Chandrababu: రాష్ట్ర సచివాలయాన్ని తాకట్టు పెట్టడమా అభివృద్ధి.. చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు వైరల్!

Chandrababu: ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి గత నాలుగు సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అప్పులకు కూబిలోకి నెట్టేశారన్న సంగతి మనకు తెలిసిందే. ఈయన వచ్చే ఎన్నికలలో కనుక విజయం సాధిస్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మరో బీహార్ శ్రీలంకగా మార్చేస్తారంటూ ప్రతిపక్ష నేతలు ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి పై ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.

ఇకపోతే తాజాగా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ ప్రధాన జాతీయ కార్యదర్శి లోకేష్ ట్విట్టర్ వేదికగా జగన్మోహన్ రెడ్డి పాలన గురించి చేసినటువంటి పోస్ట్ వైరల్ గా మారింది. తాజాగా జగన్మోహన్ రెడ్డి అప్పు తేవడానికి ఏం తాకట్టు పెట్టాలో దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. ఈ క్రమంలోనే ఆయన ఏపీ సచివాలయాన్ని తాకట్టుపెట్టి ఏకంగా 370 కోట్ల రూపాయలను అప్పుగా తీసుకువచ్చారని తెలుస్తుంది.

ఇక ఈ విషయంపై చంద్రబాబు నాయుడు ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతుంది. రాష్ట్ర సచివాలయాన్ని తాకట్టుపెట్టి అప్పు తేవడం ఏంటి అంటూ జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించారు. 370 కోట్లకు రాష్ట్ర పాలన కేంద్రాన్ని తాకట్టు పెట్టడం ఏంటనే ప్రశ్నించారు. జగన్మోహన్ రెడ్డి తాకట్టు పెట్టింది రాష్ట్ర సచివాలయాన్ని కాదని రాష్ట్ర ప్రజల ఆత్మ గౌరవాన్ని అంటూ ఈయన ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు.

ఇక లోకేష్ కూడా ఇదే విషయంపై స్పందిస్తూ.. జగన్మోహన్ రెడ్డి గత ఐదు సంవత్సరాలుగా తెస్తున్నటువంటి అప్పులను చూసి రాష్ట్ర ఆర్థికవేత్తలు కూడా షాక్ అవుతున్నారని ఈయన తెలిపారు. ఇలా రాష్ట్రానికి పెద్ద ఎత్తున అప్పులు తీసుకువస్తూ రాష్ట్రాన్ని మరో శ్రీలంకగా మారుస్తున్నారని ఈయన తెలిపారు. ఇప్పటివరకు చేసిన అప్పులు చాలావు అన్నట్టు ఇప్పుడు సచివాలయాన్ని తాకట్టు పెట్టడం విని నేను కూడా షాక్ అయ్యాను అని తెలిపారు. ఏదైనా చిన్నమాట అంటే ఇంత ఎత్తున లేచే వైకాపా నాయకులు ఇప్పుడు ఎందుకు మౌనం వహిస్తున్నారు అంటూ ఈయన ప్రశ్నించారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం అంటే సచివాలయాలను తాకట్టు పెట్టడమా అంటూ ఈ తండ్రి కొడుకులు అధికార ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -