Chandrababu Naidu: ఆ నేతల బుజ్జగింపు బాధ్యత చంద్రబాబుదే.. రంగంలోకి దిగితే మాత్రం తిరుగులేదంటూ?

Chandrababu Naidu: టీడీపీ తొలిజాబితా విడుదల చేసిన తర్వాత చాలా మంది ఆ పార్టీ నేతలు అలబూనారు. కొన్ని స్థానాలు మిత్ర పక్షానికి వెళ్లడం వలన కొంతమంది నేతలు అసంతృప్తిగా ఉంటే.. మరి కొంతమంది మాత్రం.. సొంత పార్టీలోనే వేరేవాళ్లకు వెళ్లడం వలన అకబూనారు. అయితే, వీరందరినీ దారిలోకి తెచ్చుకునేందుకు చంద్రబాబే స్వయంగా రంగంలోకి దిగారు. ఒక్కొక్కరిగా మాట్లాడి ట్రబుల్ షూటర్ బాధ్యతలు చేపట్టనున్నారు. ఎందుకంటే.. చంద్రబాబు 94 స్థానాలను ప్రకటించారు. ఇప్పుడే ఇంతమంది అలకబూనితే.. వచ్చే వచ్చే జాబితాలో చాలా తక్కువ మంది పేర్లు మాత్రమే వస్తాయి. మహా అయితే, టీడీపీకి మరో 40 నుంచి 45 సీట్లు మాత్రమే దక్కుతాయి. అంతుకే, వారిందని బుజ్జగించే పనిలో చంద్రబాబు పడ్డారు.

అసంతృప్తి నేతలనందరినీ తమ ఇంటికి పిలుపించుకొని మాట్లాడుతున్నారు. చంద్రబాబుతో ఇప్పటికే ఆలాపాటి రాజా భేటీ అయ్యారు. ఐదు కోట్ల మంది ప్రజల భ్యవిష్యత్తు కోసమే పొత్తు పెట్టుకున్నామని చంద్రబాబు ఆయనతో తెలిపారు. పొత్తులో భాగంగా తెనాలి సీటు జనసేనకు వెళ్లింది. దీంతో.. ఆలపాటి రాజాకు షాక్ తగిలినట్టు అయింది. దీంతో.. చంద్రబాబు ఆయన్ని పిలిచి మాట్లాడారు. అధికారంలోకి వస్తే మరో రూపంలో న్యాయం చేస్తామని హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇక పెనుకొండ ఇన్‍ఛార్జ్ పార్థసారథికి కూడా చంద్రబాబు నుంచి పిలుపు వచ్చింది. రేపు పార్థసారథితో చంద్రబాబు మాట్లాడనున్నారు.

ఇక అనకాపల్లి టీడీపీ సీటు పంచాయతీ కూడా చంద్రబాబు దగ్గరకు చేరింది. మధ్యాహ్నం టీడీపీ అధినేతను మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద్ భేటీ కానున్నారు. ఆయన అనకాపల్లి సీటు రాకపోవడంతో తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. పొత్తులో భాగంగా ఆ సీటు జనసేనకు వెళ్లింది. జనసేన తరుఫున కొణతాల పోటీ చేయనున్నారు. జనసేనకు సీటు కేటాయించడంపై పీలా గోవింద్ అనుచరులు భగ్గుమంటున్నారు.

టీడీపీ తొలిజాబితాలో వంగవీటి రాధాకు కూడా చోటు దక్కలేదు. విజయవాడ సెంట్రల్ టికెట్‌ను రాధా ఆశించారు. కానీ, సెంట్రల్ సీటు బోండా ఉమకు చంద్రబాబు ఖరారు చేశారు. గత ఎన్నికల్లో కూడా పోటీకి దూరంగా ఉన్న వంగవీటి రాధా ఈ సారి కూడా సైలంట్ అవుతారా అన్న ఉత్కంఠ ఉంది. ఇవాళ లేదా రేపు వంగవీటి రాధా కూడా చంద్రబాబుతో భేటీ కానున్నారు. తొలి జాబితాలో టికెట్లు దక్కని నేతలతో చంద్రబాబు సమావేశం అవుతున్నారు. ఒక్కొక్కరిని పిలిచి మాట్లాడుతున్నారు.

జనసేన పార్టీకి సంబంధించి ఎలాంటి ఇబ్బందుల్లేవు. ఎందుకంటే, టిక్కెట్లు ఆశపడి భంగపడి, పార్టీని వీడే ఆలోచన జనసేన ఆశావహులెవరూ చేయకపోవచ్చు. ఏయే నియోజకవర్గాల్ని జనసేన ఆశిస్తోందో, ఏయే చోట్ల జనసేన బలంగా వుందో.. ఇప్పటికే జనసేనాని, సంబంధిత సమాచారాన్ని పార్టీ ముఖ్య నేతల నుంచి సేకరించి, మిత్రపక్షం టీడీపీకి అందించేశారు. చంద్రబాబు కూడా, ఆ నియోజకవర్గాల విషయమై పెద్దగా అభ్యంతరాలు వ్యక్తం చేయడంలేదు.

జనసేనతో టీడీపీకి పొత్తు ఎంత అవసరమో చంద్రబాబుకి బాగా తెలుసు. అందుకే.. టీడీపీలో టికెట్ ఆశించి భంగపడిన వారిని బుజ్జించేందుకు చంద్రబాబే స్వయంగా రంగంలోకి దిగారు. ఇక ఇప్పుడే ఇలా ఉంటే.. బీజేపీ కూడా పొత్తులో చేరితే ఇంకా సమస్య ఉంటుంది. జనసేనకు 24 స్థానాలు పోగా.. బీజేపీకి మరో 15 స్థానాలు అయినా కేటాయించాల్సి ఉంటుంది. ఆ స్థానాల్లో కూడా టీడీపీ ఆశావాహులను బుజ్జగించాల్సి ఉంటుంది. అందుకే.. చంద్రబాబు బుజ్జగింపులకు దిగారు. అధికారంలోకి వస్తే ఏదో ఒక రూపంలో న్యాయం చేస్తామని హమీ ఇస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Assembly Election: ఏపీలో అక్కడ గెలిస్తే మంత్రి పదవి పక్కా.. ఈ నియోజకవర్గం ప్రత్యేకతలు ఇవే!

Assembly Elections: రాష్ట్రంలోని అతిపెద్ద నియోజకవర్గాలలో మైలవరం నియోజకవర్గం ఒకటి. ముందు ఈ నియోజకవర్గం కమ్యూనిస్టు పాలనలో ఉండేది, తర్వాత తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా మారింది. తెదేపా ఆవిర్భావం తర్వాత తొమ్మిది సార్లు...
- Advertisement -
- Advertisement -