Chandrababu: చంద్రబాబు టార్గెట్ 160.. ఏపీ రాజకీయాల్లో సరికొత్త సంచలనాలు ఖాయమేనా?

Chandrababu: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తన రాజకీయ వ్యూహాలను ఒక్కొక్కటిగా అమలుపరుస్తూ వస్తున్నారు. ఇప్పటికే జనసేన పార్టీతో పాటు బిజెపి పార్టీతో పొత్తు పెట్టుకున్నటువంటి చంద్రబాబు నాయుడు ఏ పార్టీకి ఎన్ని సీట్లు కేటాయించారనే విషయాలను కూడా వెల్లడించారు. అయితే తాజాగా ఈయన బూత్ లెవెల్ లో పార్టీ నేతలు కార్యకర్తలతో టెలికాన్ఫెరెన్స్ నిర్వహించారు.

ఈ టెలికాన్ఫెరెన్స్ లో భాగంగా ఈయన కార్యకర్తలకు నేతలను ఉద్దేశిస్తూ చేసినటువంటి వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. అయితే వచ్చే ఎన్నికలలో గెలుపే లక్ష్యంగా ప్రతి ఒక్కరు ముందడుగు వేయాలని తెలిపారు. మనం జగన్మోహన్ రెడ్డిని ఓడించడమే కాకుండా మన రాష్ట్రానికి విజయం అందించాలని ఈయన అందరికీ పిలుపునిచ్చారు. ఇక వచ్చే ఎన్నికలలో గెలుపే లక్ష్యంగా ప్రతి ఒక్క కార్యకర్త ముందడుగు వేసి ప్రతి గ్రామంలోనూ మూడు జెండాలతో పర్యటన చేయాలని తెలిపారు.

ఈ కార్యకర్త ఎలాంటి గొడవలకు కారణం కాకుండా పార్టీకి ప్రాధాన్యత ఇస్తూ ఎన్నికలలో గెలుపే లక్ష్యంగా పనిచేయాలని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కాపాడటం కోసం మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం కోసం తాను బిజెపి జనసేనతో పొత్తు పెట్టుకున్నానని తెలిపారు. కేంద్రం సహాయం లేకుండా ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేయలేం అందుకే బిజెపితో పొత్తు ఖరారు చేసుకున్నామని తెలిపారు.

ఇక వచ్చే ఎన్నికలలో మన పార్టీ 160 స్థానాలలో గెలుపొంది అఖండ విజయాన్ని అందుకోవడమే కాకుండా జగన్ ను రాజకీయాలకు దూరం చేయాలని ఈయన పిలుపునిచ్చారు. ఈ విధంగా చంద్రబాబు నాయుడు వచ్చే ఎన్నికలలో 160 స్థానాలను గెలుపొందాలి అంటూ పిలుపునివ్వడంతో ఇన్ని సీట్లు గెలవడం ఖాయమైనా అంటూ పలువురు భావిస్తున్నారు. అయితే ఈయన సరికొత్త విది విధానాలను ఉపయోగించి అభ్యర్థులను ఖరారు చేశారని తప్పకుండా ఇన్ని సీట్లు గెలుపొందుతారు అంటూ మరికొందరు చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలపై ధీమా వ్యక్తం చేస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: చిరు జీవులకు సైతం అన్యాయం చేసిన జగన్ సర్కార్.. మరీ ఇంతలా మోసమా?

CM Jagan: జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున రాష్ట్రంలో అవినీతి అక్రమాలు జరుగుతున్నాయి. పెద్ద ఎత్తున దోపిడీలు చేస్తున్నారు వైకాపా నేతలు కొండలను గుట్టలను చెరువులను వదలలేదు పెద్ద...
- Advertisement -
- Advertisement -