NTR: అప్పుడు విమర్శించిన చంద్రబాబే ఇప్పుడు ఎన్టీఆర్ ను భలే పొగిడారే!

NTR: చంద్రబాబు నాయుడు తన రాజకీయ లబ్దికోసం తన మాటలను ఎలాగైనా మారుస్తారు అనే సంగతి మనకు తెలిసిందే.తన రాజకీయ లాభాల కోసం ఒకప్పుడు ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచి చంపిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు తెలుగు జాతికే ఎన్టీఆర్ గర్వకారణం అంటూ పొగడడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఎన్టీఆర్ బతికున్న సమయంలో చంద్రబాబు తనని పెట్టిన హింస అందరికీ తెలిసిందే.ఇలాంటి ఒక గొప్ప మహానీయులను చనిపోయిన తర్వాత కూడా తన రాజకీయ లబ్ధి కోసం చంద్రబాబు నాయుడు వాడుకుంటున్నారు.

తాజాగా హైదరాబాద్లో నిర్వహించిన ఎన్టీఆర్ శత జయంతి వేడుకలలో భాగంగా ఎన్టీఆర్ గురించి చంద్రబాబునాయుడు ఎత్తు పెద్ద ఎత్తున ప్రశంసల కురిపించారు ఇలా చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలపై స్పందించిన నేటిజన్స్ సోషల్ మీడియాలో చంద్రబాబు నాయుడుని భారీగ ట్రోల్ చేస్తున్నారు. ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాతనే తెలుగు రాష్ట్రానికి తెలుగు ప్రజలకు గుర్తింపు వచ్చిందని చంద్రబాబు నాయుడు మాట్లాడారు.

 

తెలుగు రాష్ట్రానికి ఎంతో సేవ చేసే పేరు ప్రఖ్యాతలను తీసుకువచ్చిన మహనీయులు ఎన్టీఆర్ కి భారతరత్న ఇవ్వాలని భారతరత్న వచ్చేవరకు సాధించి తీరతాం. ఎన్టీఆర్‌ వ్యక్తి కాదు శక్తి. తెలుగు జాతి ఉన్నంతవరకు, వారి గుండెల్లో ఉంటారు. పేర్కొన్నారు. ఎన్టీఆర్‌కు ముందు, ఆయన తర్వాత తెలుగువారికి వచ్చిన గుర్తింపు గురించి అందరూ ఆలోచించాలి.

 

తెలుగు జాతి ఆస్తి, వారసత్వం ఎన్టీఆర్‌. ఆ మూడక్షరాలు ఓ మహా శక్తి. ఆయన తెలుగు జాతికి స్ఫూర్తి. ఈనెల 28న ఎన్టీఆర్‌ జయంతి సందర్భంగా ప్రతి ఒక్క ఇంట్లో ఎన్టీఆర్ ఫోటో పెట్టి నివాళులు అర్పించాలని చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చారు. ఇలా చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలపై పలువురు స్పందిస్తూ ఆంధ్రప్రదేశ్ కోసం ఆమరణ నిరాహార దీక్ష చేసిన పొట్టి శ్రీరాములు రాష్ట్రం కోసం కృషి చేయలేదా అలాగే పివి నరసింహారావు తెలుగువారి ఆస్తి కాదా? తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌ను మ‌ద్రాస్ నుంచి హైదరాబాద్‌కు తీసుకొచ్చిన దివంగ‌త సీఎం మ‌ర్రి చెన్నారెడ్డి తెలుగువాడు కాదా? అంటూ పెద్ద ఎత్తున చంద్రబాబుపై ట్రోల్ చేస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -