Coconut Water: జిమ్ చేసిన తర్వాత కొబ్బరి నీళ్లు తాగవచ్చా?

Coconut Water: ఇటీవల కాలంలో చాలా మంది అమ్మాయిలు అబ్బాయిలు ఫిజికల్ ఫిట్నెస్ కోసం జిమ్ కి వెళ్లడం, యోగాలు చేయడం, రన్నింగ్ కి వెళ్లడం లాంటివి చేస్తుంటారు. మరి ముఖ్యంగా ఎక్కువ శాతం మంది జిమ్ కి వెళ్లి కష్టపడి కసరత్తులు చేస్తూ ఉంటారు. అయితే జిమ్ లో కష్టపడిన తర్వాత అనేక రకాల డ్రింక్స్ ఫుడ్ ఐటమ్స్ తీసుకుంటూ ఉంటారు. జిమ్ లో కసరత్తులకు తగ్గట్టుగా ఫుడ్ తీసుకోవడం తప్పనిసరి. జిమ్ చేసిన తర్వాత చాలామంది కూల్ డ్రింక్స్ తాగుతూ ఉంటారు. పానీయలలో అధిక మొత్తంలో చక్కెర ఉంటుంది. దాంతో శరీరంలో క్యాలరీలు పెరుగుతాయి.

చాలామందికి ఉన్న సందేహం ఏమిటంటే జిమ్ కి వెళ్ళిన తర్వాత కొబ్బరి నీళ్ళు తీసుకోవచ్చా లేదా? తీసుకుంటే ఏమైనా ప్రమాదమా అన్న విషయాల గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. ఆ వివరాల్లోకి వెళితే.. జిమ్ చేసిన తర్వాత కొబ్బరి నీళ్లు తాగవచ్చు. కొబ్బరి నీరు తాగడం వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. శరీరానికి కావాల్సిన శక్తి అందడంతో పాటు రోజంతా యాక్టివ్ గా ఉండవచ్చు. అందుకే ఉదయాన్నే వ్యాయామం చేసిన తర్వాత కొబ్బరి నీళ్లను తీసుకుంటే రోజంతా ఎనర్జిటిక్‌గా ఉండవచ్చ.

 

కొబ్బరి నీళ్లలో 5 రకాల ఎలక్ట్రోలైట్స్, పొటాషియం ఉంటుంది. కొబ్బరి నీటిలో విటమిన్ బి, యాంటీ ఆక్సిడెంట్లు లభిస్తాయి. దీన్ని తీసుకోవడం వల్ల వర్కవుట్ అయ్యాక కండరాల్లో వచ్చే తిమ్మిర్లు దూరమవుతాయి. జిమ్ తర్వాత, స్పోర్ట్స్ తర్వాత డ్రింక్‌ని తీసుకోవాలనుకుంటే కొబ్బరి నీరు తాగడం మంచిది. ఎలాంటి క్యాలరీలు పెరగవు, ఇంకా ఫిట్‌గా ఉంటారు. జిమ్‌ చేసే వాళ్లే కాదు. బరువు తగ్గాలనుకునే వారు కూడా ఇది ట్రై చేయవచ్చు. అధిక బరువు ఉన్నవారు తరచుగా అతిగా తినే సమస్యను ఎదుర్కొంటారు. వాళ్లకు ఎప్పుడూ ఏదో ఒకటి తినాలనే కోరిక ఉంటుంది. వర్కవుట్ చేసిన తర్వాత కొబ్బరి నీళ్లను తీసుకుంటే, చాలా సేపు కడుపు నిండినట్లు అనిపిస్తుంది.

 

Related Articles

ట్రేండింగ్

CM Jagan: కూటమి విజయాన్ని ఫిక్స్ చేసిన జగన్.. మేనిఫెస్టో హామీలతో బొక్కా బోర్లా పడ్డారా?

CM Jagan: త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలలో నిర్వహిస్తున్నారు. అయితే వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి వై నాట్ 175 అంటూ ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు....
- Advertisement -
- Advertisement -