Bhuvaneshwari-Brahmani: భువనేశ్వరి, బ్రాహ్మణి విషయంలో సీఐడీ స్కెచ్ ఇదేనా.. వాళ్లకు ఇబ్బందులు తప్పవా?

Bhuvaneshwari-Brahmani: రాష్ట్రాన్ని అభివృద్ధి చేయమని ప్రజలు పీఠాన్ని ఎక్కిస్తే, ఆ పదవిని కక్షలు, కార్పణ్యాలు తీర్చుకోవటానికి వాడుకుంటున్నారు నేటి మంత్రులు. ఇప్పుడు సీఎం జగన్ కూడా అదే చేస్తున్నాడు. తనను అన్యాయంగా కేసులో ఇరికించి పైశాచిక ఆనందం పొందిన ప్రతి ఒక్కరి అంతు చూడడమే లక్ష్యంగా పావులు కదుపుతున్నాడు. అయితే ఇప్పటికే తనని జైల్లో పెట్టడానికి ముఖ్య కారణం చంద్రబాబు అని భావించిన జగన్ చంద్రబాబుని జైల్లో పెట్టినప్పటికి తృప్తి పడినట్లు కనిపించడం లేదు.

ఆయన కుటుంబం మొత్తాన్ని జైలుకు పంపించే పనిలో పడ్డాడు జగన్. ఇప్పటికే మూడు వారాలకు పైగా జైల్లో ఉన్నారు చంద్రబాబు. రేపు లొకేష్ ని సైతం అరెస్టు చేస్తామని సంకేతాలు ఇస్తున్నారు. అయితే ఈ మాత్రానికే గగ్గోలు పెట్టేస్తున్నారు తెలుగుదేశం వర్గం వారు, ఎల్లో మీడియా. వాళ్లకి మరింత షాక్ ఇచ్చే న్యూస్ ఒకటి బయటకి వచ్చింది. అదేమిటంటే జగన్ నారా భువనేశ్వరి,నారా బ్రాహ్మణిలను సైతం విడిచిపెట్టే ఉద్దేశంలో లేనట్లు కనిపిస్తుంది.

వాళ్లపై కూడా కేసు నమోదు చేసేందుకు సిఐడి పకడ్బందీగా వ్యూహం రూపొందించినట్లు తెలుస్తోంది. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు వ్యవహారంలో ఈ ఇద్దరిపై ఉచ్చు బిగిస్తున్నట్లు తెలుస్తుంది. ఈ కేసులో నారా లోకేష్ 14 వ ముద్దాయిగా చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇన్నర్ రింగ్ రోడ్డు ఏర్పాట్లు హెరిటేజ్ సంస్థకు భారీగా లబ్ధి చేకూర్చినట్లు వైసీపీ నేతలు ఆరోపిస్తూ వస్తున్నారు. అందుకు తగినట్లుగానే ఈ కేసులో హెరిటేజ్ ఫుడ్ సంస్థను చేర్చడం వెనక భారీ వ్యూహం ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. హెరిటేజ్ ఫుడ్ సంస్థలో బ్రాహ్మణి, భువనేశ్వరి మేనేజ్మెంట్ హోదాలో ఉన్న విషయం అందరికీ తెలిసిందే.

అంటే దీని అర్థం బ్రాహ్మణి, భువనేశ్వరిలని అవినీతిలో భాగస్వామ్యం చేసేందుకే ట్రాక్ నడుస్తుందని, తనని ఇబ్బందులు పెట్టిన ఏ ఒక్కరిని జగన్ విడిచిపెట్టేటట్లుగా కనిపించడం లేదు. పొద్దున్న లెగిస్తే తనపై తప్పుడు ప్రచారాలు చేస్తున్న రామోజీరావుని ఎప్పుడో మంచం ఎక్కించేశాడు జగన్. ఇప్పుడు చంద్రబాబు కుటుంబం మొత్తాన్ని జైల్లో వేయించేలాగా ఉన్నాడు, ఏం జరుగుతుందో చూడాలి మరి.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: చిరు జీవులకు సైతం అన్యాయం చేసిన జగన్ సర్కార్.. మరీ ఇంతలా మోసమా?

CM Jagan: జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున రాష్ట్రంలో అవినీతి అక్రమాలు జరుగుతున్నాయి. పెద్ద ఎత్తున దోపిడీలు చేస్తున్నారు వైకాపా నేతలు కొండలను గుట్టలను చెరువులను వదలలేదు పెద్ద...
- Advertisement -
- Advertisement -