Seethakka: ములుగులో సీతక్క విజయాన్ని ఫిక్స్ చేసిన బీఆర్ఎస్.. అసలేం జరిగిందంటే?

Seethakka: సీతక్క అంటేనే ఒక బ్రాండ్. ఆమె కేవలం ములుగు జిల్లా ఎమ్మెల్యే మాత్రమే కావచ్చు కానీ.. ఆమె తెలంగాణలోనే ఫైర్ బ్రాండ్ అని చెప్పుకోవాలి. ఆమె గురించి తెలంగాణ మొత్తం ఎంతో బాగా తెలుసు అయితే ఈమెకు తెలంగాణలో మాత్రమే కాకుండా ఆంధ్రలో కూడా అభిమానులు ఉన్నారు. సీతక్క అంటే మారుమూల గ్రామాలలో ఉన్న వారికి కూడా ఎంతో సుపరిచితమే తన ప్రజల కోసం ఎంతో కష్టపడుతూ మారుమూల గ్రామాలకు వెళ్లి కూడా ఈమె ఎంతో సహాయం చేస్తూ ఉంటారు.

ఇలా తన ప్రజల కోసం ఎన్నో రకాలుగా సహాయం చేస్తూ ఎంతో మంచి మనసు గుర్తింపు సంపాదించుకున్నటువంటి సీతక్క ఎన్నికల బరిలో దిగింది అంటే ప్రత్యర్థుల సైతం తానే గెలవాలని కోరుకునే గొప్ప పేరు ప్రఖ్యాతలను ఈమె సంపాదించుకున్నారు. బీఆర్ఎస్ నుంచి సీతక్కకు పోటీగా నాగాజ్యోతిని బరిలోకి దించింది. కాంగ్రెస్ నుంచి సీతక్క ఫిక్స్ కాగా.. బీఆర్ఎస్ నుంచి నాగజ్యోతిని బరిలోకి దించారు. అయితే.. నాగజ్యోతి ప్రస్తుతం జడ్పీ చైర్ పర్సన్ గా కొనసాగుతున్నారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తనకు బిజెపి పార్టీ నుంచి ఎమ్మెల్యేగా టికెట్ వస్తుందని తన అసలు ఊహించలేదని తెలియజేశారు. ములుగుకు చెందిన బీఆర్ఎస్ నేత చందూలాల్ కొడుకు ప్రహ్లాద్ బీఆర్ఎస్ టికెట్ ను ఆశించారు కానీ.. ఆయనకు టికెట్ దక్కలేదు. దీంతో ఆయన తీవ్రంగా అసంతృప్తితో ఉన్నారు ఇలా ఈయనకు పార్టీ అధిష్టానం నుంచి టికెట్ అందకపోవడంతో ఈయన బీజీపీ పార్టీలో చేరే అవకాశాలు ఉన్నాయని కనిపిస్తుంది.

ఇలా ఈయన బిజెపి పార్టీలోకి చేరితే తప్పనిసరిగా బీఆర్ఎస్ ఓట్లు చీలిపోతాయి తద్వారా బిజెపి అభ్యర్థిగా ఉన్నటువంటి నాగజ్యోతి గెలవడం కష్టతరమవుతుంది దీంతో సీతక్కకు ప్లస్ పాయింట్ అవుతుందని ఈమె తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీ తరపున ములుగు నుంచి గెలుపొందడం ఖాయం అంటూ ఈమె గెలుపును బిఆర్ఎస్ ప్రభుత్వమే ప్రకటించిందని చెప్పకనే చెప్పాలి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -