YS Jagan: ఓటమి భయంతో జగన్ కొత్త ఎత్తుగడలు వేస్తున్నారా.. ఈ ప్లాన్స్ కు అడ్డుకట్ట వేసేదెవరు?

YS Jagan: ఏపీలో ఎన్నికల సమయం దగ్గర పడే కొద్ది ఎన్నికలు రసవత్తరంగా మారుతున్నాయి. సార్వ‌త్రిక ఎన్నిక‌ల వార్ వ‌న్‌సైడ్ గా మారింది. టీడీపీ, జనసేన, బీజేపీ కూట‌మికి ప్ర‌జాద‌ర‌ణ పెరుగుతోంది. ఈ క్ర‌మంలో సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి మ‌రోసారి అధికారంలోకి రావాల‌న్న ఆశ‌లు ఆవిరైపోతున్నాయి. దీంతో జ‌గ‌న్ త‌న క్రిమిన‌ల్ మైండ్ కు పని చెప్పారు. అందుకు ఉదాహరణే విజయవాడ బ‌స్సుయాత్ర స‌మ‌యంలో జ‌గ‌న్‌పై జ‌రిగిన గులక రాయి దాడి ఘ‌ట‌న. అయితే ఈ ఘటన క్రిమిన‌ల్ మైండ్‌లో భాగ‌మేన‌ని కూట‌మి పార్టీల నేత‌లు ఆరోపిస్తున్నారు. ఎన్నిక‌ల స‌మ‌యంలో సానుభూతి కోసం జ‌గ‌న్ హ‌త్యా రాజ‌కీయాల‌కు తెర‌లేపుతార‌ని విప‌క్ష పార్టీల నేత‌లు ముందు నుంచి ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు.

గ‌త ఎన్నిక‌ల స‌మ‌యంలో జ‌రిగిన ఘ‌ట‌నలు ఉదాహ‌రణ‌గా చూపుతున్నారు. ప్ర‌తిప‌క్ష పార్టీల నేత‌లు ఊహించిన‌ట్లుగానే జ‌గ‌న్‌పై రాయి దాడి జ‌ర‌గ‌డం అదంతా చంద్ర‌బాబు చేయించార‌ని వైసీపీ విస్తృత ప్ర‌చారం చేయ‌డంతో పాటు ఆ పార్టీ నేత‌లు మీడియా ముందు ఊక‌దంపుడు ఉప‌న్యాసాలు ఇవ్వ‌డం ప్లాన్ ప్ర‌కారం జ‌రిగిన‌ట్లు క‌నిపిస్తోంది. గ‌త ఎన్నిక‌ల త‌ర‌హాలో ప్ర‌జ‌ల్లో సానుభూతి కోస‌మే జ‌గ‌న్ ఈ త‌ర‌హా రాజ‌కీయాల‌కు మ‌రోసారి తెర‌లేపారని విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. గ‌త ఎన్నిక‌ల స‌మ‌యంలో ఇలాగే వ‌రుస ఘ‌ట‌న‌లు చోటు చేసుకున్నాయి. కోడిక‌త్తి దాడి, వివేకానంద రెడ్డి హ‌త్య ఘ‌ట‌న‌లు వైసీపీ కుట్ర‌లో భాగ‌మేన‌ని అప్పట్లోనే విమ‌ర్శ‌లు ఉన్నాయి.

అయితే ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే జగన్ ఓడిపోతాను అన్న భయంతో ఇలా క్రిమినల్ మైండ్ కి పని చెప్పడంతో పాటు కొత్త కొత్త ఎత్తుగడలు వేస్తున్నట్లు ఎక్కువగా వార్తలు వినిపిస్తున్నాయి. ఏపీ ప్రజలు కూడా జ‌గ‌న్ ఐదేళ్ల ప్ర‌జా వ్య‌తిరేక పాల‌న‌తో ప్ర‌జ‌లు విసిగిపోయారు. దీంతో ప్ర‌జ‌లు వైసీపీ ప్ర‌భుత్వంపై తీవ్ర వ్య‌తిరేక‌త‌ను వ్య‌క్తం చేస్తున్నారు. ఓటు ద్వారా గ‌ద్దెదింపేందుకు స‌న్న‌ద్ధంగా ఉన్నారు. దీంతో మ‌రోసారి సానుభూతి అస్త్రాన్ని ప్ర‌యోగించేందుకు జ‌గ‌న్ త‌న క్రిమిన‌ల్ మైండ్ కు ప‌నిచెప్పారని, అందులో భాగంగానే జ‌గ‌న్‌పై గులక రాయి దాడి ఘ‌ట‌న అని ఏపీ రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతుంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -