CM Jagan: విజయసాయిరెడ్డికి భారీ షాకిచ్చిన సీఎం జగన్.. వైవీకి ఆ బాధ్యతలు ఇవ్వడంతో?

CM Jagan: వైయస్సార్సీపి పార్టీలో కీలక నేతగా ఉన్నటువంటి విజయ్ సాయి రెడ్డికి ప్రస్తుతం పార్టీలో ప్రాధాన్యత పూర్తిగా తగ్గుతుందని తెలుస్తుంది.ఎంపీగా కొనసాగుతున్నటువంటి విజయసాయిరెడ్డి ఢిల్లీలో పార్టీ వ్యవహారాలను చూసుకుంటూ కేంద్రంతో సన్నిహితంగా ఉండటమే కాకుండా పార్టీకి సంబంధించిన అన్ని విషయాలను ప్రకటిస్తూ ఉంటారు. అయితే విజయ్ సాయి రెడ్డితో ఎంత చనువుగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం ఆయనని దూరం పెడుతున్నారు.

ఈ క్రమంలోనే ఇకపై పార్టీ తరఫున ఢిల్లీ వ్యవహారాలన్నింటిని చూసుకునే బాధ్యతను జగన్మోహన్ రెడ్డి విజయ్ సాయి రెడ్డికి కాకుండా వైవి సుబ్బారెడ్డి కి అప్పగించబోతున్నారు. నాలుగు సంవత్సరాలుగా వైవి సుబ్బారెడ్డి టీటీడీ చైర్మన్గా బాధ్యతలు తీసుకున్నారు. ప్రస్తుతం ఈయనని ఈ పదవి నుంచి తొలగించడంతో ఆయనకు ఏదో పదవి ఇవ్వాలి కాబట్టి ఢిల్లీ తరఫున పార్టీ వ్యవహారాలను చూసుకొనే బాధ్యతను అప్పగించారు.

 

ఇలా విజయసాయిరెడ్డిని తప్పించి వైవి సుబ్బారెడ్డికి ఆ బాధ్యతలు అప్పజెప్పడంతో జగన్మోహన్ రెడ్డి విజయ సాయి రెడ్డిని దూరం పెడుతున్నారని స్పష్టంగా అర్థమవుతుంది.జగన్మోహన్ రెడ్డికి రైట్ హ్యాండ్ గా ఉన్నటువంటి విజయసాయిరెడ్డిని ఇలా పార్టీ దూరం పెట్టడానికి కారణం ఏంటి అనే విషయానికి వస్తే… విజయ్ సాయి రెడ్డి ఢిల్లీలో ఉంటూ ఏదో గూడుపుఠాణి చేయబోతున్నారని జగన్ దృష్టికి రావడంతోనే ఆయన క్రమక్రమంగా తనని దూరం పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడిందని తెలుస్తోంది.

 

ఇలా పార్టీకి అనుకూలంగా మాట్లాడుతూనే లోపల పార్టీకి నష్టం వాటిల్లే విధంగా విజయసాయిరెడ్డి ప్రవర్తిస్తున్నారన్న సందేహాలు జగన్మోహన్ రెడ్డికి రావడం వల్లే విజయ్ సాయి రెడ్డికి ఈ పరిస్థితి ఎదురైనదని తెలుస్తుంది. మరి తన బాధ్యతలను వైవి సుబ్బారెడ్డికి అప్పజెప్పడంపై విజయ్ సాయి రెడ్డి స్పందన ఎలా ఉంటుంది అనే విషయం తెలియాల్సి ఉంది.

 

Related Articles

ట్రేండింగ్

AP Roads: ఏపీలో రోడ్ల పరిస్థితిని చూపించి ఓట్లు అడిగే దమ్ముందా.. వైసీపీ నేతల దగ్గర జవాబులున్నాయా?

AP Roads:  ఒక రాష్ట్రం అభివృద్ధి బాటలో నడవాలి అంటే ముందుగా ఆ రాష్ట్రంలో మౌలిక సదుపాయాలన్నీ కూడా సక్రమంగా ఉండాలి మౌలిక సదుపాయాలు అంటే రోడ్లు కరెంట్ నీరు వంటి వాటివి...
- Advertisement -
- Advertisement -