Call Data Petition: కాల్ డేటా పిటిషన్ పై కంగారులో జగన్ సర్కార్.. తప్పు చేయడం వల్లే భయపడుతుందా?

Call Data Petition: ఏపీ మాజీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వ్యవహారం ఇప్పట్లో ఒక కొలిక్కి వచ్చేలా కనిపించడం లేదు. ఆయన బయటికి రావాలి అనుకున్న ప్రతిసారి ఏదో ఒక విధంగా ఆయనకు అడ్డంకులు ఏర్పడుతూనే ఉన్నాయి. అంతే కాకుండా టీడీపీ నేతలు చంద్రబాబును బయటికి తీసుకురావడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా ఒక్కటంటే ఒక్కటి కూడా ఫలించడం లేదు. ఇది ఇలా ఉంటే చంద్రబాబును అరెస్టు చేసినప్పుడు ఈ అరెస్టు ప్రక్రియలో పాలు పంచుకున్న రెండు వందల మంది పోలీసులు, సీఐడీ అధికారుల కాల్ డేటాను కోర్టుకు సమర్పించాలన్న చంద్రబాబు తరపు లాయర్ల పిటిషన్ పై విచారణ అదే పనిగా సాగుతోంది.

కాగా ఆ పిటిషన్ దాఖలు చేసి నెలన్నర అవుతోంది. వాయిదాల మీద వాయిదాలు వేస్తూనే ఉన్నారు. ప్రభుత్వం తరపు లాయర్లు అడుగుతున్నారు. ఓ సారి అఫిడవిట్ వేస్తామంటారు. మరోసారి కాల్ డేటా భద్రపరిస్తే సీఐడీ పోలీసుల ఆత్మస్థైర్యం దెబ్బతింటుందంటారు. ఈ విధంగా రకరకాల వాదనలు వినిపిస్తున్నారు. చంద్రబాబు అరెస్టు వెనుక రాజకీయ కుట్ర ఉందని టీడీపీ నేతల నమ్మకం. రాజకీయ నేతలతో కొన్ని వ్యవస్థల కీలక అధికారులు కుమ్మక్కు అయిపోయి ఈ నాటకం నడిపించారని భావిస్తున్నారు. ఈ క్రమంలో వారి మధ్య జరిగిన సంభాషణలు , కమ్యూనికేషన్ పై టీడీపీ నేతలకూ ఓ అవగాహన ఉంది.

అయితే వాటికి సర్టిఫికేషన్ ఉండాలన్నా, చట్టబద్ధత ఉండాలన్నా ఆ రికార్డులు కోర్టు దగ్గర ఉండాలి.అందుకే కాల్ రికార్డుల కోసం కోర్టులో పిటిషన్ వేశారు. తాము ఏదో తప్పు చేశామని సీఐడీ వాళ్లు కూడా కంగారు పడుతున్నట్లుగా ఉంది. కాల్ డేటాను భద్రపర్చడంపై భిన్నమైన వాదనలు వినిపిస్తున్నాయి. ఈ లోపు సర్వీస్ ప్రొవైడర్ కంపెనీల నుంచి ఏమైనా మ్యానిపులేట్ చేసి..తీసేయాల్సినవి తీసేయించి తర్వాత మాకేం అభ్యంతరం లేదని చెబుతారేమో కాని, వారు పడుతున్న కంగారు చూస్తే ఏదో చేశారని అందరూ అనుకునేలా ఉంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -