Chandrababu: చంద్రబాబు దూకుడు మామూలుగా లేదుగా.. రోజుకు మూడు సభలతో అలా ప్లాన్ చేశారా?

Chandrababu: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు నిన్న పలమనేరులో ప్రజా గళం పేరిట ప్రచార కార్యక్రమాలను మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంలో భాగంగా ఈయన పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలను మొదలుపెట్టడమే కాకుండా రోజుకు మూడు చోట్ల సభలను ఏర్పాటు చేసేలా ప్లాన్ చేశారు. ఇలా ఈ కార్యక్రమం ప్రారంభమైన రోజే పలమనేరుతో పాటు పుత్తూరులో కూడా సభలను నిర్వహించిన సంగతి మనకు తెలిసిందే.

ఈ కార్యక్రమం పేరిట ఈయన అధికార పక్షంపై తీవ్ర స్థాయిలో విమర్శలు కురిపించడమే కాకుండా తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే చేసే పనుల గురించి కూడా వెల్లడించారు. ఇప్పటికే సూపర్ సిక్స్ అంటూ మేనిఫెస్టోని విడుదల చేసిన సంగతి మనకు తెలిసిందే అయితే మేనిఫెస్టోలో ఉన్నవి కాకుండా కూడా ఈయన మరికొన్ని హామీలను ప్రజాగలం కార్యక్రమంలో తెలియజేస్తూ వస్తున్నారు.

బిజెపి జనసేన తెలుగుదేశం పార్టీ కూటమిగా ఏర్పడి ఎన్నికల బరిలోకి రాబోతున్నాయి ఈ క్రమంలోనే కూటమి అధికారంలోకి వస్తే కనుక ప్రతి ఒక్కరికి ₹4,000 పెన్షన్ అందజేస్తామని స్వయంగా ఇంటికి తీసుకువచ్చి పెన్షన్ డబ్బులను అందిస్తామని వెల్లడించారు అంతేకాకుండా తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి 60 రోజులలోనే మెగా డీఎస్సీ నిర్వహిస్తామంటూ చంద్రబాబు నాయుడు తెలిపారు.

ఈ విధంగా ఈయన పెద్ద ఎత్తున ప్రజాగలం పేరిట సభలను నిర్వహిస్తూ ఓటర్లను ఆకర్షిస్తున్నారు అంతేకాకుండా ఇప్పటివరకు అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.ఐదు సంవత్సరాల పాటు జగన్ రెడ్డి ప్రభుత్వం కాలయాపన చేస్తుందని అభివృద్ధి అనే పదాన్ని మర్చిపోయారు అంటూ చంద్రబాబు అధికార ప్రభుత్వంపై ఘాటు విమర్శలు చేశారు.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: చిరు జీవులకు సైతం అన్యాయం చేసిన జగన్ సర్కార్.. మరీ ఇంతలా మోసమా?

CM Jagan: జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున రాష్ట్రంలో అవినీతి అక్రమాలు జరుగుతున్నాయి. పెద్ద ఎత్తున దోపిడీలు చేస్తున్నారు వైకాపా నేతలు కొండలను గుట్టలను చెరువులను వదలలేదు పెద్ద...
- Advertisement -
- Advertisement -