Nara Lokesh: లోకేశ్‌ రాకపోతే రప్పిస్తాం.. లోపల వేస్తాం.. సీఐడీ ప్లానింగ్ లెక్కలు తెలిస్తే షాకవ్వాల్సిందే!

Nara Lokesh: ఏపీ మాజీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేసి ఎన్నింటికి 22 రోజులు పూర్తి అయింది. ఇక ఈ 22 రోజులపాటు టీడీపీ నేతలు బాబు బెయిల్ కోసం చేసిన ఏ ప్రయత్నం కూడా ఫలించడం లేదు. ఒకవేళ ఫలించినా ఆయనను మళ్ళీ లోపలకి పంపేందుకు ఏపీ సీఐడీ వరుసపెట్టి కేసులు వేస్తూనే ఉంది. చంద్రబాబుని ఇన్నిరోజులుగా జైల్లో ఉంచినా టీడీపీ ఏమీ చేయలేకపోవడం, కేంద్ర ప్రభుత్వం స్పందించకపోవడంతో వైసీపి ప్రభుత్వానికి మరింత ఉత్సాహం వచ్చిన్నట్లుంది. దీంతో టీడీపీ పార్టీని చూసి వైసిపి చంకలు గుద్దుకుంటోంది.

అయితే ఇప్పుడు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ను అరెస్ట్ చేసి జైలుకి పంపించేందుకు రంగం సిద్దం చేస్తోంది. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో నారా లోకేశ్‌కు ఏపీ సీఐడీ నోటీస్ ఇచ్చారు. నారా లోకేశ్‌ ఢిల్లీ నుంచి విజయవాడకు వస్తే అరెస్ట్ చేద్దామని ఇంతకాలం ఎదురుచూసిన ఏపీ సీఐడీ పోలీసులు, ఆయన ఎంతకూ రాకపోవడంతో శనివారం ముగ్గురు అధికారులు ఢిల్లీ చేరుకొని టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ ఇంట్లో ఉంటున్న నారా లోకేశ్‌కు స్వయంగా నోటీసులు అందించారు. అంతకు ముందు వాట్సప్ ద్వారా కూడా ఆయనకు నోటీస్ పంపించారు. సెక్షన్ 41ఏ ప్రకారం ఇచ్చిన ఆ నోటీసులో అక్టోబర్ 4వ తేదీ ఉదయం 10 గంటలకు తాడేపల్లిలోని సమృద్ధి నెక్సా అపార్ట్‌మెంట్‌లో గల తమ కార్యాలయంలో విచారణకు హాజరు కావలసిందిగా ఆదేశించారు.

ఏపీ సీఐడీ పోలీసులు తనను అరెస్ట్ చేసేందుకు సిద్దంగా ఉన్నారని నారా లోకేశ్‌ గ్రహించడంతో ఏపీ హైకోర్టులో ముందస్తు బెయిల్ కోరుతూ ఒక పిటిషన్ వేశారు. కానీ హైకోర్టు తిరస్కరించింది. అయితే అక్టోబర్ 4వరకు నారా లోకేశ్‌ని అరెస్ట్ చేయవద్దని సూచించింది. కానీ అంతవరకు కూడా ఆగలేన్నట్లు ఏపీ సీఐడీ అధికారులు ఢిల్లీకి వెళ్ళి నారా లోకేశ్‌కు నోటీస్ అందించడం గమనిస్తే వైసీపి ప్రభుత్వం ఆయనను కూడా అరెస్ట్ చేసి జైలుకి పంపేందుకు ఎంత ఆతృతగా ఉందో అర్దం చేసుకోవచ్చు.

బాబుతో పాటు లోకేష్ ని కూడా జైల్లో ఊచలు లెక్క పెట్టించేలా చేయాలని విశ్వ ప్రయత్నాలు చేస్తోంది వైసీపీ. చంద్రబాబు నాయుడు అరెస్టుపై మోడీ, అమిత్ షాలు స్పందించకపోయి ఉండవచ్చు. కానీ దేశంలో పలువురు ప్రముఖ నేతలు, వివిద రంగాలకు చెందినవారు ఖండిస్తునే ఉన్నారు. అయినా వైసీపి ప్రభుత్వం ఏమాత్రం తగ్గడం లేదు. టీడీపీ ముఖ్య నేతలందరిపై కేసులు నమోదు చేసి జైలుకి పంపించేసి, ఎన్నికల సమయానికి టీడీపీ ను పూర్తిగా బలహీనపరచాలని భావిస్తున్నట్లుంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -