Chandrababu: ఏపీలో మొనగాడు చంద్రబాబే.. ముసలోడు అంటే అవహేళన చేసినోళ్ల నోరు మూయించారా?

Chandrababu: చంద్రబాబుకు వయసు అయిపోయింది. ఆయనను మైండ్ పని చేయడం లేదు. ఇవి చంద్రబాబుపై వైసీపీ నేతలు తరచూ చేసే వ్యాఖ్యలు. కానీ.. ప్రస్తుతం చంద్రబాబులో ఉన్న జోష్ చూస్తే ఎవరైనా ఆయన్ని ముసలోడు అని అనరు. ఎందుకంటే.. ఎన్నికల ప్రచారంలో ఆయనలోని ఉత్సాహం మరెవరిలోనూ కనిపించడం లేదు. డెబ్బై ఏళ్లు వయసులో మండుటెండలో చంద్రబాబు ఏమాత్రం అలసట లేకుండా దూసుకుపోతున్నారు. ప్రచారం విషయంలో జగన్, పవన్ బాగా వెనబడ్డారు. చంద్రబాబులాగే జగన్, పవన్ కూడా వారి పార్టీలకు అధ్యక్షులే. కానీ వారిద్దర చంద్రబాబుతో పోటీ పడలేకపోతున్నారు.

జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత వెంటనే చంద్రబాబు కదనరంగంలో దిగారు. రా.. కదలిరా సభలతో జనంలో క్రేజ్ పెరిగేలా చూసుకున్నారు. రా కదలి రా చివరి సభ మార్చి 4న రాప్తాడులో ముగియనుంది. రా కదలిరా సభలు పూర్తి అయిన వెంటనే ప్రజాగళం యాత్రలు చేస్తున్నారు. జగన్ కూడా చంద్రబాబులా రెండో దశ ప్రచారం చేస్తున్నారు. కానీ.. చంద్రబాబు, జగన్ కు ఓ తేడా ఉంది. చంద్రబాబ రా కదలిరా సభలు రాష్ట్ర వ్యాప్తంగా చాలా నిర్వహించారు. ప్రచారం చేశారు. కానీ, జగన్ రాష్ట్రవ్యాప్తంగా కేవలం నాలుగే సిద్దం సభలు పెట్టి ముగించారు. తర్వాత బస్సు యాత్రను ఏసీ బస్సులో చేస్తున్నారు. ఆ యాత్ర కూడా తుస్సుమనేసింది. కానీ.. చంద్రబాబు సభలు, ప్రచారం అలా కాదు.. మండుటెండలో ప్రసంగిస్తున్నారు. ప్రచారం చేసేకొద్ది చంద్రబాబులో ఉత్సాహం పెరుగుతుంది తప్పా.. తగ్గటం లేదు. ఇక పవన్ అయితే పూర్తిగా వెనకబడ్డారు. ఆయన తన ప్రచారాన్ని ప్రారంభిడమే ఆలస్యంగా ప్రారంభించారు. కానీ, ఒక్కరోజు ఎండదెబ్బ తగిలేసరికి రెస్ట్ మోడ్ కి వెళ్లిపోయారు.

అయితే.. చంద్రబాబుకి, టీడీపీ కష్టాలు సంక్షోభాలు కొత్తకాదు. ఇబ్బందులు ఎదురైన ప్రతీసారి రెట్టించిన ఉత్సాహంతో రావడం చంద్రబాదుకు ఉన్న లక్షణం. 45 ఏళ్ల రాజకీయ జీవితంలో ఆయన ఎన్నో ఆటుపోట్లు.. అంతకు మించిన ఎత్తుపల్లాలు. ఏనాడు ఆయన చరిష్మా తగ్గలేదు. రాజకీయాల్లో ఆయన దిగొచ్చిన ఘటనలు చాలా అరుదు. ఎలాంటి సంక్షోభాన్నైనా తనకు అనుకూలంగా మలుచుకొని రాజకీయంగా ఎదిగిన ఘనత చంద్రబాబుది.

