SP Malika Garg: వైసీపీ ఎమ్మెల్యేలకు చెమటలు పట్టించిన ఎస్పీ.. వణికిపోయిన నేతలు అలా చేశారా?

SP Malika Garg: రాజకీయాలతో సంబంధం లేకుండా ప్రజా సమస్యలను దృష్టిలో పెట్టుకుని సమర్థవంతంగా పనిచేసే అధికారులు అంటే వైసీపీకి ఏమాత్రం పడదు అని చెప్పాలి ఎంతసేపు ఉన్న తమ పార్టీని భుజాలపై వేసుకొని తమ పార్టీ నేతలకు గొడ్డు చాకిరి చేస్తూ ప్రతిపక్షాలను వేధించే ప్రభుత్వ అధికారులు అంటేనే అధికార పక్షానికి నచ్చుతుందని తెలుస్తోంది.

ఈ విధంగా తమ పార్టీని లెక్కచేయకుండా ప్రజా సమస్యలను పట్టించుకోని ప్రజాస్వామ్యాన్ని దారిలో పెట్టే అధికారులను జగన్మోహన్ రెడ్డి కనురెప్ప పార్టీలో బదిలీలు చేయిస్తూ వారిని ఎక్కడెక్కడో విధులకు బదిలీ చేస్తూ ఉంటారు. తాజాగా ఇలాంటి బదిలీ వేటకు గురి అయ్యారు తిరుపతి ఎస్పీ మల్లికా గర్గ్‌. ఈమె తిరుపతి ఎస్పీగా విధులలోకి జాయిన్ అయినటువంటి 20 రోజులకే తిరిగి బదిలీ కావటం గమనార్హం.

తిరుపతి ఎస్పీగా విధులు చేపట్టినటువంటి మల్లికా వచ్చి రావడంతోనే స్థానిక ఎమ్మెల్యేలకు చుక్కలు చూపించారు. దీంతో ఆ ఎమ్మెల్యేలు తమ గోడును తాడేపల్లి ప్యాలెస్ లో బయటపెట్టారు. అక్కడ మల్లికా ఎస్పీగా విధులు నిర్వహిస్తే వచ్చే ఎన్నికలలో మనకు ఏమాత్రం ప్రయోజనకరంగా ఉండదని తను అక్కడే ఉంటే గెలుపు కూడా కష్టమే అంటూ తమ బాధను మొత్తం తాడేపల్లి ప్యాలెస్ లో బయట పెట్టడంతో వెంటనే జగన్మోహన్ రెడ్డి చర్యలు తీసుకొని ఆమెపై బదిలీ వేటు వేశారు.

తిరుమల శ్రీవారి సేవలో ఉండే ఇద్దరు వైసీపీ కీలక ఎమ్మెల్యేలు ఎస్పీతో మాట్లాడే ప్రయత్నం చేశారు. మా డ్యూటీ మమ్మల్ని చెయ్యనివ్వండి.. ఇప్పటికే తిరుపతి భ్రష్టు పట్టింది. సరి చేయనివ్వండి అని ఆమె సమాధానం చెప్పడంతో తన వల్ల మన పార్టీకి ఏ విధమైనటువంటి ప్రయోజనం లేదని గుర్తించినటువంటి ఎమ్మెల్యేలు ఈ విషయాన్ని హై కమాండ్ కు తెలియజేయడంతో ఆమెను బదిలీ చేయాలన్న నేతల అభ్యర్థనలతో సీఐడీకి బదిలీ చేస్తూ జగన్‌ ప్రభుత్వం ఆదివారం ఆదేశాలు జారీ చేశారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -