Chandrababu: అదిరిపోయే ఎత్తుగడ వేసిన చంద్రబాబు.. ఆ పని చేయడం వల్ల టీడీపీకి నష్టం లేదుగా!

Chandrababu: టీడీపీ శ్రేణులకు చంద్రబాబుపై అపారమైన నమ్మకం ఉంటుంది. వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా తన రాజకీయాన్ని చేస్తారు టీడీపీ అధినేత. మెజారిటీ పార్టీ శ్రేణుల అభిప్రాయాలకు అనుగుణంగానే ఆయన అడుగులు ఉంటాయి. మొదటి నుంచి చంద్రబాబు ప్రయాణం అలాగే సాగింది. అందుకే టీడీపీ వ్యవస్థాపకుడైన ఎన్టీఆర్ నుంచి పార్టీని తన చేతుల్లోకి తీసుకున్నా.. చంద్రబాబు అభిప్రాయాలను పార్టీ శ్రేణులు స్వాగతించారు. ఎన్టీఆర్ నుంచి చంద్రబాబు పార్టీని తీసుకోవడంలో పెద్దడ్రామానే జరిగింది. పార్టీని హస్తగతం చేసుకునే సమయంలో ఎన్టీఆర్ పై దాడి జరిగిందనే ప్రచారం కూడా ఉంది. ఇంత డ్రామా జరిగినా.. దేవుడితో సమానమైన ఎన్టీఆర్ ను పక్కన పెట్టేసినా.. పార్టీ శ్రేణులు మాత్రం చంద్రబాబు నిర్ణయాన్ని గౌరవించారు. దానికి కారణం.. చంద్రబాబు నాయకత్వంలోనే పార్టీ బలపడిందని కార్యకర్తల బలమైన నమ్మకం. అయితే, కార్యకర్తల నమ్మకంలో అర్థం లేకపోలేదు. టీడీపీ ఎన్నో సంక్షోభాలను ఎదుర్కొంది. 2004లో ఓటమి తర్వాత టీడీపీ బతికిబట్టకడుతుందని ఎవరూ ఊహించలేదు. 2009లో పీఆర్పీ వచ్చిన తర్వాత ఆ పార్టీ టీడీపీని ఆక్రమిస్తుందని అంతా భావించారు. కానీ, 2009లో ప్రతిపక్షానికే పరిమితమైనా.. టీడీపీ గణనీయమైన సీట్లు సాధించింది. ఆ తర్వాత 2013లో రాష్ట్ర విభజన, వైసీపీ స్థాపన తర్వాత మళ్లీ టీడీపీ ప్రభ మసకబారిందనే ప్రచారం జరిగింది. కానీ, అనూహ్యంగా 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చింది.

ఏ రాష్ట్ర విభజన టీడీపీ కనుమరుగు అయ్యేలా చేస్తుందని అంతా అనుకున్నారో.. అదే రాష్ట్ర విభజనని చంద్రబాబు ప్రధాన అస్త్రంగా మార్చుకున్నారు. సంక్షోభం నుంచి అవకాశాలను సృష్టించుకోవడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విధ్య. అందుకే.. రాజధానిలేని రాష్ట్రాని అనుభవజ్ఞుడైన నాయకుడు కావాలనే ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకొని వెళ్లారు. ఆ ఒక్క మాటే టీడీపీని 2019లో అధికారంలోకి వచ్చేలా చేసింది. ఎందుకంటే.. 2014 ఎన్నికలకు ముందు టీడీపీకి గెలుపు అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఓదార్పు యాత్రతో జగన్ కు విపరీతమైన ప్రజాదరణ పెరిగింది. దీనికితోడు జగన్ ను అప్పుడే జైలు నుంచి వచ్చారు. ఆ సింపతీ కూడా జగన్ పై ఉంది. జగన్ జైల్లో ఉన్న సమయంలో షర్హిల పాదయాత్ర చేసి పార్టీని మరింత బలపరిచారు. కాంగ్రెస్‌ను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఎదురులేని శక్తిగా నిలిపిన రాజశేఖర్ రెడ్డి కుమారుడిని అదే కాంగ్రెస్ జైలులో పెట్టిందనే కోపం ప్రజల్లో ఉంది. కాబట్టి.. 2014లో జగన్ గెలుపు ఖాయమని అనుకున్నారు. కానీ, రాష్ట్ర విభజన తర్వాత అనుభవం ఉన్న నాయకుడు కావాలనే ప్రచారాన్ని ప్రజలు నమ్మేలా చంద్రబాబు చేశారు. దీంతో.. 2014లో అధికారంలోకి వచ్చారు. ఇక 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ నేతలపై దాడులు, కేసులతో పార్టీ ఉక్కిరిబిక్కిరి అయింది. కానీ.. ఎక్కడా సహనాన్ని కోల్పోకుండా పార్టీ శ్రేణుల ఆత్మస్థైర్యాన్ని కోల్పోకుండా పార్టీని నడిపించారు. చివరికి ఆయన అరెస్ట్ అయిన తర్వాత.. జైలునుంచి వచ్చిన తర్వాత రెట్టించిన ఉత్సాహంతో ఆయన పని చేశారు.

