Bro Movie: ఆ విషయంలో బ్రో మూవీనే గ్రేటా.. అసలేం జరిగిందంటే?

Bro Movie: టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ఆయనకు ఉన్న మాస్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రెండు తెలుగు రాష్ట్రాలలో పవన్ కళ్యాణ్ కు బీభత్సమైన ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంది. ఇక పవన్ కళ్యాణ్ సినిమాలు విడుదల అవుతున్నాయి అంటే థియేటర్ల వద్ద పండగ వాతావరణం నెలకొంటూ ఉంటుంది. ఇది ఇలా ఉంటే ఇటీవల కాలంలో వినిపించిన వార్తల ప్రకారం ఒక సినిమాలో పవన్ కళ్యాణ్ దాదాపు 20 నుంచి 30 కి పైగా అవుట్ ఫిట్స్ లో కనిపిస్తారని వార్తలు జోరుగా వినిపించాయి.

ఆ చిత్రం మరేదో కాదు హరిహర వీరమల్లు. కానీ హరిహర వీరమల్లును వెనక్కి నెట్టేసి ఆ స్థానంలో బ్రో సినిమా నిలిచింది. ఎందుకంటే బ్రో సినిమాలో పవన్ కళ్యాణ్ దాదాపు 40 కి పైగా అవుట్ ఫిట్స్ లో కనిపించబోతున్నారట. దీనితో వీరమల్లు కన్నా బ్రో లోనే అధికం అని చెప్పాలి. పైగా బ్రో చిత్రాన్ని చాలా త్వరగా పవన్ ఫినిష్ చేయడం విశేషం. ఇక మరో పక్క అయితే బ్రో సినిమాలో పవన్ నుంచి వస్తున్నా ఒక్కో పిక్ చూసి అయితే మళ్ళీ పవన్ ఫ్యాన్స్ మెస్మరైజ్ అవుతున్నారు. దీనితో పవన్ స్టైలింగ్ మరోసారి ఇంట్రెస్టింగ్ గా మారింది.

 

ఇక ఆ సంగతి పక్కన పెడితే పవన్ కళ్యాణ్ నటించిన బ్రో సినిమా రేపు అనగా జులై 27న విడుదల కాబోతున్న విషయం అందరికీ తెలిసిందే. ఇందులో పవన్ కళ్యాణ్ తో పాటు మెగా హీరో సాయి ధరమ్ తేజ్ కూడా నటించిన విషయం తెలిసిందే. సాయి తేజ్ సరసన కేతికా శర్మ హీరోయిన్ గా నటించింది. సముద్రఖని ఈ సినిమాకు దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. పవన్ అభిమానులు ఈ సినిమా కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

 

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -