Brother Anil Kumar: జగన్ కు భారీ షాకిస్తున్న బ్రదర్ అనిల్.. అలా ప్రచారం చేస్తూ?

Brother Anil Kumar: రాజకీయాలలో ఎప్పుడూ ఎవరు ఎలా మారిపోతారో ఏ పార్టీకి షిఫ్ట్ అవుతారో చెప్పడం అంచనా వేయడం చాలా కష్టం. ఎందుకంటే ఒక పార్టీ తరఫున ప్రచారం ఆ పార్టీకి తరపున మాట్లాడేవాళ్లు కాస్త ఆ పార్టీకి వాళ్లకు బెణికింది అంటే చాలు విధంగా పోరాటాలు మొదలు పెడుతూ ఉంటారు. ప్రస్తుతం ఏపీలో ఇలాంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇప్పటివరకు క్రిస్టియన్ ఓటు బ్యాంకు జగన్ను వైసీపీను వెన్నంటు ఉంటూ వచ్చింది. 2014తో పోల్చుకుంటే 2019లో క్రిస్టియన్ ఓటు బ్యాంకు పూర్తిగా వైసీపీకి మద్దతుగా నిలిచింది.

అయితే ఇలా క్రిస్టియన్ ఓటు బ్యాంకు జగన్ మద్దతు పలకడానికి గల ప్రధాన కారణం జగన్ బావ అనిల్ కుమార్. అనిల్ కుమార్ ఆయా వర్గాలను ప్రేరేపించడంతోపాటు పెద్ద ఎత్తున సభలు కూటములు పెట్టి వారిని వైసిపి కి అనుకూలంగా మలిచారు. అందుకే 2019 ఎన్నికలలో అనిల్ ఒకింత దూకుడును కనబరిచారు. అందుకే వైసీపీ 151 స్థానాలను తెచ్చుకుంది. అయితే ఇలా తెచ్చుకోవడం వెనుక అనిల్ వ్యూహం పనిచేసింది అని చెప్పవచ్చు. మొత్తం ఎస్సి నియోజకవర్గాలు 24 ఉంటే 23 స్థానాల్లో వైసీపీ విజయం దక్కించుకుంది. ఇందుకు ప్రధాన కారణం అనిల్ లే అని చెప్పవచ్చు.

 

అయితే అలా వైసీపీకి పూర్తి మద్దతుగా నిలిచిన అని ఇప్పుడు పొగ‌పెడుతున్నారు. ప్ర‌స్తుతం ఆయ‌న ఏపీలో ప‌ర్య‌టించ‌క‌పోయినప్పటికీ ఆయ‌న శిష్యుల‌తో వైసీపీకి వ్య‌తిరేకంగా ప్ర‌చారం చేయిస్తున్నారరు అంటూ పెద్ద ఎత్తున వాదనాలు వినిపిస్తున్నాయి. త‌న కుటుంబానికి జ‌రిగిన అన్యాయం. ముఖ్యంగా జ‌గ‌న్ త‌న సోద‌రిని త‌రిమేయ‌డం వంటివాటిని అనిల్ సీనియ‌స్‌గా తీసుకున్నట్లు తెలుస్తోంది. దీంతోపాటుగా ఆస్తి త‌గాదాల నేప‌థ్యం కూడా క‌లిసి వ‌స్తోంద‌ని ఆయన అనుచరులు చెబుతున్నారు.. దీంతో ఆయ‌న శిష్యులుగా ఉన్న కొంద‌రు అంత‌ర్గ‌త చ‌ర్చ‌లు స‌మావేశాల్లో వైసీపీకి వ్య‌తిరేకంగ ప్ర‌చారం చేస్తున్న‌ట్టు వైసీపీలోనే చ‌ర్చలు కొన్ని సాగుతున్నాయి. అయితే ఇక్కడ విచిత్రం ఏమిటంటే గత ఎన్నికలలో వైసిపికి ఓట్లు వేయాలని చెప్పిన వారే ఇప్పుడు వేయొద్దు అని చెప్పడం. ఏ పార్టీకి మ‌ద్ద‌తు ఇవ్వ‌క‌పోయినా వైసీపీకి మాత్రం వ‌ద్ద‌ని చెబుతున్నార‌ని అంటున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -