Chiranjeevi: ఆ విషయంలో చిరంజీవి రారాజు.. మరో హీరోకు సాధ్యం కాదుగా?

Chiranjeevi: టాలీవుడ్ సినీ పరిశ్రమకు గాడ్ ఫాదర్‌గా కొనసాగుతున్నారు మెగాస్టార్ చిరంజీవి. ఇండస్ట్రీలో ఎన్నో ఏళ్లుగా కొనసాగుతున్న చిరంజీవి.. ఇప్పటివరకు 150కిపైగా సినిమాలు నటించారు. 1978లో వచ్చిన ‘పునాది రాళ్లు’ అనే సినిమాతో చిరంజీవి తన నటజీవితం ప్రారంభించాడు. కానీ అంతకుముందే ‘ప్రాణం ఖరీదు’ సినిమా విడుదలైంది. 1987లో నటించిన ‘స్వయంకృషి’ సినిమా వల్ల నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ సినిమా రష్యన్ భాషలో కూడా అనువాదమై.. మాస్కో అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో ప్రదర్శింపబడింది. ‘పసివాడి ప్రాణం (1987), యముడికి మొగుడు (1988), మంచి దొంగ (1988)’ సినిమాలు బాక్సాఫీస్ వద్ద రికార్డులు బద్ధలు కొట్టాయి. ‘పసివాడి ప్రాణం’ సినిమా ద్వారా టాలీవుడ్‌కు మొదటిసారిగా బ్రేక్ డ్యాన్స్ పరిచయం చేశాడు.

 

 

కే.రాఘవేంద్రరావు దర్శకత్వంలో ‘జగదేకవీరుడు అతిలోకసుందరి’ అనే ప్రయోగాత్మక సోషియే ఫాంటసీ చిత్రంలో నటించారు. అదే ఏడాది విడుదలైన ‘కొండవీటి దొంగ’ 70ఎంఎం, 6 ట్రాక్ స్టీరియోఫోనిక్ సౌండ్‌లో విడుదలైన మొట్టమొదటి తెలుగు చిత్రం ఇది. ‘కొదమ సింహం, గ్యాంగ్ లీడర్’ వంటి సినిమాలతో చిత్ర పరిశ్రమలో సుస్థిరమైన స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. ‘మెకానిక్ అల్లుడు, బిగ్ బాస్, రిక్షావోడు, ముఠామేస్త్రి, ముగ్గురు మొనగాళ్లు, అల్లుడా మజాకా, హిట్లర్, మాస్టర్, చూడాలని ఉంది. స్నేహం కోసం, అన్నయ్య, మాస్టర్, ఇంద్ర, ఠాగూర్, శంకర్ దాదా ఎంబీబీఎస్, స్టాలిన్’ వంటి సినిమాల్లో నటించాడు. ఇప్పటికీ ఇండస్ట్రీలో హీరోగా కొనసాగుతున్నాడు. ‘పద్మభూషణ్, డాక్టరేట్’ వంటి పురస్కారాలు పొందాడు. ఇండస్ట్రీలో ఎన్నో ఏళ్లుగా హీరోగా కెరీర్ కొనసాగించడంతోపాటు కలెక్షన్ల రివార్డులు, అవార్డుల్లో చిరంజీవికి మించిన వాళ్లు లేరు. అలాగే టాలీవుడ్‌లో భారీ సంఖ్యలో అభిమానులు ఉన్న హీరోగా గుర్తింపు పొందాడు. ప్రస్తుతం ఈ జనరేషన్ మరే హీరోకు లేని క్రేజ్.. చిరంజీవికి మాత్రమే సొంతం. కాగా, ఇటీవల చిరంజీవికి ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ-2022 అరుదైన పురస్కారం లభించింది. ఈ క్రమంలో ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ అభినందనలు తెలియజేశారు.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: అవినాష్ రెడ్డి ఏ తప్పు చేయలేదా.. అలా అయితే హత్య చేసిందెవరో చెప్పు జగన్?

CM Jagan:  ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఇటీవల పులివెందులలో నిర్వహించినటువంటి సభలో వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసు గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. చిన్నాన్న వివేకం బాబాయ్ కి...
- Advertisement -
- Advertisement -