Pawan: తెలంగాణలో మహిళల మిస్సింగ్ పై నోరు మెదపగలవా పవన్.. వాస్తవాలివే!

Pawan: ఏపీలో ఇటీవలే పవన్ కళ్యాణ్ వాలంటరీ వ్యవస్థ పై చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అంతేకాకుండా ఇప్పటికీ ఈ వివాదాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. వాలంటీర్ వ్యవస్థ గురించి జనసేనాని పవన్ కళ్యాణ్ ఎంత చులకనగా, ఎంత నీచంగా మాట్లాడారో అందరికీ తెలిసిందే.వాలంటీర్ వ్యవస్థ మహిళల అక్రమ రవాణాకు పాల్పడుతున్నారంటూ పవన్ దారుణమైన ఆరోపణలు చేశారు. గ్రామాల్లో ఉండే ఒంటరి మహిళలు, అమ్మాయిల వ్యక్తిగత వివరాలను సేకరించి వారిని వ్యభిచార గృహాలకు తరలిస్తున్నారు అంటూ నిందలు కూడా వేశారు.

అయితే వాస్తవాలు ఏమిటో గణాంకాల సహితంగా కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. రాజ్యసభలో పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో తెలుగు రాష్ట్రాల్లో ప్రతి సంవత్సరం వేల సంఖ్యలో అమ్మాయిలు, మహిళలు అదృశ్యం అవుతున్న సంగతిని కేంద్రం ప్రకటించింది. రెండు తెలుగు రాష్ట్రాలలో కలిపి గత మూడేళ్లలో 72 వేల 767 మంది అదృశ్యం అయినట్టు పార్లమెంటుకు నివేదించింది. వీరిలో సుమారు 16 వేల మంది అమ్మాయిలు ఉండగా 56 వేల పైచిలుకు మహిళలు ఉన్నారని తెలిపింది. ఈ కేసులు ప్రతి సంవత్సరం పెరుగుతూ ఉన్నాయని కూడా వెల్లడించింది.

 

ఏపీలో మహిళలు, బాలికలు అదృశ్యం అవుతుండడానికి వాలంటీర్లే కారణం అనేది పవన్ చేసిన నీచమైన ఆరోపణ. అయితే కేంద్ర హోమ్ శాఖ ప్రకటించిన వివరాలను గమనించినప్పుడు ఏపీ కంటే జనాభా పరంగా అతి తక్కువ ఉండే తెలంగాణలో ఏపీ కంటే ఎక్కువ మంది అదృశ్యం అవుతున్న సంగతి చాలా స్పష్టంగా తెలియజేసింది. గత మూడేళ్లలో ఏపీలో మొత్తం 30 వేల మంది అదృశ్యం అయ్యారు. అదే తెలంగాణ విషయానికి వస్తే 43 వేల మంది అదృశ్యం అయినట్లుగా కేంద్రం ప్రకటించిన గణాంకాలు మనకు తెలియజేస్తాయి. అంటే ఏపీతో పోల్చుకుంటే తెలంగాణలో దాదాపు 13,000 మంది మహిళలు ఎక్కువగా అదృశ్యంఅయ్యారు.

 

అయితే ఏపీలో మహిళలు అదృశ్యం కావడానికి వాలంటీర్లే కారకులని ఒక మంచి వ్యవస్థ మీద చెత్త ఆరోపణలు చేస్తున్న పవన్ కళ్యాణ్.. అంతకంటే ఎక్కువగా తెలంగాణలో జరుగుతున్న అదృశ్యాలకు ఎలాంటి సంజాయిషీ ఇస్తారు? ఎలాంటి వివరణ ఇవ్వగలరు? తెలంగాణలో ఏ కారణంగా ఎక్కువ మంది బాలికలు, మహిళలు అదృశ్యం అవుతున్నారని చెప్పగలరు? అనేది ప్రజలకు కలుగుతున్న సందేహం. మహిళల అదృశ్యం విషయంలో కూడా అనేక సామాజిక కారణాలు ఉన్నాయి. భర్తల వేధింపులు భరించలేని వారు ఇతర వైవాహిహేతర సంబంధాలు ఉన్నవారు ఆ కారణంగా రహస్యంగా పారిపోవడం, వారి సంబంధీకులు పోలీసు కేసు నమోదు చేసి ఊరుకోవడం అనేది తరచుగా జరిగే పని! అయితే వీటన్నింటినీ కూడా వ్యభిచార గృహాలకు తరలిపోయే వ్యవహారాలుగా ప్రకటిస్తున్న పవన్ మసిపూసి మారేడు కాయ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఇలాంటి నీచమైన ఎత్తుగడలను మానుకోకుంటే ప్రజలు ఆయనను అసహ్యించుకుంటారు. ఏపీ గురించి మాట్లాడినట్టుగా తెలంగాణ గురించి పవన్ కళ్యాణ్ అలా మాట్లాడ దమ్ముందా అని ఏపీ వాలంటరీలు ప్రశ్నిస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Election Commission: పింఛన్ల పంపిణీలో ఈసీ కీలక ఆదేశాలు.. జగన్ సర్కార్ కు ఇక చుక్కలేగా!

Election Commission: ఏపీలో వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాలంటీర్ వ్యవస్థను తీసుకువచ్చింది అయితే ప్రజలకు అందే సంక్షేమ పథకాలు అన్నిటిని కూడా వాలంటీర్ల ద్వారా ఇంటి వద్దకే తీసుకువెళ్లారు అయితే...
- Advertisement -
- Advertisement -