Upasana-Charan: చరణ్ ఉపాసనల పాప పేరు భలే ఉందిగా.. అర్థమేంటంటే?

Upasana-Charan: టాలీవుడ్ క్యూట్ కపుల్ రామ్ చరణ్, ఉపాసన గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. టాలీవుడ్ లో ఉన్న క్యూట్ కపుల్స్ లో రామ్ చరణ్,ఉపాసన జంట కూడా ఒకటి. కాగా హీరో రామ్ చరణ్ ఒకవైపు సినిమాలలో నటిస్తూ అప్పుడప్పుడు కమర్షియల్ యాడ్స్ లో నటిస్తూ దూసుకుపోతున్నాడు. భార్య ఉపాసన ఒకవైపు మెగా కోడలిగా బాధ్యతలు చేపడుతూనే మరొకవైపు అపోలో హాస్పిటల్ ఎండిగా కూడా బాధ్యతలను నిర్వహిస్తోంది. అలాగే రామ్ చరణ్ కి సంబంధించిన వ్యాపారాలను కూడా చూసుకుంటోంది.

రామ్ చరణ్ కి మాత్రమే కాకుండా ఉపాసనకు కూడా దేశ వ్యాప్తంగా కాకుండా ఇతర ప్రపంచ దేశాలలో కూడా భారీగా అభిమానులు ఉన్నారు. ఇకపోతే చెర్రీ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న గుడ్ న్యూస్ ని ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఉపాసన ఏడు నెలల గర్భవతి. మెగా వారసుడు కోసం మెగా కుటుంబ సభ్యులతో పాటు రామ్ చరణ్ ఉపాసన అలాగే వారి అభిమానులు ఎంతో ఎదురుచూస్తున్నారు. కాగా రామ్ చరణ్ ఒకవైపు షూటింగ్ లో పాల్గొంటున్న వీలైనంత సమయాన్ని తన భార్య ఉపాసనతో గడపడానికి ప్రయత్నిస్తున్నారు.

 

ఇది ఇలా ఉంటే ఉపాసనకు పుట్టబోయే బిడ్డకు ఇప్పటికే అనేక రకాల అంచనాలు వేస్తున్నారు అభిమానులు. కొంతమంది బాబు పుడతాడని అంటే మరి కొంతమంది కచ్చితంగా అమ్మాయి పుడుతుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇది ఇలా ఉంటే తాజాగా అన్న సమాచారం ప్రకారం.. చరణ్ ఉపాసన తమకు పుట్టబోయేది కూతురేనని ఫిక్స్ అయ్యారని తెలుస్తోంది. ఆ చిన్నారికి విధాన్వి అనే పేరును కూడా ఫిక్స్ చేశారని తెలుస్తోంది. కాగా ఏ విషయాల్లో అయినా గొప్పగా, ఉన్నతంగా చేసే, ఆలోచించే అమ్మాయి అని ఈ పేరుకు అర్థం వస్తుందని తెలుస్తోంది.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: కూటమి విజయాన్ని ఫిక్స్ చేసిన జగన్.. మేనిఫెస్టో హామీలతో బొక్కా బోర్లా పడ్డారా?

CM Jagan: త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలలో నిర్వహిస్తున్నారు. అయితే వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి వై నాట్ 175 అంటూ ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు....
- Advertisement -
- Advertisement -