అందుకే టీడీపీ వ్యవస్థాపకుడైన ఎన్టీఆర్ నుంచి పార్టీని తన చేతుల్లోకి తీసుకున్నా.. చంద్రబాబు అభిప్రాయాలను పార్టీ శ్రేణులు స్వాగతించారు. ఎన్టీఆర్ నుంచి చంద్రబాబు పార్టీని తీసుకోవడంలో పెద్దడ్రామానే జరిగింది. పార్టీని హస్తగతం చేసుకునే సమయంలో ఎన్టీఆర్ పై దాడి జరిగిందనే ప్రచారం కూడా ఉంది. ఇంత డ్రామా జరిగినా.. దేవుడితో సమానమైన ఎన్టీఆర్ ను పక్కన పెట్టేసినా.. పార్టీ శ్రేణులు మాత్రం చంద్రబాబు నిర్ణయాన్ని గౌరవించారు. దానికి కారణం.. చంద్రబాబు నాయకత్వంలోనే పార్టీ బలపడిందని కార్యకర్తల బలమైన నమ్మకం. అయితే, కార్యకర్తల నమ్మకంలో అర్థం లేకపోలేదు. టీడీపీ ఎన్నో సంక్షోభాలను ఎదుర్కొంది. 2004లో ఓటమి తర్వాత టీడీపీ బతికిబట్టకడుతుందని ఎవరూ ఊహించలేదు. 2009లో పీఆర్పీ వచ్చిన తర్వాత ఆ పార్టీ టీడీపీని ఆక్రమిస్తుందని అంతా భావించారు. కానీ, 2009లో ప్రతిపక్షానికే పరిమితమైనా.. టీడీపీ గణనీయమైన సీట్లు సాధించింది. ఆ తర్వాత 2013లో రాష్ట్ర విభజన, వైసీపీ స్థాపన తర్వాత మళ్లీ టీడీపీ ప్రభ మసకబారిందనే ప్రచారం జరిగింది. కానీ, అనూహ్యంగా 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చింది.

ఏ రాష్ట్ర విభజన టీడీపీ కనుమరుగు అయ్యేలా చేస్తుందని అంతా అనుకున్నారో.. అదే రాష్ట్ర విభజనని చంద్రబాబు ప్రధాన అస్త్రంగా మార్చుకున్నారు. సంక్షోభం నుంచి అవకాశాలను సృష్టించుకోవడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విధ్య. అందుకే.. రాజధానిలేని రాష్ట్రాని అనుభవజ్ఞుడైన నాయకుడు కావాలనే ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకొని వెళ్లారు. ఆ ఒక్క మాటే టీడీపీని 2019లో అధికారంలోకి వచ్చేలా చేసింది. ఎందుకంటే.. 2014 ఎన్నికలకు ముందు టీడీపీకి గెలుపు అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఓదార్పు యాత్రతో జగన్ కు విపరీతమైన ప్రజాదరణ పెరిగింది. దీనికితోడు జగన్ ను అప్పుడే జైలు నుంచి వచ్చారు. ఆ సింపతీ కూడా జగన్ పై ఉంది. జగన్ జైల్లో ఉన్న సమయంలో షర్హిల పాదయాత్ర చేసి పార్టీని మరింత బలపరిచారు. కాంగ్రెస్‌ను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఎదురులేని శక్తిగా నిలిపిన రాజశేఖర్ రెడ్డి కుమారుడిని అదే కాంగ్రెస్ జైలులో పెట్టిందనే కోపం ప్రజల్లో ఉంది. కాబట్టి.. 2014లో జగన్ గెలుపు ఖాయమని అనుకున్నారు. కానీ, రాష్ట్ర విభజన తర్వాత అనుభవం ఉన్న నాయకుడు కావాలనే ప్రచారాన్ని ప్రజలు నమ్మేలా చంద్రబాబు చేశారు. దీంతో.. 2014లో అధికారంలోకి వచ్చారు. ఇక 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ నేతలపై దాడులు, కేసులతో పార్టీ ఉక్కిరిబిక్కిరి అయింది. కానీ.. ఎక్కడా సహనాన్ని కోల్పోకుండా పార్టీ శ్రేణుల ఆత్మస్థైర్యాన్ని కోల్పోకుండా పార్టీని నడిపించారు. చివరికి ఆయన అరెస్ట్ అయిన తర్వాత.. జైలునుంచి వచ్చిన తర్వాత రెట్టించిన ఉత్సాహంతో ఆయన పని చేస్తున్నారు. ఇన్ని చూసినవారు ఎవరైనా చంద్రబాబుకు వయసు అయిపోందని అనుకుంటారా?

Related Articles

ట్రేండింగ్

YSRCP Leaders Tension: టీడీపీ జనసేన కూటమి మేనిఫెస్టో విషయంలో వైసీపీ భయాలివేనా.. ఆ టెన్షన్ తగ్గట్లేదా?

YSRCP Leaders Tension:తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో విడుదల చేసిన తర్వాత జగన్ పార్టీలో భయం మొదలైనట్లుగా ఉంది. ఎందుకంటే వైసీపీ మేనిఫెస్టోలో ఉన్నా హామీల కన్నా కూటమి ఇచ్చిన హామీలు చాలా చాలా...
- Advertisement -
- Advertisement -