Megastar: గంటా, నారాయణ మెగాస్టార్ ను కలవడానికి కారణమిదేనా?

Megastar: మెగాస్టార్ చిరంజీవిని తెలుగుదేశం పార్టీ మాజీ మంత్రులు గంటా శ్రీనివాసరావు, నారాయణ కలిశారు. ఇలా వీరిద్దరూ మెగాస్టార్ చిరంజీవిని కలవడంతో రాష్ట్ర రాజకీయాలలో ప్రస్తుతం చర్చలు మొదలయ్యాయి. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్నటువంటి భోళా శంకర్ సినిమా షూటింగ్ లొకేషన్లో వీరిద్దరూ చిరంజీవిని కలిసినట్టు తెలుస్తోంది.

మంత్రి గంటా శ్రీనివాసరావు నారాయణ ఇద్దరు కూడా మాజీ మంత్రులుగా పనిచేశారు. మెగాస్టార్ చిరంజీవికి నారాయణ చాలా మంచి స్నేహితుడు అయితే నారాయణ శ్రీనివాసరావు ఇద్దరు కూడా వియ్యంకులు అనే విషయం మనకు తెలిసిందే. ఇలా వీరిద్దరూ కలిసి మెగాస్టార్ చిరంజీవిని కలవడంతో బహుశా ఏదో ఇంట్లో శుభకార్యం ఉండడంతోనే ఇద్దరు కలిసి చిరంజీవిని ఆ కార్యక్రమానికి ఆహ్వానించారని తెలుస్తుంది.

 

రాజకీయపరమైన చర్చలు వీరి మధ్య జరగాయన్న విషయానికి వస్తే అలాంటి చర్చలు జరిగే అవకాశం లేదని చెప్పాలి.ఎందుకంటే ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్లోకి విలీనం చేసిన తర్వాత మెగాస్టార్ చిరంజీవి కేంద్ర మంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు. అయితే ఈయన పదవి కాలం ముగిసిన తర్వాత తాను రాజకీయాలకు దూరంగా ఉండబోతున్నానని ప్రకటించారు.

 

ఈ విధంగా తాను రాజకీయాలకు దూరంగా ఉంటున్నారని బహిరంగంగా ప్రకటించడంతో మెగాస్టార్ చిరంజీవిని భారతీయ జనతా పార్టీ తమ పార్టీలోకి ఆహ్వానించడం కోసం శతవిధాలుగా ప్రయత్నాలు చేసిన చిరంజీవి మాత్రం రాజకీయాలకు దూరంగా ఉంటూ తిరిగి సినిమా పనులలో బిజీ అయ్యారు.నారాయణ ఇద్దరు కూడా చిరంజీవి కలవడంతో మరోసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలో చర్చలు మొదలయ్యాయి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -