Black Skin: నల్లగా ఉన్న భాగాలను తెల్లగా మార్చుకోవాలా.. ఏం చేయాలంటే?

Black Skin: ప్రస్తుతం భారీగా ఎండలు ఉన్నాయి. ఉదయం 9 గంటలకే భానుడు భగభగలాడుతున్నాడు. ఉద్యోగార్ధులు తప్పనిసరిగా ఆఫీసులకు వెళ్లాల్సిన పరిస్థితి. దీంతో చెమట చుక్కని చిందించాల్సిందే. అయితే ఈ వేడికి శరీరంలోకి కొన్ని భాగాలు నల్లగా మారుతుంటాయి. ఇది మెుగవాళ్లకన్నా, ఆడవాళ్లని బాగా వేధిస్తోంది.

 

ఎండ కారణంగా నలబడ్డ చర్మానికి తిరిగి పూర్వ స్థితిని ఇవ్వడంలో అలోవెరా జెల్ బాగా ఉపయోగపడుతుంది. కొద్దిగా అలోవెరా జెల్‌ను తీసుకుని నల్లబడ్డ ప్రదేశాలపై రాసి 20 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. అనంతరం నీటితో కడిగేయాలి. మెుత్తటి బట్టతో తుడుచుకోవాలి. రెగ్యులర్‌గా ఇలా చేస్తే మంచి ఫలితాలు వస్తాయి.

ఒక భాగం నీరు, 3 భాగాల బేకింగ్ సోడాను తీసుకుని మెత్తని దాన్ని పేస్ట్‌లా చేయాలి. మిశ్రమం స్మూత్‌గా వచ్చే వరకు పేస్ట్‌ను బాగా కలపాలి. ఎందుకంటే ఇది పూసుకున్నప్పుడు స్మూత్ గా ఉంటుంది. దీన్ని నల్లబడ్డ భాగాలపై రోజుకు రెండు సార్లు రాస్తే ఫలితం ఉంటుంది. చర్మానికి ప్రకాశాన్ని, మెరుపును కలిగించే గుణాలు నిమ్మలో అధికంగా ఉన్నాయి. కొద్దిగా నిమ్మ రసాన్ని తీసుకుని నల్లబడ్డ ప్రదేశంలో రాయాలి.

 

ఆ తర్వాత 15 నుంచి 20 నిమిషాల పాటు ఆగిన తరువాత కడిగేయాలి. ఇలా చేస్తే చర్మం సహజ సిద్ధమైన మెరుపును సంతరించుకుంటుంది. పొడిగా ఉన్న చర్మం, మృత చర్మ కణాలను తొలగించడంలో చక్కెర ఉపయోగపడితే చర్మాన్ని సంరక్షించడంలో ఆలివ్ ఆయిల్ బాగా పనిచేస్తుంది.

 

కీరదోసకాయ ముక్కలు కొన్ని, కొద్దిగా నిమ్మరసం, పసుపులను కలిపి మిక్సీలో వేసి పట్టాలి. ఈ మిశ్రమాన్ని నల్లబడ్డ భాగాల్లో ఉంచితే తగిన ఫలితం కనిపిస్తుంది. పాలు, దాని సంబంధ ఉత్పత్తుల్లో చర్మాన్ని సంరక్షించే గుణాలు అధికంగా ఉన్నాయి. కొద్దిగా పాలు, పెరుగులను తీసుకుని మిశ్రమంగా కలిపి చర్మంపై రాయాలి. ఇది పొడి చర్మం కలవారికి మేలు చేస్తుంది. చర్మానికి పోషణను అందించే గుణాలు బాదం నూనెలో ఉన్నాయి. రోజుకోసారి బాదం నూనెను కొద్దిగా తీసుకుని చర్మానికి రాస్తే తగిన ఫలితం ఉంటుంది.

Related Articles

ట్రేండింగ్

Assembly Election: ఏపీలో అక్కడ గెలిస్తే మంత్రి పదవి పక్కా.. ఈ నియోజకవర్గం ప్రత్యేకతలు ఇవే!

Assembly Elections: రాష్ట్రంలోని అతిపెద్ద నియోజకవర్గాలలో మైలవరం నియోజకవర్గం ఒకటి. ముందు ఈ నియోజకవర్గం కమ్యూనిస్టు పాలనలో ఉండేది, తర్వాత తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా మారింది. తెదేపా ఆవిర్భావం తర్వాత తొమ్మిది సార్లు...
- Advertisement -
- Advertisement -