Bhuvaneshwari-Vijayamma: ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా భువనేశ్వరి చేసిన పనులివే.. ఆ విషయంలో ఈమెను అభినందించాల్సిందే!

Bhuvaneshwari-Vijayamma:  నారా భువనేశ్వరి.. ఈమె గురించి చెప్పుకోవాలంటే ఒక రాజకీయ నాయకుడి కూతురు, మరొక రాజకీయ నాయకుడి భార్య. అయినప్పటికీ ఆమె ఏనాడూ రాజకీయాల జోలికి పోలేదు. అయితే ఇప్పుడు తప్పనిసరిగా రాజకీయాలలో అడుగు పెట్టవలసిన అవసరం ఏర్పడింది. భర్తని అన్యాయంగా జైల్లో పెడితే న్యాయం కావాలి అంటూ ప్రజాక్షేత్రంలో అడుగుపెట్టింది. అయితే అలా చేయటాన్ని తప్పుపడుతూ వైసీపీ వారు విమర్శలు గుప్పిస్తున్నారు. ఆమె చెప్పేదంతా సొంత డబ్బా అంటూ ఎద్దేవా చేస్తున్నారు. అయితే ఒకప్పుడు జగన్ తల్లి విజయమ్మ చేసింది ఏమిటి అంటూ టీడీపీ నేతలు సైతం ఎదురు తిరుగుతున్నారు.

జనంలోకి వచ్చిన భువనేశ్వరి ఎప్పుడూ తన భర్తకి ఓటు వేయమని గాని, కొడుకు ఓటు వేయమని గాని అడగలేదు. కానీ విజయమ్మ ప్రజాక్షేత్రంలో అడుగుపెట్టిన దగ్గర నుంచి అయితే కొడుక్కి లేదంటే తనకి ఇప్పుడు తన కూతురికి ఓటేయమంటూ అడుగుతున్నారు కానీ ఏనాడు ఆవిడ ప్రజల గురించి ఆలోచించింది లేదు. భువనేశ్వరి కొన్ని సంవత్సరాల క్రితమే ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ఏర్పాటు చేసి సేవలు అందిస్తున్నారు. రక్త నిధి కేంద్రాల ద్వారా ఇప్పటి వరకు 83,582 యూనిట్ల రక్తాన్ని సేకరించి అందులో 20,045 యూనిట్ల రక్తాన్ని తల సేమియా వ్యాధి బాధితులకు అందించారు.

55,048 యూనిట్ల రక్తాన్ని ప్రభుత్వ ఆసుపత్రులకు అత్యవసర సేవల నిమిత్తం అందిస్తున్నారు. ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ద్వారా ప్రకృతి విపత్తులు సంభవించిన సమయాల్లో ఇప్పటి వరకు 20 లక్షల మందికి సాయం అందించారు. 2014లో హుదూద్ తుఫాన్ వచ్చినప్పుడు 50,000 మంది బాధితులకు మందులు, ఆహారము, మజ్జిగ, పాలు అందించారు. 2016లో హైదరాబాదులో వరదలు వచ్చినప్పుడు పది బస్తీలలోని 5000 మంది పేదలకు సాయం అందించారు

కరోనా సమయంలో 1500 మంది కరోనా రోగులకు ఉచితంగా వైద్యం అందించారు. రెండు లక్షల మాస్కులు అందించారు, 29 లక్షల విలువైన మందులు పంపిణీ చేశారు.1.35 కోట్లతో ఏపీ తెలంగాణలో మూడు ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్లను ఏర్పాటు చేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా సేవలు చేశారు. అలాంటిది ఈమెని విజయమ్మతో పోలుస్తారా అంటూ మండిపడుతున్నారు తెదేపా వర్గం వారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -