Charan Upasana: చరణ్ ఉపాసనలకు పుట్టేది పాపేనా.. ఇదే సాక్ష్యమని చెబుతూ?

Charan Upasana: చరణ్, ఉపాసనల పెళ్లి అయిన దగ్గరనుంచి వారసుని కోసం వారి కుటుంబ సభ్యుల కంటే ఎక్కువగా ఎదురు చూస్తున్నారు మెగా అభిమానులు. ఎట్టకేలకు పెళ్లయిన పది సంవత్సరాల తర్వాత ప్రెగ్నెంట్ అయింది ఉపాసన. ఈ వార్త చిరు కుటుంబ సభ్యులకు ఎంత ఆనందాన్ని ఇచ్చిందో అంతకంటే ఎక్కువ ఆనందపడ్డారు మెగా అభిమానులు.

చిరంజీవి తన సంతోషాన్ని సోషల్ మీడియాలో పంచుకొని తెగ ఆనందపడిపోయారు. ఉపాసన కూడా సోషల్ మీడియా ద్వారా తన ఆనందాన్ని వ్యక్తపరిచింది. ఈ మధ్యనే ఉపాసనకి దుబాయ్ లో గ్రాండ్ గా సీమంతం కూడా జరిగింది. అంతర్జాతీయ వైద్యుల పర్యవేక్షణలో ఆమె డెలివరీ జరగనున్నట్లు సమాచారం.

 

ఇప్పుడు ఉపాసనకి పుట్టబోయేది పాప..బాబా? అంటూ ఉత్కంఠ చూపిస్తున్నారు మెగా అభిమానులు. పాపే అంటూ అప్పుడే సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అందుకు సాక్ష్యంగా మొన్న ఆస్కార్ అవార్డు అందుకున్నప్పుడు రామ్ చరణ్ చెప్పిన మాటలు కూడా తోడవుతున్నాయి.

 

ఆర్ఆర్ఆర్ మూవీకి ఆస్కార్ అవార్డు అందుకున్న ఆనందంలో రామ్ చరణ్ ఇచ్చిన ఇంటర్వ్యూలో సినిమాకి సంబంధించిన విషయాలతో పాటు తన వ్యక్తిగత విషయాలను కూడా పంచుకున్నాడు. మరి కొద్ది నెలల్లో తమ బేబీ తమ చేతిలోకి వస్తుందని, బేబీ చేతిలోకి రాకముందే మా జీవితాల్లో పెను మార్పులు వచ్చాయని చెప్పుకొచ్చాడు రామ్ చరణ్.

 

బేబీ అనటాన్ని బట్టి పాప అని అంచనాకి వచ్చేసారు నెటిజెన్స్. లింగ నిర్ధారణ చేయడం ఇండియాలో నిషేధం కానీ ఉపాసన కుటుంబ సభ్యులందరూ డాక్టర్లే కావడంతో వారికి ముందుగానే విషయం తెలిసిపోయి ఉండొచ్చు అని భావిస్తున్నారు మెగా అభిమానులు. చిరంజీవి ఇద్దరు కుమార్తెలకి ఇద్దరిద్దరు కుమార్తెలు ఉన్నారు. అటు ఉపాసన తల్లిదండ్రులకు కూడా ఉపాసన వాళ్లు ఇద్దరూ ఆడపిల్లలే. మెగా అభిమానుల కన్ఫ్యూజన్ తీరాలంటే ఉపాసన డెలివరీ అయ్యే వరకు వేచి చూడాల్సిందే.

 

Related Articles

ట్రేండింగ్

CM Jagan: కూటమి విజయాన్ని ఫిక్స్ చేసిన జగన్.. మేనిఫెస్టో హామీలతో బొక్కా బోర్లా పడ్డారా?

CM Jagan: త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలలో నిర్వహిస్తున్నారు. అయితే వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి వై నాట్ 175 అంటూ ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు....
- Advertisement -
- Advertisement -