Chiranjeevi-Roja: చిరంజీవి రోజాకు భలే కౌంటర్ ఇచ్చారుగా!

Chiranjeevi-Roja: తనపై వచ్చే కామెంట్లకు సున్నితంగా, వ్యంగ్యంగా, బలంగా రిప్లై ఇస్తాడు మెగాస్టార్ చిరంజీవి. ఆ మాటకొస్తే.. తనను విమర్శించిన ఎవ్వరినీ వదలదు చిరు. రాజకీయంగానూ, సినీ రంగ విషయాల్లో ఇలా ఘాటుగా స్పందించడం చిరంజీవి స్టైల్. అయితే ఇటీవల తమ్ముడు పవన్ రాజకీయాల్లో చురుగ్గా ఉంటూ ఉండడంతో ఆ ఎఫెక్ట్ చిరుపై కూడా పడుతోంది. అలా పవన్, జనసేన విషయాల్లో చిరంజీవిని ఇన్వాల్వ్ చేస్తూ.. రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు జనాలు. ఇలానే ఏ మధ్య ఏపీ మంత్రి రోజా చిరంజీవిపై కామెంట్స్ చేసింది.

 

ఇటీవల రోజా మాట్లాడుతూ.. చిరంజీవిపై ఘాటు విమర్శలు చేసింది. “సాధార‌ణంగా న‌టీన‌టులకు సెన్సిటివ్, ఎమోషనల్‌గా ఉంటారు. ఎమ్జీఆర్, జ‌య‌ల‌లిత‌, ఎన్టీఆర్ వంటి దిగ్గ‌జాలు ప్ర‌జ‌ల నుండి చాలా గౌరవం పొందారు. కానీ చిరు, ప‌వ‌న్, నాగ‌బాబుల‌కు ఎలాంటి ఎమోష‌న్స్ లేవు అందుకే ముగ్గురు అన్న‌ద‌మ్ముల‌ను సొంత నియోజ‌క‌వ‌ర్గాల్లోనే ప్ర‌జ‌లు తిర‌స్క‌రించారన్నారు.” ఇలా రోజా చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. దీనిపై గట్టిగానే కౌంటర్ ఇచ్చాయి మెగా వర్గాలు.

 

చిరు ఘాటు స్పందన.
మంత్రి రోజా చేసిన ఈ వ్యాఖ్యలపై నాగాబాబు ఇప్పటికే కౌంటర్ ఇవ్వగా.. త‌న‌దైన శైలిలో మంత్రి రోజా పేరు ఎత్త‌కుండా గ‌ట్టి కౌంట‌ర్ ఇచ్చిపడేసాడు మెగాస్టార్ చిరంజీవి. “నాతో స్నేహంగా ఉండి, నా స‌హాయం తీసుకోని, సహాయం కోసం నా ఇంటికి వ‌చ్చినా వారు కూడా నేను ఎటువంటి స‌హాయం చేయలేదంటున్నారు. నేను ఎవ‌రికి స‌హాయం చేశానో నాకు తెలుసు.. నా స‌హాయం తీసుకున్నవారికి తెలుసు. నా గురించి తెలిసి మాట్లాడారో లేక తెలియ‌క మాట్లాడారో తెలియదుకాని.. అలాంటి వారిని కేర్ చేయనని వారిని పటించుకోనన్నారు. నా పేరు వాడ‌క‌పోతే వారికి మ‌నుగ‌డ ఉండ‌ద‌నే నా గురించి మాట్లాడుతున్నారు” అంటూ గరం గరం కౌంటర్ ఇచ్చాడు చిరు.

 

తాను ఒకప్పటి చిరంజీవి కాదని అన్నారు. అప్పట్లో తన గురించి, తన కుటుంబం గురించి మాట్లాడితే బాధగా ఉండేదని.. కానీ ఇప్పుడు వారిని పట్టించుకోవడం మానేసానని అన్నారు. తమ్ముళ్ల తమ్ముళ్ళదేనని.. తన దారి తనదని అన్నారు మెగాస్టార్. అల్లు అరవింద్ కుటుంబంతో గొడవలంటూ వస్తున్న వార్తలపై స్పందిస్తూ.. ఎవరి దారి వారి చూసుకోవడంలో తప్పులేదని, వారి ఫ్యామిలీతో ఎలాంటి గొడవ లేదని అన్నారు చిరంజీవి.

Related Articles

ట్రేండింగ్

Chittoor: పెద్దిరెడ్డి ఇలాకాలో వైసీపీ అరాచకం.. ప్రచారానికి వస్తే చంపే సంస్కృతి ఉందా?

Chittoor: మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇలాక పుంగనూరులో వైసీపీ అరాచకం తారాస్థాయికి చేరింది. భారత చైతన్య యువజన (బీసీవై )పార్టీ ప్రచార కార్యక్రమాన్ని వైసీపీ శ్రేణులు . అడ్డుకున్నారు. పుంగనూరు మండలం మాగాండ్ల...
- Advertisement -
- Advertisement -