CastingCouch:ఈ యంగ్ బ్యూటీ సినిమా కష్టాలు వింటే షాకవ్వాల్సిందే!

CastingCouch:సినిమా ఇండస్ట్రీ అంటే రంగుల ప్రపంచం అని అందరికీ తెలుసు. సెలబ్రిటీలు అందరూ విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారని అందరూ అనుకుంటూ ఉంటారు. అయితే అందులో కష్టాలుంటాయని, అవమానాలు ఉంటాయని చాలా మందికి తెలీదు. ముఖ్యంలో హీరోయిన్లకు ఎదురయ్యే సమస్యలు చాలానే ఉంటాయి. ఈ మధ్యకాలంలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు క్యాస్టింగ్ కౌచ్.

ఏ చిత్ర పరిశ్రమలో చూసినా క్యాస్టింగ్ కౌచ్ ఉందంటూ పలువురు సెలబ్రిటీలు ఇదివరకే తేల్చి చెప్పారు. సినిమాల్లో అవకాశాలు కల్పిస్తామని చెప్పి అమ్మాయిలను వాడుకోవడం అనేది ఈ క్యాస్టింగ్ కౌచ్ కు అర్థం అని చెప్పాలి. దీని కారణంగా చాలా మంది అమ్మాయి ఆశలు అడియాశలు అయ్యాయి. అనేక మంది జీవితాలు నాశనం అయ్యాయి. సినిమాల్లో నటించాలనే తమ కోరికను చాలా మంది అమ్మాయిలు క్యాస్టింగ్ కౌచ్ ఉంటుందని చంపుకున్నారు.

క్యాస్టింగ్ కౌచ్ ఎప్పటి నుంచో ఉన్నా ఈ మధ్యకాలంలో కొందరు ముందుకొచ్చి ధైర్యంగా చెప్పారు. సినీ ఇండస్ట్రీల్లో తాము ఎదుర్కొన్న కష్టాల గురించి పలువురు హీరోయిన్లు చెప్పుకొచ్చారు. తాజాగా ఓ టాలీవుడ్ యంగ్ బ్యూటీ ఒకరు తాను కూడా క్యాస్టింగ్ కౌచ్ బాధితురాలినేనని తెలిపారు. పది మంది సెలబ్రిటీలు చెప్పినట్లు చేసినా కూడా తనకు ఛాన్స్ రాలేదని, ఇండస్ట్రీలో చాలా మంది తనను మోసం చేశారని ఆమె వెల్లడించారు.

సినీ ఇండస్ట్రీలో ఇలాంటి మోసం చేసేవారు కూడా ఉంటారా అని పలువురు నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. గతంలో కూడా చాలా మంది హీరోయిన్లు క్యాస్టింగ్ కౌచ్ పై స్పందించారు. బాలీవుడ్ బ్యూటీ మల్లికా షెరావత్, సీనియర్ నటి ఇషా కొప్పికర్, స్వీటీ అనుష్క శెట్టి, భూమిక, బిగ్ బాస్ కంటెస్టెంట్ శ్వేత వర్మ, నటి ప్రగతి, శ్రీరెడ్డి, సీనియర్ నటి అన్నపూర్ణ, యాంకర్లు అనసూయ, రష్మి వంటి వారు స్పందించారు. ఓ వైపు క్యాస్టింగ్ కౌచ్ పై ఉద్యమమే సాగుతున్నప్పటికీ మరో వైపు అది మాత్రం ఆగడం లేదని పలువురు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -