్కడికి వెళ్లిన వారికి ప్రజల నుంచి పూర్తిస్థాయిలోనే వ్యతిరేకత రావడంతో ఏదో తెలియని భయం వారిలో నెలకొంది.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: చిరు జీవులకు సైతం అన్యాయం చేసిన జగన్ సర్కార్.. మరీ ఇంతలా మోసమా?

CM Jagan: జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున రాష్ట్రంలో అవినీతి అక్రమాలు జరుగుతున్నాయి. పెద్ద ఎత్తున దోపిడీలు చేస్తున్నారు వైకాపా నేతలు కొండలను గుట్టలను చెరువులను వదలలేదు పెద్ద...
- Advertisement -
- Advertisement -