Head Ache: తలనొప్పి భరించలేకపోతున్నారా.. ఇంటి చిట్కాలతో ఉపశమనం?

Head Ache: ప్రస్తుత రోజుల్లో ఈ ఉరుకుల పరుగుల జీవితంలో పని, ఫ్యామిలీ ఇలా ఇతర సమస్యల కారణంగా ఒత్తిడి సమస్యతో బాధపడుతున్నారు. ఈ ఒత్తిడి సమస్య కారణంగా తలనొప్పిగా అనిపించడం కోపం రావడం లాంటివి జరుగుతూ ఉంటాయి. అంతేకాకుండా చిన్న చిన్న వాటికే స్ట్రెస్ గా ఫీల్ అయ్యి తలనొప్పి కూడా తెచ్చుకుంటూ ఉంటారు. కొన్ని కొన్ని సార్లు తలనొప్పి ఎక్కువ అయ్యి చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. దీంతోపాటుగా ఈ మధ్యకాలంలో ఎక్కువగా వినిపిస్తున్న పేర్లలో సర్వైకల్ వెర్టిగో కూడా ఒకటి. ఇది ఒక వ్యాధి. తల తిరగడం, మైకంగా ఉండటం, ఏకాగ్రత కోల్పోవడం దీని ప్రధాన లక్షాణాలుగా చెప్పవచ్చు.

 

అయితే మొదట్లో దీని ప్రభావం కొద్దిగా ఉన్నా నిర్లక్ష్యం చేస్తే చాలా ఇబ్బందికర పరిస్థితులు తలెత్తవచ్చని వైద్యులు చెబుతున్నారు. మరి అటువంటి అప్పుడు ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. జీవనశైలి ఈ వ్యాధికి కారణం కూడా అవొచ్చు. కంప్యూటర్ డెస్క్ వద్ద ఎక్కువ సేపు కూర్చొని ఒకే భంగిమలో పనిచేయడం వల్ల సర్వైకల్ వెర్టిగో వస్తుంది. మెడ సరైన పొజిషన్ లో లేకపోవడం, వెన్నుపాము గాయం కారణంగా, ప్రజలు తరచుగా ఈ వ్యాధి బారిన పడుతుంటారు. ఈ వ్యాధి బారిన పడినప్పుడు మెడ నొప్పితో పాటు కళ్లు తిరగడం కూడా ఇబ్బంది పెడుతుంది. ఈ వ్యాధి కారణంగా, ఒక వ్యక్తి ఏకాగ్రత తగ్గుతుంది. మెడలో నొప్పి ఉంటుంది.

 

నిలబడి లేదా నేరుగా నడవడానికి ఇబ్బంది పడతారు. నడుస్తుంటే తల తిరగడం వల్ల పడిపోతానేమోనని భయం ఏర్పడుతుంది. తలనొప్పి, వికారం, వాంతుల ఫీలింగ్ ఉంటుంది. చెవినొప్పి లేదా చెవులలో రింగింగ్ అవుతుంటుంది. నడుస్తున్నప్పుడు, కూర్చున్నప్పుడు లేదా నిలబడి ఉన్నప్పుడు బ్యాలెన్స్ కోల్పోవడం, వీక్ గా ఉన్న ఫీలింగ్ కలుగుతుంటుంది. మరి ఇటువంటి సమయంలో ఎటువంటి చిట్కాలు పాటించాలి అన్న విషయానికొస్తే.. ఈ వ్యాధి కారణంగా, మైకం, వికారం, భయం ఏర్పడతాయి. అలాంటప్పుడు కొంచెం కొత్తిమీర, ఉసిరికాయలను తీసుకోవాలి. మీరు కొత్తిమీర, ఉసిరికాయలను రాత్రిపూట ఒక గ్లాసు నీటిలో నానబెట్టి ఉపయోగించవచ్చు.

 

ఈ నీటిని ఉదయాన్నే వడపోసి ఆ నీటిని తాగడం వల్ల సర్వైకల్ వెర్టిగో లక్షణాల నుంచి ఉపశమనం లభిస్తుంది. అలాగే మీకు ఈ సమస్య కారణంగా కళ్లు తిరగడం వల్ల లాంటి ఇబ్బంది కలిగినప్పుడు చిన్న అల్లం ముక్కను నోటిలో పెట్టుకుని చప్పరించాలి. అల్లం తినడం వల్ల రక్తప్రసరణ బాగా జరుగుతుంది. ఇది మెదడు సాంత్వన పొందుతుంది. మీ తల తిరుగుతుంటే, మైకం, వికారం మిమ్మల్ని బాధపెడితే, పిప్పరమెంటు టీ మంచి కాస్త నెమ్మది నిస్తుంది. పుదీనా టీ వికారం తొలగిపోతుది. మెడ నొప్పి నుంచి బయటపడటానికి క్రమం తప్పకుండా వ్యాయామం చేయండి. మెడకు వ్యాయామం చేయడం వల్ల మెడ నొప్పి నుండి ఉపశమనం లభిస్తుంది.

Related Articles

ట్రేండింగ్

YSRCP Leaders Tension: టీడీపీ జనసేన కూటమి మేనిఫెస్టో విషయంలో వైసీపీ భయాలివేనా.. ఆ టెన్షన్ తగ్గట్లేదా?

YSRCP Leaders Tension:తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో విడుదల చేసిన తర్వాత జగన్ పార్టీలో భయం మొదలైనట్లుగా ఉంది. ఎందుకంటే వైసీపీ మేనిఫెస్టోలో ఉన్నా హామీల కన్నా కూటమి ఇచ్చిన హామీలు చాలా చాలా...
- Advertisement -
- Advertisement -