JD Laxmi Narayana: రాజకీయాల్లోకి జేడీ రీ ఎంట్రీ? వచ్చ ఎన్నికల్లో ఆ పార్టీ నుంచి వపోటీ

JD Laxmi Narayana: జేడీ లక్ష్మినారాయణ మళ్లీ పొలిటికల్ రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. తిరిగి రాజకీయాల్లోకి అడుగుపెట్టాలనే ఆలోచనలో ఆయన ఉన్నట్లు తెలుస్తోంది. ఎప్పుడూ మీడియాతో టచ్ లో ఉండే జేడీ లక్ష్మినారాయణ ఏదోక చర్చా వేదికలో పాల్గొంటూ ఉంటారు. సమకాలీన అంశాలపై పాల్గొనే చర్చల్లో ఎక్కువగా పాల్గొనే జేడీ లక్ష్మినారాయణ.. రాజకీయ డిబేట్లకు దూరంగా ఉంటారు. కానీ ఇటీవల పొలిటికల్ డిబేట్లలలో కూడా జేడీ లక్ష్మినారాయణ పాల్గొంటున్నారు. రాజకీయాల డిబేట్లలో గట్టిగా మాట్లాడుతూ ప్రభుత్వంపై విమర్శలు చేస్తు్న్నారు.

దీంతో పొలిటికల్ రీ ఎంట్రీ ఇవ్వడం కోసమే రాజకీయ చర్చల్లో జేడీ పాల్గొంటున్నట్లు కొంతమంది అభిప్రాయపడుతున్నారు. కానీ జేడీ రాజకీయాల్లోకి తిరిగి అడుగుపెడితే ఏ పార్టీలో చేరతారనేది చర్చనీయాంశంగా మారింది. గతంలో జనసేన పార్టీలో చేరిన ఆయన.. గత ఎన్నికల్లో విశాఖపట్నం లోక్ సభ స్థానం నుంచి ఆ పార్టీ తరపున పోటీ చేశారు. దాదాపు రెండు లక్షల డెబ్బై ఎనిమిది వేల ఓట్లు దక్కించుకున్నారు. చివరిలో ఆయనను విశాఖ లోక్ సభ అభ్యర్ధిగా పవన్ పోటీలోకి దింపారు. దీంతో ఆయన ప్రచారం చేసుకోవడానికి కూడా ఎ క్కువ సమయం దొరకలేదు. కేవలం తక్కువ రోజుల్లోనే ప్రచారం చేసి 3 లక్షల ఓట్ల దాకా దక్కించుకున్నారు.

యువతలో, విద్యార్థుల్లో జేడీకి మంచి పేరు ఉంది. అవినీతి రహిత పాలన కోసం, కులరహిత సమాజం కోసం ఆయన ఇచ్చే స్పీచ్ ల పట్ల యువత, విద్యార్థులు ఆకర్షితులవుతారు. ఆయన వ్యాఖ్యలకు చాలామంది స్పూర్తి పొందుతారు. గత ఎన్నికలో విశాఖలో పరాజయం చెందిన తర్వాత జేడీ కాస్త సైలెంట్ గా ఉన్నారు. కానీ ఇటీవల మరింత స్పీడ్ పెంచారు. తిరిగి రాజకీయాల్లోకి రావాలని భావిస్తున్న ఆయన.. అక్టోబర్ 2ని ముహూర్తంగా ఎంచుకుున్నట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం నడుస్తోంది. గాంధీ జయంతి రోజున తన పొలిటికల్ రీ ఎంట్రీని అధికారికంగా ప్రకటిస్తారని చెబుతున్నారు.

అయితే ఆయనకు అన్ని పార్టీల నుంచి ఆహ్వానాలు వస్తున్నాయి. తిరిగి జనసేనలో చేరాలని కొంతమంది కోరుతున్నారు. కానీ బయటకు వచ్చిన తర్వాత మళ్లీ ఆ పార్టీలో చేరడానికి జేడీ ఆసక్తి చూపడం లేదు. ఇక టీడీపీలో చేరాల్సిందిగా ఆయనకు ఎప్పటినుంచో చంద్రబాబు నుంచి పిలుపులు వస్తున్నాయి. కానీ టీడీపీలో చేరడానికి కూడా ఆయన ఇష్టపడటం లేదు. ఇక బీజేపీ, ఆప్ పార్టీల నుంచి జేడీకి ఆహ్వానాలు వచ్చాయి. గతంలో ఆర్ఎస్ఎస్ కార్యక్రమానికి జేడీ హాజరయ్యారు. దీంతో బీజేపీలో చేరతారనే ప్రచారం జరిగింది. బీజేపీ పట్ల కూడా ఆయన సానుకూలంగా ఉన్నారు.

దీంతో జేడీ లక్ష్మీనారాయణ బీజేపీలో చేరే అవకాశం లేకపోలేదు. బీజేపీలో చేరి వచ్చే ఎన్నికల్లో విశాఖ లోక సభ అభ్యర్ధిగా పోటీ చేస్తారనే వార్తలు వస్తున్నాయి. గతంలో విశాఖ నుంచి కంభంపాటి హరిబాబు బీజేపీ తరపున ఎంపీగా గెలిచారు. అప్పుడు టీడీపీతో పొత్తు ఉండటంతో జగన్ తల్లి విజయలక్ష్మిపై హరిబాబు విజయం సాధించారు. ఈ సారి కూడా జనసేన పార్టీతో బీజేపీకి పొత్తు ఉంది. దీంతో జేడీకి గెలుపు అవకాశాలు ఉంటాయనే అంచనాలు ఉన్నాయట. అందుకే బీజేపీలో చేరి వచ్చే ఎన్నికల్లో విశాఖ నుంచి పోటీ చేయాలని జేడీ ఆలోచన చేస్తున్నారట.

ఇక జేడీ లక్ష్మినారాయణకు ఆప్ నుంచి కడా ఆహ్వానం వచ్చింది. ఆప్ లో చేరితే ఏపీ ప్రెసిడెంట్ పదవిని ఇస్తామని ఆ పార్టీ వర్గాల నుంచి ఆఫర్ వచ్చింది. కానీ ఏపీలో ఆప్ కు బలం లేకపోవడంతో జేడీ అసక్తి చూపడం లేదు. బీజేపీకి కూడా ఏపీలో అంతగా బలం లేదు. కానీ ఆర్ఎస్ఎస్ నేతలతో జేడీకి మంచి సంబంధాలు ఉన్నాయి. కేంద్రంలో అధికారంతో పాటు ఏపీలో జనసేనతో పొత్తులో ఉంది. కనుక బీజేపీలో చేరడం ఖాయమనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -