Suma:సుమ అమ్మాయి కాదంటూ పరువు తీసిన నటుడు?

Suma: సుమ వ్యాఖ్యాతగా బుల్లితెరపై ఎన్నో కార్యక్రమాలు ప్రసారమవుతూ పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేశాయి. ఇకపోతే సుమ ప్రస్తుతం ఈటీవీలో మల్లెమాలవారు నిర్వహిస్తున్నటువంటి క్యాష్ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తూ పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేస్తున్నారు.ఇకపోతే ప్రతివారం సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఎంతోమంది సినీ సెలెబ్రిటీలు ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు.. ఈ క్రమంలోనే స్వాతి ముత్యం సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా చిత్ర బృందం ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

ఇకపోతే ఈ కార్యక్రమానికి బెల్లంకొండ గణేష్ వర్ష బొల్లమ్మ,పమ్మి సాయి, దివ్య శ్రీపాద, లక్ష్మణ్ కే కృష్ణ హాజరయ్యారు.ఇకపోతే ఈ కార్యక్రమంలో ఎప్పటిలాగే సుమ వారిని ప్రశ్నలు అడుగుతూ వారి నుంచి ఆసక్తికరమైన సమాధానాలు రాబట్టడమే కాకుండా వారి చేత వివిధ రకాల టాస్కులు చేయించి సందడి చేశారు. ఇకపోతే ఈ కార్యక్రమంలో ఒక స్కిట్ లో భాగంగా సుమ ఏకంగా డాక్టర్ గా మారిపోయారు.

ఈ విధంగా సుమ డాక్టర్ గా నటించగా తనకు అసిస్టెంట్ గా వర్ష బొల్లమ్మ నటించారు.ఇక సుమ పేషంట్లని తీసుకురావాలని చెప్పగా ఆమె పేషెంట్లు రావాలి అంటూ ఏదో పండ్లు కూరలు అమ్మినట్టు అమ్మారు. దీంతో సుమ అదేంటి సమోసాలే సమోసాలు అన్నట్టు అలా పిలుస్తున్నావ్ అంటూ తనపై సెటైర్ వేశారు. ఇకపోతే సుమ దగ్గర ట్రీట్మెంట్ చేయించుకోవడానికి సాయి వచ్చి నేను అమ్మాయిల వంక చూస్తే నామెడ అలా వెళ్ళిపోతుంది అంటూ వర్ష వైపు చూస్తూ తన సమస్య చెప్పారు.

సాయి అలా చూడటంతో వర్ష అక్కడి నుంచి పక్కకు తప్పుకుంటుంది. అది చూసిన సుమ అదేంటి నేను అమ్మాయిని కాదా అంటూ అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతుంది. అయితే సాయి వర్షా వైపు చూస్తూ సుమ అమ్మాయి కాదంటూ పరోక్షంగా తన పరువు మొత్తం తీశారు. ప్రస్తుతం ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక ఈ కార్యక్రమానికి సంబంధించిన పూర్తి వినోదం చూడాలంటే ఈ శనివారం వరకు వేచి చూడాలి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -