KCR vs Jagan: కేసీఆర్, జగన్ పోటీ పడితే విజేత అయ్యేది అతనేనా?

KCR vs Jagan: ఏపీ సీఎం జగన్ ప్రతిపక్షంతో పోరాడడం మానేసి చాలా కాలమవుతోంది. ఆయన తన కుటుంబం, రాజకీయ స్నేహితులు, అధికారంలోకి వచ్చిన వారిపై కుట్రలు చేసుకుంటూ అదే రాజకీయం అనుకుంటున్నారు. అంతేకాకుండా తనను తాను కాపాడుకోవడం ఆయన ప్రత్యేకంగా సిద్ధవహిస్తున్నారు. తాజాగా ఆయన కేసీఆర్ కుటుంబాన్ని తీవ్రంగా ఇబ్బంది పెట్టేందుకు రెడీ అయినట్లుగా ఢిల్లీలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవితను ఇరికించేందుకు సాయం చేస్తానని జగన్ ఢిల్లీ పెద్దలకు హమీ ఇచ్చినట్లు తెలుస్తోంది.

ఆ సాయం శరత్ చంద్రారెడ్డి అప్రూవర్ గా మారడమే. ఢిల్లీ లిక్కర్ స్కాంలో శరత్ చంద్రారెడ్డి చాలాకాలం పాటు జైల్లో ఉన్నారు. తన భార్యకు ఆరోగ్యం బాగో లేదన్న కారణం చెప్పి బెయిల్ తెచ్చుకుని ప్రస్తుతం బయట ఉన్నారు. అరబిందో వారసుడు అయిన శరత్ చంద్రారెడ్డి మద్యం వ్యాపారం చేయడం ఏమిటో చాలా మందికి అర్థం కాలేదు. ఈ కారణంగా అరబిందో షేర్ కూడా పడిపోయింది. తర్వాత అరబిందోలో ఉన్న పదవుల నుంచి ఆయనను తప్పించారు. కవిత, అరబిందో శరత్ చంద్రారెడ్డి, మాగుంట రాఘవ్ కలిసే లిక్కర్ వ్యాపారం చేసి స్కాంకు పాల్పడ్డారని సీబీఐ ఆరోపిస్తోంది.

 

ఈ క్రమంలోనే శరత్ చంద్రారెడ్డి అప్రూవర్ గా మారితే కవితను పూర్తి స్థాయిలో ఫ్రేమ్ చేయవచ్చని భావిస్తున్నట్లగా చెబుతున్నారు. అమిత్ షాతో భేటీలో శరత్ చంద్రారెడ్డి అప్రూవర్ అవుతారన్న సంకేతాలు ఇచ్చారని అంటున్నారు. అందుకే శరత్ చంద్రారెడ్డికి వై కేటగిరి భధ్రతను కేంద్రం కేటాయించినట్లుగా ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఆడిటర్ బుచ్చిబాబు అప్రూవర్ అయ్యాడు. ఆయన చెప్పిన వివరాలతో కవిత ఎక్కడెక్కడ భూములు ఎవరెవరి పేరు మీద కొన్నారో ఈడీ బయట పెట్టింది. ఇప్పుడు కవితను ఇబ్బందుల్లో నెట్టడానికి తెలంగాణలో బీజేపీకి రాజకీయ ప్రయోజనం కల్పించడానికి తనను తాను తాను కాపాడుకునేందుకు జగన్ రెడీ అయినట్లుగా చెబుతున్నారు. దీంతో ప్రస్తుతం జగన్ వర్సెస్ కేసీఆర్ అన్నట్టుగా రాజకీయాలు మారాయి. మరి ఈ రేసులో ఎవరు గెలుస్తారా అన్నది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. వివేకా హత్య కేసు ప్రకారం చూసుకుంటే ఆ కేసులో జగన్ పేరుని కూడా చేర్చింది సీబీఐ. దాంతో తన కోసం అయినా నమ్మిన వాళ్లను నట్టేట ముంచడానికి రెడీ అయ్యారన్న వాదన వినిపిస్తోంది. అయితే ఇలా చేస్తే కేసీఆర్ ఊరుకుంటారా అన్నది కీలక అంశం.

 

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -