Chandrababu: బీజేపీ డిమాండ్లకు బాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారా.. అన్ని స్థానాలలో టీడీపీ పోటీ చేస్తుందా?

Chandrababu: 2024 అసెంబ్లీ ఎన్నికలు మరికొన్ని రోజులలో జరగబోతున్నటువంటి నేపథ్యంలో పెద్ద ఎత్తున ఎన్నికల హడావిడి నెలకొంది అయితే ఇప్పటికే తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీతో పొత్తు పెట్టుకుని ఎన్నికల బరిలోకి దిగిపోతున్నారు. ఇక తెలుగుదేశం పార్టీతో బీజేపీ కూడా పొత్తు కలుపుకొని ఎన్నికలలోకి వెళ్తే తప్పకుండా మన పార్టీని గెలుస్తుందన్న ధీమాతో చంద్రబాబు నాయుడు ఉన్నారు. ఈ క్రమంలోనే బీజేపీతో పొత్తు కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఈ రెండు పార్టీల మధ్య పొత్తు దాదాపు ఖరారు అయిందని తెలుస్తోంది.

ఇలా బిజెపి పార్టీ తెలుగుదేశం జనసేనతో కలిసి ఎన్నికల బరిలోకి దిగబోతారన్న సమాచారం ముందుగానే పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు కు తెలుసు అందుకే సీట్ల సర్దుబాటు విషయంలో వీరు అన్ని ముందుగానే పక్కాగా ప్లాన్ చేశారని తెలుస్తోంది. జనసేన టిడిపి కలిసి వస్తే దాదాపు 40 సీట్ల వరకు తీసుకునే అవకాశాలు ఉన్నాయని భావించారు కానీ కేవలం 24 మాత్రమే జనసేనకు కేటాయించారు. ప్రస్తుతం బిజెపి రావడంతో బిజెపికి కూడా ఎనిమిది ఎమ్మెల్యే సీట్లను కేటాయించారని తెలుస్తోంది.

ఇలా ఈ పార్టీలు పొత్తు విషయంలో అంతర్గత నిర్ణయాలు పూర్తి అయ్యాయని త్వరలోనే ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించబోతున్నట్లు తెలుస్తుంది. ఇక బిజెపిలో పురందేశ్వరి ఉండడంతో టిడిపికి కలిసి వచ్చే సూచనలే ఎక్కువగా ఉన్నాయి. ఇక ఎనిమిది ఎమ్మెల్యే సీట్లతో పాటు ఐదు ఎంపి సీట్లను కూడా కేటాయించారని తెలుస్తోంది.

తెలుగుదేశం పార్టీతో భాజపా పొత్తు పెట్టుకోవాలి అంటే కొన్ని డిమాండ్లను పెట్టారని తెలుస్తోంది. ఆ డిమాండ్లకు బాబు ఒప్పుకోవడంతోనే పొత్తుకు గ్రీన్ సిగ్నల్స్ ఇచ్చారని తెలుస్తుంది. ఇకపోతే ఈ మూడు పార్టీలు ఏకమైతే జగన్మోహన్ రెడ్డినీ ఓడించవచ్చు చంద్రబాబు నాయుడు తనకు అనుకూలంగా ఉన్నటువంటి వారందరినీ జనసేన బిజెపి పార్టీలోకి పంపించి వారికే టికెట్లు ఇచ్చి గెలుపొందింప చేసుకొనే ఆలోచనలో ఉన్నారు. ఈయన గతంలో కూడా ఇదే పద్ధతిని అనుసరించిన సంగతి మనకు తెలిసిందే ఈసారి కూడా బాబు తన వ్యూహాలను పక్కాగా రచించబోతున్నారని తెలుస్తోంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -