Pakistan: ఛీఛీ.. మృతదేహాలను కూడా విడిచిపెట్టని కామాంధులు?

Pakistan: రోజురోజుకీ కామాంధుల ఆగడాలు విరిగిపోతున్నాయి. రోడ్డుపై ఆడది కనిపించింది అంతే చాలు వారిపై అత్యాచారం వాటిని కెమెరాలు లో బంధించి ఆ వీడియోలు చూపిస్తూ అనేకసార్లు అత్యాచారాలకు పాల్పడుతున్నారు. ఇంకా కొంతమంది కామాంధులు ఆడది అయితే చాలు వయసుతో సంబంధం లేదు అన్నట్టుగా కూడా రెచ్చిపోతున్నారు. ఈ మధ్యకాలంలో చనిపోయిన మహిళ మృతదేహాలను కూడా విడిచిపెట్టడం లేదు కొందరు దుర్మార్గులు. సభ్య సమాజం తలదించుకునే విధంగా ప్రవర్తిస్తున్నారు. పాకిస్తాన్లో దారుణమైన ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. చనిపోయిన మహిళా మృతదేహాలను కూడా కొందరు కామాంధులు విడిచిపెట్టడం లేదు.

పూర్తి వివరాల్లోకి వెళితే.. పాకిస్తాన్‌లో అమ్మాయిల మృతదేహాలతో పురుషులు లైంగిక వాంఛ తీర్చుకుంటున్న కేసులు రోజు రోజుకి పెరుగుతున్నాయి. అంత్యక్రియలు పూర్తి చేసిన కూడా సమాధులను తవ్వి ఆ మృతదేహాలతో కామ వాంఛను తీర్చుకుంటున్నారు. 2011లో ఉత్తర నజీమాబాద్, కరాచీకి చెందిన మహమ్మద్ రిజ్వాన్ అనే కాటి కాపరి ఒక మృతదేహాన్ని తవ్వి, అత్యాచారం చేస్తుండగా స్థానికులకు దొరికిపోయాడు. అతడిని పట్టుకుని నిలదీస్తే 48 మంది ఆడవాళ్ల శవాలపై లైంగిక వాంఛను తీర్చుకున్నట్లు వెల్లడించాడు. దీంతో అతడిని పోలీసులు అరెస్టు చేశారు. అలాగే 2013లో 15 ఏళ్ల బాలిక మృతదేహంపై కూడా అత్యాచారం జరిగింది.

 

ఈ ఘటన తర్వాత పాకిస్తాన్ పంజాబ్ ప్రావిన్స్ అప్పటి ముఖ్యమంత్రి షాబాబ్ షరీఫ్ విచారణకు ఆదేశించారు. అయితే ఇది ఇంకా కోర్టు వ్యవహారాల్లోనే ఉంది. ఇలా ఉంటే ఇప్పటికీ ఇలాంటి ఘటనలు ఇంకా రిపీట్ అవుతూనే ఉన్నాయి. 2019లో కరాచీలోని లాంధీ టౌన్‌లో ఒక మహిళ మృతదేహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు తవ్వి, అత్యాచారం చేశారు. 2020లో పాకిస్తాన్‌లోని పంజాబ్‌లోని ఒకారా సిటీలో ఉన్న స్మశాన వాటికలో ఒక మహిళ శవాన్ని రెడ్ హ్యాండెడ్‌గా రేప్ చేస్తూ పట్టుబడిన వ్యక్తిని అరెస్టు చేశారు. 2021లో కూడా ఓ మహిళ మృతదేహాంపై అనాగరిక చర్యలు పాల్పడ్డారు. 2022లో పాకిస్తాన్‌లోని గుజరాత్ చక్ మలా గ్రామంలో కొంత మంది గుర్తు తెలియని వ్యక్తులు బాలికపై శవాన్ని తవ్వి, అత్యాచారం చేశారు. అంత్యక్రియలు పూర్తి చేసిన రాత్రే ఈ దారుణం జరిగింది. మరణించిన బాలిక బంధువులు మరుసటి రోజు ఉదయం మత సంప్రదాయాలను నిర్వహించేందుకు వెళ్లగా అక్కడ కనబడిన దృశ్యాన్ని చూసి అవాక్కయ్యారు. మృతదేహాన్ని తవ్వి, అత్యాచారానికి ఒడిగట్టి, మళ్లీ కప్పకుండా అలా వదిలేసి వెళ్లినట్లు గుర్తించారు. మరణించిన మృతదేహాలకు కూడా రక్షణ లేకుండా పోవడంతో చనిపోయిన మహిళా మృతదేహాల సమాధులకు తాళాలు వేసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది.

Related Articles

ట్రేండింగ్

KCR: ఏపీలో అధికారంపై కేసీఆర్ వ్యాఖ్యలివే.. ఆ కామెంట్లు నిజమయ్యే ఛాన్స్ లేనట్టేగా?

KCR:  మే 13వ తేదీ ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో ఏపీ ఎన్నికలపై తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే రోజే తెలంగాణలో కూడా లోక సభ...
- Advertisement -
- Advertisement -