Brahmastra: బ్రహ్మాస్త్ర ఫస్ట్ రివ్యూ.. హిట్ కొట్టెనా?

Brahmastra: ప్రస్తుతం బీటౌన్ ప్రేక్షకులు ఎప్పుడు ఎప్పుడా అని ఎదురు చూసే సినిమా బ్రహ్మాస్త్ర. ప్రస్తుత కాలంలో బాలీవుడ్ లో విడుదలైన సినిమాలన్నీ పూర్తిగా బోల్తా కొట్టాయి. ఈ క్రమంలో బాలీవుడ్ అదృష్టం పరీక్షించేవిధంగా.. పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వస్తున్న సినిమా బ్రహ్మాస్త్ర.

ఈ సినిమాలో రణ బీర్ కపూర్, అమితాబ్ బచ్చన్, అలియా భట్ లు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. దర్శకుడు అయాన్ ముఖర్జీ ఈ సినిమాని అన్ని వెర్షన్స్ లో తీర్చిదిద్దాడు. కనుక ప్రమోషన్స్ కూడా భారీ స్థాయిలో ప్రమోట్ చేస్తున్నారు. ఇక తెలుగు వర్షన్ లో రాజమౌళి, చిరంజీవిలు.. ఈ సినిమాను ప్రమోట్ చేసే రంగంలో ముందుకు దిగారు. ఇక ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా ఈనెల 9న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

కనుక తాజాగా ఈ సినిమా ను చూసిన.. ఓవర్సీస్ సెన్సార్ బోర్డ్ సభ్యుడు, క్రిటిక్ అయిన ఉమైర్ సంధు తన ట్విట్టర్ ఖాతా ద్వారా ఈ సినిమా రివ్యూ ను షేర్ చేశాడు. ఈ సినిమాలో వి ఎఫ్ ఎక్స్ లు అద్భుతంగా ఉన్నాయని చెప్పాడు. సినిమాటోగ్రఫీ కూడా బాగా పండింది అన్నట్లుగా తెలిపాడు. కొన్ని సీన్ లలో లైటింగ్ చాలా డార్క్ గా ఉందని తెలిపాడు. ఇక ప్రొడక్షన్ డిజైనింగ్ విషయానికి వస్తే అమేజింగ్ అంటూ పొగిడాడు.

ఇక స్టోరీ స్క్రీన్ ప్లే మాత్రం యావరేజ్ అని చెప్పేసాడు. ఇక ఇంటర్వెల్ సన్నివేశాలు చాలా బోరింగ్ గా అనిపించాయి అన్నట్లు తెలిపాడు. ఇక మ్యూజిక్ విషయానికొస్తే 2.5 రేటింగ్ ఇచ్చాడు. హీరో రణ బీర్ నటన అద్భుతంగా ఉన్నట్లు తెలియజేశాడు. అంతేకాకుండా కొన్ని సీన్ లలో హీరో కన్ఫ్యూజ్ అయినట్లు తెలిపాడు. అమితాబ్ బచ్చన్ తన నటనతో బాగా ఆకట్టుకున్నాడట. ఇక సినిమాలో అలియా భట్ చాలా క్యూట్ గా అనిపించిందని తెలియజేశాడు.

ఇక మౌని రాయ్ విషయానికొస్తే ఆమె ఇంకా నాగిన్ మోడ్ లోనే ఉన్నట్లు తెలిపాడు. ఇక ఓరల్ గా చెప్పాలంటే.. బ్రహ్మాస్త్ర సినిమా ఆత్మ మిస్ అయిందట. ప్రస్తుతం ఈ రివ్యూ సోషల్ మీడియాలో హడావిడి చేస్తుంది.

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: జనసేన పార్టీ నేతలకు కీలక ఆదేశాలు ఇచ్చిన పవన్ కళ్యాణ్.. ఆ నేతలు పాటిస్తారా?

Pawan Kalyan:  పవన్ కళ్యాణ్ లో ఇప్పుడు పరిపూర్ణ రాజకీయ నాయకుడు కనిపిస్తున్నాడు. పార్టీకి సంబంధించి అనేకమైన కీలక నిర్ణయాలను చాలా పరిణితితో తీసుకుంటున్నారు. పోలింగ్ రెండు వారాల్లో ఉంది కాబట్టి ఈ...
- Advertisement -
- Advertisement -