Prabhas: ఎన్టీఆర్.. నితిన్.. ఇప్పుడు ప్రభాస్.. చర్చనీయాంశంగా కేంద్రమంత్రుల భేటీ

Prabhas:  వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో ఎలాగైనా గెలవాలనే ఉద్దేశంతో బీజేపీ ఉంది. అందుకు తగ్గట్లు ప్రణాళికలు సిద్దం చేసుకుంటుంది. అన్ని అవకాశాలను అందిపుచ్చుకుంటుంది. కేసీఆర్ ను దెబ్బతీసేందుకు కొత్త ఎత్తుగడులు రూపొందిస్తుంది. అందులో భాగంగా ప్రజల్లో ఆదరణ ఉండే సినీ గ్లామర్ పై ఫోకస్ పెట్టింది. సినీ సెలబ్రెటీలను తమకు అనుూలంగా మార్చుకునేందుకు పావులు కదుపుతుంది. ఇప్పటికే మునుగోడు ప్రచారానికి వచ్చిన కేంద్ర హోమంత్రి అమిత్ షా.. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ను అనూహ్యంా కలవడం రాజకీయంగా ప్రకంపనలు రేపింది.

ఇక బండి సంజయ్ పాదయాత్ర ముగింపు కార్యక్రమానికి వచ్చిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా.. అనంతరం హీరో నితిన్ తో భేటీ అయ్యారు. నితిన్ తెలంగాణకు చెందిన వ్యక్తి కావడంతో ఆయనను రాజకీయంగా ఉపయోగించుకోవాలని బీజేపీ చూస్తోంది. ఈ తరుణంలో త్వరలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ను కేంద్రమంత్రి రాజ్ నాధ్ సింగ్ కలవనుండటం ఆసక్తికరంగా మారింది.

స్వయంగా ప్రభాస్ ఇంటికి వెళ్లి రాజ్ నాథ్ కలవనున్నారు. ఈ మేరకు షెడ్యూల్ ఖరారు అయింది. ప్రభాస్ పెద్దనాన్న కృష్ణంరాజు అనారోగ్యంతో తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే. ఆయన గతంలో వాజ్ పేయి ప్రభుత్వంలో కేంద్రమంత్రిగా పనిచేయడంతో పాటు బీజేపీ పార్టీలోనే కొనసాగారు. దీంతో ప్రభాస్ ను కలిసి రాజ్ నాథ్ సింగ్ పరామర్శించనున్నారు. ఈ నెల 16వ తేదీన రాజ్ నాథ్ సింగ్ హైదరాబాద్ రానున్నారు.

ప్రభాస్ ఇంటికి వెళ్లి పెద్దనాన్న మరణంతో దుఖంలో ఉున్న ప్రభాన్ ను పరామర్శించనున్నారు. ఈ నెల 16న కృష్ణంరాజు సంస్మరణ సభ జరగనుంది. ఈ సభలో రాజ్ నాథ్ సింగ్ పాల్గొననున్నారు. రాజ్ నాథ్ సింగ్ తో పాటు బీజేపీకి చెందిన పలువురు నేతలు పాల్గొననున్నారు. కృష్ణంరాజు మృతికి ఇప్పటికే ట్విట్టర్ ద్వారా ప్రధాని మోదీ తన సంతాపం ప్రకటించారు. కుటుంబ సభ్యులకు తన ప్రగాభ సానుభూతి వ్యక్తం చేశారు. కేంద్రమంత్రిగా, బీజేపీకి ఆయన చేసిన సేవలను మోదీ కొనియాడారు.

గతంలో కృష్ణంరాజు బీజేపీ తరపున కాకినాడ లోక్ సభ స్థానం నుంచి ఎంపీగా గెలిచారు. ఆ తర్వాత కేంద్రమంత్రిగా పనిచేశారు. 1998 లోక్ సభ ఎన్నికల్లో ఉమ్మడి రాష్ట్రంలో 42 స్థానాలకు గాను 4 ఎంపీ సీట్లను బీజేపీ గెలుచుకుంది. ఆ సమయలో సినీ నటుడిగా పాపులర్ అయిన కృష్ణంరాజుకు కేంద్రమంత్రిగా తెలుగు రాష్ట్రాల నుంచి అవకాశం కల్పించారు. అయితే పరామర్శించడానికి ప్రభాస్ ను కలుస్తున్నప్పటికీ.. ఇప్పటికే ఎన్టీఆర్, నితిన్ లతను బీజేపీ అగ్రనేతలు కలిసి నేపథ్యంలో.. ప్రభాస్ ను కేంద్రమంత్రి కలవనుండటం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: చిరు జీవులకు సైతం అన్యాయం చేసిన జగన్ సర్కార్.. మరీ ఇంతలా మోసమా?

CM Jagan: జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున రాష్ట్రంలో అవినీతి అక్రమాలు జరుగుతున్నాయి. పెద్ద ఎత్తున దోపిడీలు చేస్తున్నారు వైకాపా నేతలు కొండలను గుట్టలను చెరువులను వదలలేదు పెద్ద...
- Advertisement -
- Advertisement -