ఇదంతా పక్కనపెడితే.. మిత్రపక్షాలతో పొత్తులో ఉన్నపుడు మెజార్టీ స్థానాల్లో టీడీపీ పోటీ చేసేలా చంద్రాబాబు వ్యూహాలు రచిస్తారు. రానున్న ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేస్తున్నాయి. పొత్తులో భాగంగా ఏకంగా 144 స్థానాల్లో టీడీపీ పోటీ చేస్తుందంటే మామూలు విషయం కాదు. అది ఒక్క చంద్రబాబు నాయకత్వంలోనే సాధ్యం అవుతుంది. మిత్రపక్షాలైన జనసేన, బీజేపీకి కేవలం 31 స్థానాల్లోనే పోటీ చేస్తున్నాయి. కేంద్రంలో తిరుగులేని బలం కలిగి ఉన్న బీజేపీని పొత్తులో భాగంగా 10 స్థానాలకే పరిమితం చేయడం చిన్న విషయం కాదు. బీజేపీకి ఎక్కువ స్థానాలు కేటాయిస్తే.. టీడీపీ భవిష్యత్ ఏమవుతుందో చంద్రబాబుకి తెలుసు. బీజేపీ బలానికి మించి స్థానాలు కేటాయిస్తే.. తర్వాత టీడీప గ్రాఫ్ పడిపోయే ప్రమాదం ఉంది. మహరాష్ట్రలో శివసేన, కర్నాటకలో జేడీఎస్, బీహార్‌లో జేడీయూ పార్టీలు బీజేపీతో మేజర్ పార్టనర్లుగా పొత్తుపెట్టుకొని పదేళ్లు తిరిగేసరికి మైనర్ పార్టనర్లుగా మారిపోయాయి. బీజేపీతో ఇప్పటి వరకూ టీడీపీ 3 సార్లు పొత్తుపెట్టుకుంది. కానీ, తన బలం పెంచకుందే తప్పా.. బీజేపీ తనకు ప్రమాదం అయ్యేలా మాత్రం చేసుకోలేదు. ఇది చంద్రబాబు చాణుక్యం. అందుకే.. చంద్రబాబును పార్టీ శ్రేణులు అమితంగా అభిమానిస్తూ ఉంటారు.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: చిరు జీవులకు సైతం అన్యాయం చేసిన జగన్ సర్కార్.. మరీ ఇంతలా మోసమా?

CM Jagan: జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున రాష్ట్రంలో అవినీతి అక్రమాలు జరుగుతున్నాయి. పెద్ద ఎత్తున దోపిడీలు చేస్తున్నారు వైకాపా నేతలు కొండలను గుట్టలను చెరువులను వదలలేదు పెద్ద...
- Advertisement -
- Advertisement -