YS Jagan: మూడు రాజధానులపై జగన్ కు షాక్.. అమరావతికే జై కొట్టిన కేంద్రం

YS Jagan: సీఎం జగన్ కు కేంద్ర పభుత్వం షాక్ ఇచ్చింది. మూడు రాజధానుల అంశంపై జగన్ సర్కార్ కు ఎదురుదెబ్బ తగిలింది. ఏపీ మూడు రాజధానుల వ్యవహారంపై తమ వైఖరిని కేంద్ర ప్రభుత్వం తేల్చేసింది. మూడు రాజాధానులకు తమ ప్రభుత్వం వ్యతిరేకమని కేంద్రం వెల్లడించింది. మూడు రాజధానులపై కేంద్ర ప్రభుత్వ వైఖరిని కేంద్ర మంత్రి మురళీధరన్ తెలియజేశారు. మూడు రాజధానులకు తాము వ్యతిరేకమని ఆయన వెల్లడించారు. ఏపీకి మూడు రాజధానులు అసలు అవసరం లేదని అభిప్రాయపడ్డారు. మూడు రాజధానులకు తాము అసలు మద్దతు ఇచ్చేది లేదన్నారు.

అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి రాష్ట్ర ప్రభుత్వం మూడు రాజధానుల మంత్రం వినిపిస్తోందని, కానీ ప్రజల నుంచి మాత్రం ఎలాంటి మద్దతు రాడం లేదు కదా అని కేంద్రమంత్రి మురళీధరన్ ప్రశ్నించారు. మూడు రాజధానుల వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉండని, అందుకే ప్రజల నుంచి కూడా రాష్ట్ర ప్రభుత్వానికి మద్దతు లభించడం లేదని కేంద్రమంత్రి అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా వైసీపీపై మురళీధరన్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. విశాఖను దోచుకోడానికి వైసీపీ కుట్ర పన్నిందని, వైసీపీకి విశాఖపై అసలు ప్రేమ లేదంటూ తీవ్ర వ్యాక్యలు చేవారు. విశాఖ ఇప్పటికే అభివృద్ది చెందిన సిటీ అని, కొత్తగా డెవలప్ మెంట్ చేయాల్సిన పని ఏమీ లేదన్నారు.

విశాఖలో భూములకు భారీ దర ఉండటంతో వైసీపీ నేతలకు, జగన్ కు ఇక్కడ కన్ను పడిందని కేంద్రమంత్రి మురళీధరన్ వ్యాఖ్యానించారు. రాజధాని అమరావతి తమ మద్దతు ఉంటుందని, ప్రధాని మోదీ స్వయంగా వచ్చి రాజధానిగా అమరావతికి శంకుస్థాపన చేసిన విషయాన్ని గుర్తు చేవారు. ఇప్పటికే అమరావతికి రూ.7500 కోట్లు కేంద్ర ప్రభుత్వం కేటాయించిందన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలకు తమ పార్టీ స్కిక్టర్లు అతికించుకుని వైసీపీ ప్రచారం చేసుకోవడం దారుణమన్నారు. కేంద్ర ప్రభుత్వ పధకాలకు స్కిక్కర్లు మార్చి తమ ప్రభుత్వ పథకాలుా వైసీపీ నేతలు చెప్పుకోవడం సిగ్గుచేటని విమర్శించారు.

అమరావతి రాజధానుల పాదయాత్రపై కూడా కేంద్రమంత్రి మురళీధరన్ స్పందించారు. రాజధాని రైతుల పాదయాత్రపై జగన్ స్పందించాలని సూచించారు. జగన్ స్పందించి వారితో చర్చలు జరిపి ఉంటే బాగుండేదన్నారు. వారి సమస్యలను తెసుసుకుని రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాలని, వారి డిమాండ్లపై చర్చ జరపాలని కేంద్రమంత్రి కోరారు. విశాఖలో మూడు రాజధానులుగా మద్దతుగా వైసీపీ ర్యాలీ నిర్వహిస్తున్న క్రమంలో కేంద్రమంత్రి ఈ వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశంగా మారింది. మూడు రాజధానుల విషయంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ వ్యహాన్ని కేంద్రమంత్రి క్లియర్ కట్ గా చెప్పారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

మూడు రాజధానులకు మద్దతుగా ర్యాలీసి బహిరంగ సభ ఏర్పాటు చేసి రోజే కేంద్రమంత్రి ఈ వ్యాఖ్యలు చేయడం వైసీపీ వర్గాలను టెన్షన్ పెుడుతోంది. మూడు రాజధానులు ఏర్పాటు చేయాలంటే కేంద్ర ప్రభుత్వ అండ ఉండాలి. కేంద్ర ప్రభుత్వం నుంచి సానకూల స్పందన లేకుండా మూడు రాజధానులు ఏర్పాటు చేయడం అసాధ్యమని చెప్పవచ్చు. మూడు రాజాధానులకు బీజేపీ వ్యతిరేకంగా ఉండటం, అమరావతికే మద్దతు తెలుపుతున్న క్రమంలో మూడు రాజధానులను ఏర్పాటు చేయడం కష్టమననే భావన ప్రజల్లో ఏర్పడింది. దీంతో కావాలనే ప్రజల మధ్య, మూడు ప్రాంతాల ప్రజల మధ్య చిచ్చు పెట్టేందుకే జగన్ ప్రయత్నిస్తున్నారనే ఆరోపణలు ప్రతిపక్షాల నుంచి వినిపిస్తున్నాయి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -