Liger: లైగర్ సినిమా బాయ్‌కాట్ చెయ్యాలంటూ ట్రెండ్.. అసలు కారణాలివే!

Liger: టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ, బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే కలిసి నటించిన తాజా చిత్రం లైగర్. ఈ సినిమాకు డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. ఈ సినిమా భారీ అంచనాల నడుమ పాన్ ఇండియా లెవెల్ లో ఆగస్టు 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. కాగా ఇప్పటికే ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్న విషయం తెలిసిందే. గత కొద్ది రోజులుగా ఎక్కడ చూసినా కూడా లైగర్ సినిమాకు సంబంధించి వార్తలు వినిపిస్తున్నాయి. సినిమా విడుదల తేదీ దగ్గర పడుతుండడంతో చిత్ర బృందం ప్రమోషన్స్ ను మరింత వేగవంతం చేసింది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్,పోస్టర్,పాటలకు ప్రేక్షకుల నుంచి భారీగా స్పందన లభించింది.

కాగా ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని విజయ్ దేవరకొండ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అంతేకాకుండా ఈ సినిమా నుంచి విడుదలవుతున్న ప్రతి ఒక్క అప్డేట్ కూడా ఈ సినిమాపై ఉన్న అంచనాలను మరింత పెంచుతున్నాయి. ఈ సినిమాకు హీరోయిన్ ఛార్మి నిర్మాతగా వ్యవహరించిన విషయం తెలిసిందే. ఈ లైగర్ సినిమా విడుదల కావడానికి కేవలం ఐదు రోజులు మాత్రమే సమయం ఉంది. కాగా ఈ సినిమా విడుదల అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది అని అభిమానులతో పాటు చిత్ర బృందం కూడా నమ్మకంగా చెబుతున్నారు. ఇలా ఉంటే తాజాగా సోషల్ మీడియాలో లైగర్ సినిమాముందు బాయ్ కాట్ చేయాలి అంటూ నెటిజెన్స్ సోషల్ మీడియాలో ట్వీట్ చేస్తున్నారు.

బాలీవుడ్ ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్ ఈ సినిమాను నిర్మించారనీ, హీరోయిన్ అనన్య పాండే డ్రగ్స్ కు అడిక్ట్ అంటూ ట్వీట్స్ చేస్తున్నారు. దీంతో ప్రస్తుతం సోషల్ మీడియాలో #BoycottLigerMovie అంటూ సోషల్ మీడియాలో ట్రెండింగ్ చేస్తున్నారు. ఈ విషయంపై విజయ్ దేవరకొండ అభిమానులు స్పందిస్తూ UnstoppableLIGER అంటూ ట్వీట్స్ చేస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -