CID Abijeeth: సీఐడీ సీరియల్ అభిజిత్ గుర్తున్నారా.. ఆయన ఇప్పుడు ఎలా ఉన్నారంటే?

CID Abijeeth: సిఐడి సీరియల్ చూసిన వాళ్ళు ఎవరు ఇన్స్పెక్టర్ అభిజిత్ ని మర్చిపోలేరు. ఈ సీరియల్ లో ప్రతి పాత్ర ప్రేక్షకులకు కనెక్ట్ అయింది. ఇందులో ఇన్స్పెక్టర్ అభిజిత్ క్యారెక్టర్ అయితే హీరో రేంజ్ కట్ అవుట్. తన నటనతో ప్రేక్షకుల హృదయాలని గెలుచుకున్నాడు. అయితే సీరియల్ ముగిసిన తర్వాత అభిజిత్ ఎక్కడా కనిపించలేదు. చాలా రోజుల తర్వాత భక్షక్ సినిమాలో కీలకపాత్రలో కనిపించాడు.

 

ఈ సినిమాలో నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ లో నటించాడు అభిజిత్. అభిజిత్ అసలు పేరు ఆదిత్య శ్రీవత్సవ. అతను బాండిట్ రాజా, గులాల్ వంటి అనేక అవార్డులు అందుకున్నాడు. ప్రస్తుతం బాలీవుడ్ బ్యూటీ భూమి ఫడ్నేకర్ దర్శకత్వం వహించిన భక్షక్ చిత్రంలో నెగిటివ్ రోల్ లో కనిపించనున్నాడు. తాజాగా విడుదలైన ట్రైలర్లో అభిజిత్ కనిపించాడు.

ఈ ఈవెంట్లో అభిజిత్ మాట్లాడుతూ రెడ్ చిల్లీస్ అధినేత గౌరవ్ తనను ఈ మూవీ లో నటించాలని కోరినట్లు తెలిపారు. 20 ఏళ్లుగా సిఐడిలో ఉన్న తనని అందరూ చూశారు. బ్లాక్ ఫ్రైడే, గులాల్ వంటి చిత్రాలలో అద్భుతంగా నటించాడు. చాలా కాలం పాటు సిఐడి సీరియల్ లో నటించిన అతను ఇప్పుడు సరికొత్తగా ఏదైనా చేయాలనుకున్నాడట. అందుకే భక్షక్ స్టోరీ చెప్పగానే వెంటనే ఒప్పుకున్నాను అని చెప్పకొచ్చాడు అభిజిత్.

 

అయితే భక్షక్ సినిమాలో భూమి ఫడ్నేకర్ జర్నలిస్ట్ వైశాలి పాత్రలో నటిస్తుంది. బీహార్లో జరిగిన భయంకరమైన సంఘటన ఆధారంగా ఈ చిత్రాన్ని తర్కెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో ఆదిత్య శ్రీవత్సవ సాయి తమంకర్ లు ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. బ్రజేష్ సింగ్ పాత్రలో ఆదిత్య ఈ సినిమాలో ప్రతినాయకుడిగా కనిపిస్తారు. బాలికలపై జరుగుతున్న అఘాయిత్యాలు అసలు నిజాలను న్యాయం ముందుకు తీసుకురావాలని ఒక జర్నలిస్టు పోరాటమే భక్షక్.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -