Chiyaan Vikram: ఘటనపై స్పందించి చింతిస్తున్నానంటూ స్పందించిన విక్రమ్!

Chiyaan Vikram: చియాన్ విక్రమ్ పరిచయం అవసరం లేని పేరు. తమిళ తెలుగు భాషలలో ఎన్నో విభిన్నమైన సినిమాలను చేస్తూ విపరీతమైన ఆదరణ సంపాదించుకున్నారు. ఇలాంటి విభిన్న సినిమాలలో నటించడానికి ఆయనకు ఆయనే సాటి అని చెప్పాలి. ఇలా ఎన్నో విభిన్న కథ చిత్రాలతో నిత్యం ప్రేక్షకులను సందడి చేస్తున్న విక్రమ్ తాజాగా అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వంలో కోబ్రా అనే సినిమాలో నటించారు. ఈ సినిమా ఆగస్టు 31వ తేదీ విడుదలకు సిద్ధమవుతోంది. ఇకపోతే ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడటంతో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

ఈ ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా డైరెక్టర్ తో పాటు హీరో హీరోయిన్ ఇద్దరు కలిసి తిరుచ్చి వెళ్లగా అక్కడకు అభిమానులు పెద్ద ఎత్తున చేరుకోవడంతో అభిమానులపై పోలీసులు దాడి చేసిన విషయం మనకు తెలిసిందే. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది.అభిమానులను కంట్రోల్ చేయలేక ఒక పోలీస్ ఆఫీసర్ ఏకంగా కాలితో అభిమానులను తంతు వారిపై దాడి చేశారు.

ఈ విధంగా పోలీసులు అభిమానుల పట్ల ప్రవర్తించిన తీరుపై అందరూ అసహనం వ్యక్తం చేయగా ఈ విషయం నటుడు విక్రమ్ దృష్టికి వెళ్ళింది. ఈ క్రమంలోనే ఈ విషయంపై స్పందించిన విక్రమ్ ఈ ఘటనపై విచారం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఈయన ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేస్తూ జరిగిన విషయం నా దృష్టికి వచ్చింది. ఇలాంటి ఘటన జరిగినందుకు ఎంతో చింతిస్తున్నాను అంటూ ట్వీట్ చేశారు.

ఇకపోతే ఈ ఘటనలో భాగంగా పోలీసులతో దాడికి గురైన ఆ వ్యక్తిని కలవాలని కోరుకుంటున్నాను అంటూ ఈ సందర్భంగా ఈయన చేసిన ఈ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.ఈ విధంగా తన అభిమానికి జరిగిన అవమానం పట్ల నటుడు స్పందించిన తీరుపై అందరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే అభిమానులపై దురుసుగా ప్రవర్తించినందుకు పోలీసుల పై చర్యలు తీసుకోవాలని అభిమానులు పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -