Vishnu Manchu: మంచు విష్ణు భార్య తన భర్తకు అన్ని కోట్ల రూపాయల కట్నం ఇచ్చిందా?

Vishnu Manchu: మంచు మోహ‌న్‌బాబు కుమారుడు మంచు విష్ణు. ఈయన సినిమాల ద్వారా ప్రజలకు తెలిసిన దానికంటే, మా అధ్యక్షుడి ఎన్నికల నుంచే ఎక్కువ మందికి రీచ్ అయ్యాడు. ఇప్పటికీ అది కంటిన్యూవ్ అవుతూనే ఉంది. ఇక మంచు విష్ణు భార్య వెరానికా రెడ్డి గురించి బ‌య‌ట ప్ర‌పంచానికి తెలిసింది చాలా త‌క్కువ‌. ఆమెకు రెండు వైపులా బ‌ల‌మైన కుటుంబాల అండ‌దండ‌లు ఉన్నాయి.

మెుదట సీనియర్ ఎన్టీఆర్ తో ఉన్న సంబంధాలతో మోహ‌న్‌బాబు తెలుగుదేశం నుంచి రాజ్య‌స‌భ‌కు ఎంపిక‌య్యారు. అయినప్పటికీ మాజీ సీఎం దివంగత వైఎస్‌. రాజ‌శేఖ‌ర్‌రెడ్డి కుటుంబంతో సంబంధం కలుపుకోవటమే ఓ సంచ‌ల‌నం. విష్ణు, వెరానికా పెళ్లి 2009లో జ‌రిగింది. ఈ దంప‌తులు 14 ఏళ్ల వివాహ జీవితాన్ని పూర్తి చేసుకున్నారు. ఈ క్ర‌మంలోనే విరానికా గురించి ప్ర‌పంచానికి తెలియ‌ని ఆస‌క్తిక‌ర విష‌యాలు చాలానే ఉన్నాయి.

 

విరానికా సీఎం జ‌గ‌న్‌కు చెల్లెలు. జ‌గ‌న్ చివ‌రి చిన్నాన్న రాజారెడ్డి నాలుగో కొడుకు సుధాక‌ర్‌రెడ్డి, విద్యారెడ్డి దంపుతుల కుమార్తె. చిన‌ప్ప‌టి నుంచే ఆమె ఎక్కువుగా అమెరికాలో ఉన్నారు. చిన్న‌త‌నంలో ఆమెకు డాక్ట‌ర్ కావాల‌న్న కోరిక ఉండేది. ఆ త‌ర్వాత ఆమె వ్యాపారంలోకి అడుగు పెట్టారు. ఆమె వ్యాపారంలోకి ఎంట‌ర్ అయిన‌ప్ప‌టి నుంచి నేటి వ‌ర‌కు వెన‌క్కు తిరిగి చూసుకోలేదు.

 

రాజారెడ్డి కుటుంబంలో చిన్న మ‌న‌వ‌రాలిగా వెరానికా రెడ్డి అంటే అంద‌రికి గారాబం. ఆమెకు ఆఫ్రికాలోనూ, అమెరికాలోనూ వ్యాపారాలు ఉన్నాయి. ఇటు భ‌ర్త సినిమా నిర్మాత‌గాను, అమెరికాలో వ్యాపారాల‌తో పాటు అక్క‌డ డిస్ట్రిబ్యూష‌న్ కంపెనీ కూడా ర‌న్ చేస్తున్నారు. ఇంకా చెప్పాలంటే ఆమెకు విష్ణు ప‌రిచ‌యం అయ్యాక‌, ఆమె మాట తీరు మ‌ర్యాద కంటే కూడా ఆమెలో ఉన్న బిజినెస్ ల‌క్ష‌ణాల‌కు విష్ణు ముగ్ధుడు అయిపోయి ప్రేమ‌లో ప‌డిపోయాడ‌ట‌.

 

ఇంకా చెప్పలంటే విష్ణు కన్నా వెరానికా రెడ్డికే ఎక్కువ ఆస్తులు ఉన్నాయి. విష్ణు కేవలం సినిమాలు, తల్లిదండ్రుల నుంచి వచ్చిన ఆస్తులనే చూపించవచ్చు. ఆమె మాత్రం తల్లిదండ్రుల నుంచి వచ్చిన ఆస్తి, డబ్బు కన్నా, విద్యాభ్యాసం నుంచే బిజినెస్ ప్రారంభించి సంపాదించిన ఆస్తులే వేల కోట్లు ఉన్నాయని టాక్. కట్నం రూపేణా విష్ణు గట్టిగానే నొక్కినట్లు తెలిసింది. మంచు అంటే ఆ మాత్రం అంటుంది మరీ అంటున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -