Manchu Vishnu: నన్ను చిరంజీవి గారు హృతిక్ రోషన్ తో పోల్చారు.. మంచు విష్ణు కామెంట్లు వింటే షాకవ్వాల్సిందే!

Manchu Vishnu: టాలీవుడ్ హీరో, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు గురించి మనందరికీ తెలిసిందే. మంచు విష్ణు తక్కువ సినిమాలే అయినప్పటికీ హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఏర్పరుచుకున్నారు. మొదట రగిలే గుండెలు అనే సినిమాలో బాలనటుడిగా సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు. ఆ తరువాత ఢీ, కృష్ణార్జున, సలీం, దేనికైనా రెడీ, వస్తాడు నా రాజు, దూసుకెళ్తా, పాండవులు పాండవులు తుమ్మెద, ఈడోరకం ఆడోరకం, ఇలా ఎన్నో సినిమాలలో నటించి హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఏర్పరుచుకున్నాడు.

మంచు విష్ణు నటించిన ఢీ సినిమా ఘన విజయం సాధించింది. ఈ సినిమా తర్వాత వరుసగా పలు సినిమాలు చేస్తూ నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అలాగే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా మంచు విష్ణు గెలిచిన విషయం తెలిసిందే. మంచు విష్ణు చివరిగా జిన్నా సినిమాతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా మిక్స్డ్ టాక్ ని సొంతం చేసుకుంది. ఇది ఇలా ఉంటే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న హీరో మంచు విష్ణు ఇంటర్వ్యూలో భాగంగా చేసిన వాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ మారాయి. ఈ సందర్భంగా ఆ వీడియోలో మంచు విష్ణు మాట్లాడుతూ..

 

ఇప్పటివరకు ఇండస్ట్రీలో ఎంతోమంది ఇచ్చిన వాటిలో ది బెస్ట్ కాంప్లిమెంట్ అంటే చిరంజీవి అంకుల్ ఇచ్చిన కాంప్లిమెంట్. ఒకసారి కృష్ణంరాజు గారి 80 బర్తడే కి వెళ్తున్నప్పుడు నేను ఆయన దగ్గరికి వెళ్లి పలకరించగా నేను నిన్ను పేపర్లో చూశాను. అదేంటి బాలీవుడ్ యాక్టర్ ఫోటో పేపర్ లో ఉంది అని అనుకున్నాను అంటూ ది బెస్ట్ కాంప్లిమెంట్ ఇచ్చారు అని చాలా సంతోషంగా తెలిపారు మంచి విష్ణు. అదే విషయాన్ని చాలా సందర్భాల్లో నాకు చిరంజీవి అంకుల్ చెప్పారు అంటూ సంతోషం వ్యక్తం చేశారు. కాగా మంచు విష్ణు ఫేవరెట్ హీరో బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ అన్న విషయం మనందరికీ తెలిసిందే. అతనితో చిరంజీవి హీరో పోల్చడంతో తనకు చాలా సంతోషంగా ఉందని తన డ్రీమ్ ఫుల్ ఫీల్ అయింది అని ఆ వీడియోలో చెప్పుకొచ్చారు మంచి విష్ణు.

 

Related Articles

ట్రేండింగ్

The Land Titling Act: ఏపీ ఓటర్లకు అలర్ట్.. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి తెలుసుకుని ఓటేస్తే బెటర్!

The Land Titling Act: ఆంధ్రప్రదేశ్ లో లోక్‌సభతో పాటు అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతున్నాయి. ఢిల్లీలో ఎవరు ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ప్రజల బతుకుల్ని ప్రభావితం చేస్తుంది. గతంలో ఏ ప్రభుత్వము...
- Advertisement -
- Advertisement -